period lets talk

అమ్మకి Periods

Talk to boys about periods… ??? How easy is it?

అప్పటికది last half an hourలో పదోసారి time చూసుకోవడం. అంటే, on an average ప్రతీ మూడు నిమిషాలకు టైం చూసుకున్నట్టు. ఇదేమైనా obsession ఆ అనుకుంటూనే మళ్ళీ ఇంకోసారి చేతికున్న watch వంక చూసింది. నాలుగయింది. పని చేయబుద్ధి కావడం లేదు. ఎప్పుడెప్పుడు ఐదవుతుందా, ఇంటికి వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తుంది సుధ. విసుగ్గా చుట్టూ చూసింది. ‘వీళ్ళలో sincere గా work చేస్తున్న వాళ్ళెంతమందో’ నవ్వుకుంది. ఏదో రకంగా time pass చేయాలి కాబట్టి wash room వైపు నడిచింది.

Toiletలోకెళ్ళాక తెలిసింది spotting అవుతుందని. ‘తొందరగా వచ్చేసిందేంటి? ఇంకా టైం ఉంది కదా అని bag లో pads పెట్టుకోలా! పక్క street లో ఉన్న super market కి వెళ్ళి తెచ్చుకోవాలిప్పుడు’ అనుకుంటూ బయటికి నడిచింది.


Period timeలో నడుము నొప్పి, కడుపులో నొప్పి, heavy bleeding, pms లాంటివేవీ ఉండవు తనకి. Bleeding అవుతూ ఉంటే periods లో ఉన్నట్టు, ఆగిపోతే అయిపోయినట్టు. Time చూసుకుని pad change చేసుకోడం తప్ప ఇంకా వేరే ఏ ఇబ్బందీ ఉండదు. ఇలా sudden గా pad available గా లేనప్పుడు వచ్చేస్తేనే కాస్త విసుగు. అయినా కొంత మందిని చూస్తే అసలంత నొప్పి ఉంటుందా అనిపిస్తుంది. వాళ్ళు పడే బాధ ముందు ఈ discomfort nothing అనిపిస్తుంది. 


Permission తీస్కుని బయటికి వచ్చాక ‘నిత్య వాళ్ళిల్లు కూడా దగ్గరే కదా. దాని దగ్గరికెళ్తే better కదా’ అనిపించింది. Supermarket  plan cancel  చేస్కుని బండి వాళ్ళింటి వైపు తిప్పింది.


మున్నా గాడు స్కూల్ నుంచి వచ్చే టైం కాబట్టి కచ్చితంగా ఇంట్లో ఉంటుంది. Surprise చేద్దాం అనుకుంటూ ఫోన్ కూడా చేయకుండా directగా వెళ్ళి door bell నొక్కింది.  

మున్నాగాడు డోర్ ఓపెన్ చేసాడు.  “హాయ్ రా” అంటూ లోపలికి నడిచి వాడి జుట్టులో చేయి పెట్టి చెరిపేస్తూ చుట్టూ వెతుకుతూ ‘అమ్మేదీ?” అంది.

Tinkle చదవడంలో బిజీ గా ఉన్నట్టున్నాడు. ‘డోర్ తీయడమే పెద్ద పని! మళ్ళీ నీకు సమాధానం కూడా చెప్పాలా’ అన్నట్టు ఓ లుక్కేసాడు నా వైపు.  కళ్ళతో bedroom ని చూపిస్తూ చాలా Casualగా ‘అమ్మకి periods! పడుకుంది” అని చెప్పేసి వాడి bookలో వాడు మునిగిపోయాడు.

talk to boys about periods
Image Credit: My boy

సుధకి మాత్రం షాక్ తగిలినట్టయ్యింది.  ‘periods ఆ?’ అప్రయత్నంగా బయటికి అనేసింది.

‘ఆ … ‘ అన్నాడు Tinkle లోంచి తల ఎత్తకుండా!

‘వీడేంటి, వీడి వయసేంటి, తిప్పి కొడితే పదేళ్ళు లేని వీడు ఏం మాట్లాడుతున్నాడు’ అనుకుంటూ, ఆశ్చర్యాన్ని  వాడికి కనపడనివ్వకుండా  “నిత్యా… ” తలుపు తోస్తూ లోపలికెళ్ళింది. అలికిడికి లేచింది.

“ఏమైందీ” అంటూ వెళ్ళి పక్కన కూర్చుంది. 

‘నీరసంగా ఉంటే పడుకున్నా!’ అని చెప్తూ ఉన్న నిత్య మాటల్ని మధ్యలోనే కట్ చేస్తూ “వాడేంటి  ‘periods’ అని చెప్తున్నాడు, వాడికేదో తెలిసినట్టు” అంది సుధ.

“తెలుసు… ఏ?” నీరసంగా అడిగింది నిత్య.

“తెలుసా? ఏం తెలుసు? ఎలా తెలుసు? వాడి వయసెంతనీ?” వచ్చిన పని మర్చిపోయింది సుధ. 

“వాడి సంగతి నీకు తెలుసు కదే… answer చెప్పే ఓపిక మనకి ఉండాలే కానీ వాడి ప్రశ్నలకు అంతముండదు.”

“అయితే?” అడిగితే ఏదైనా చెప్పేస్తావా అన్నట్టు అంది సుధ.

