please jesus kiwi

Please Jesus

అమ్మమ్మ కళ్ళు మూస్కుని, చేతులు దగ్గరకు తెచ్చి, తల పైకెత్తి, పెదవులు కదుపుతూ మౌనంగా prayer చేస్కుంటూ ఉంది. 


పక్కనే ఉన్న Kiwi అమ్మమ్మని చూసింది. అమ్మమ్మ చూస్తున్న వైపు తల పైకెత్తి చూసింది. మళ్ళీ అమ్మమ్మని చూసింది.

తల పైకెత్తి చూసి, తనూ prayer చేయడం start చేసింది. 

“Jesus! మీరు ఇప్పుడు మా ceiling  మీదే ఉన్నారు కదా Jesus! అక్కడి నుంచి మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి Jesus! మా అమ్మమ్మ కి green saree , mummy కి yellow legging, కక్కాయి (పెద్దమ్మ)కి white dress, నాకు red frock ఇవ్వండి Jesus! ! మీరు కూడా కొత్త dress కొనుక్కోండి Jesus! Please Jesus!”

2 thoughts on “Please Jesus”

Comments are closed.

error: Content is protected !!
Scroll to Top