“అప్పుడెప్పుడో ఒకసారి అడిగాడు, ‘నేను నాన్న పొట్టలోంచి ఎందుకు రాలేదు. నీ పొట్టలోంచే ఎందుకొచ్చా’ అని.  Female bodyలో baby ని మోయగలిగేలా Uterus(గర్భ సంచి)  ఉంటుందనీ, మగ వారికి అది ఉండదు కాబట్టి వారు baby ని carry చేయలేరనీ చెప్పా అప్పుడు. 

whisper advt

కొన్ని నెలల క్రితం, మొన్నామధ్య TV లో sanitary napkins ad చూస్తూ ‘అవి ఏంటమ్మా? ఎపుడూ అమ్మాయిలే ఉంటారు ఆ adsలో ?’ అని అడిగాడు. Uterus గురించి చెప్పా కాబట్టి periods గురించి కూడా వాడు తెలుసుకోవడం  అవసరమనిపించింది.  చెప్పాను అదే!”

“ఏమని చెప్పావ్?”

Yes, I bleed!!!

“ఏముందీ… ఉన్నదే చెప్పా! అమ్మాయిలకి ప్రతీ నెలా  uterus lining ఊడిపోవడం వల్ల  period వస్తుందనీ, 

ఒక్కొక్కరి body ఆ timeలో ఒక్కోలా ఉంటుందనీ,

కొంతమందికి కడుపులో నొప్పి వస్తే ఇంకొందరికి lower back pain వస్తుందనీ,

కొంతమందికి body heavy గా అనిపిస్తే, ఇంకొంతమందికి irritability levels ఎక్కువుంటాయనీ,

కొంతమందికి ఇవన్నీకలిపి ఉండొచ్చనీ,

మొత్తం మీద ఆ time లో physical psychological stress ఎక్కువగా ఉంటుందనీ, 

puberty లో start అయ్యే ఈ menstruation, late 40s లోకి వెళ్ళే దాకా ఆడవారికి తప్పదని చెప్పాను.”

“ఏమన్నాడు మరి?”

period art

“అంతా విని దగ్గరికి వచ్చి వాటేసుకుని  ‘అయితే  నీక్కూడా వస్తుందా అమ్మా’ అని జాలిగా అడిగాడు. ఆ తరువాత నుంచీ ఎప్పుడైనా నేను ఏ కారణం  వల్లైనా weak గా ఉన్నా, చిరాగ్గా ఉన్నా వెంటనే అడుగుతాడు. ‘periods ఆ అమ్మా’ అని.”

“అయినా ఆడపిల్లలకి  చెప్పటానికే ఆలోచించే విషయాలు ఇంత తేలిగ్గా మగ పిల్లాడికి ఎలా చెప్పేసావే? వీడు మంచోడు కాబట్టి అర్ధం చేసుకున్నాడు. అందరూ అలా ఉండరు కదా! ఇలాంటి విషయాలు తెలుసుకుని ఆడపిల్లలని ఇంకా ఏడిపిస్తారు. Tease చేస్తారు. నీకు తెలియనిదేముంది?”

“అలా ఎందుకవుతుందో ఎపుడైనా ఆలోచించావా?

మనమందరం menstruation ని భూతద్దంలోంచి చూస్తూ, అదో బ్రహ్మ రహస్యంలా దాస్తూ, దాని గురించి మాట్లాడడం, బయటికి చెప్పడం  పెద్ద పాపంలా ఫీల్ అవుతూ ఉంటే పిల్లలకి (irrespective of the gender) మాత్రం అలా కాక ఇంకోలా ఎలా అర్ధమౌతుంది? మనం దాన్ని ఓ మామూలు విషయం లా చూడగలిగినపుడే కదా వాళ్ళకీ అలా అనిపించేది? 

మనుష్యుల్లో 50%  అయిన ఆడవాళ్ళందరికీ ఉండేదే కదా ఇది! Menstruation అనేది ఒక సహజ ప్రక్రియ అనీ, ఆడవారి శరీర నిర్మాణంలో ఈ menstruation  importanceని తెలుసుకుని, దానిలో సిగ్గు పడేదో, దాచుకునేదో, బయటికి తెలిస్తే పరువు పోయే విషయమేదో ఉందనే ఆలోచనే లేకుండా  దాని గురించి ధైర్యంగా మాట్లాడాలంటే ఆ పదం చుట్టూ ఉన్న rigidity ని taboo ని బద్దలు కొట్టాలి. అంతే కానీ మనమే ఇలా సందేహిస్తూ కూర్చోడం ఎలా correct? .”

“అవును. నిజమే! ఆడపిల్లలు menstruationలో వాళ్ళు face చేసే problems గురించీ, వారి health conditions గురించీ ఎటువంటి జంకు లేకుండా  openగా మాట్లాడగలిగినపుడు, రెట్టించిన ఆత్మవిశ్వాసంతో, మనోస్థైర్యంతో జీవితాన్ని face చేయగలుగుతారు.” 

“అది సరే కానీ సడన్ గా నేనేందుకు గుర్తొచ్చాను మేడం తమరికి ?” ఆటపట్టిస్తూ అంది నిత్య. 

“అమ్మో… భలే గుర్తు చేసావ్” అని టక్కున లేచి నిత్యా cupboard open చేసి pad తీసుకుంటూ  “college రోజుల్నుంచీ ఇప్పటి వరకు మనిద్దరికీ ఒకే సారి పీరియడ్ మాత్రం మారలేదే బాబూ” అంటూ బాత్రూం లోకి పరిగెత్తింది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top