“అమ్మా … నేను నీ బొజ్జలోంచి వచ్చా కదా?”
“ఔను నాన్నా”
“అన్నయ్య పెద్దమ్మ బొజ్జలోంచి వచ్చాడు. చెల్లి ఏమో పిన్ని బొజ్జలోంచి వచ్చింది.”
“ఔనమ్మా”
“నువ్వు, పిన్ని అమ్మమ్మ బొజ్జలోంచి, నాన్న పెదనాన్న నానమ్మ బొజ్జలోంచి….”
“ఔను రా”
“అయితే……..” ఆలోచిస్తూ!
“హా… అయితే??”
బుర్రలో ఏవో calculations నడుస్తున్నాయ్ వాడికి!
“నాన్న నీకు husband కాబట్టి నాకు నాన్న కదా!” క్లారిటీ వచ్చినట్టు చెప్పాడు.
నాన్న నీకు husband కాబట్టి నాకు నాన్న కదా
“ఏంటీ?” అమ్మకి బుర్ర blank అయింది.
“నేను నీ బొజ్జలో నుంచి వచ్చా కాబట్టి నువ్వు నాకు అమ్మ. నీకు husband కాబట్టి నాన్న నాకు నాన్న!”
Biological Connection:
కొంచెం పెద్ద అయ్యాక వాడంతట వాడే ‘ఎందుకు’ అనేది ఎలాగూ తెలుసుకుంటాడు. కానీ ఇప్పటి వాడికున్న knowledge బట్టి అమ్మకి, వాడికి direct relation ఉంది. నాన్నకి, వాడికి ఎటువంటి direct relation లేదు అనుకున్నాడు.
నాన్నని నాన్న అనడాన్ని justify చేసుకోడానికి వాడి చిట్టి బుర్ర చేసిన logical deductionని మాత్రం awwww అనుకోకుండా ఉండలేకపోయా.
అలాగే, ‘చిన్న పిల్లాడివి నీకవన్నీ ఎందుకు’ అనో, ‘పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్ నోర్మూసుకో’ అని వాడిని control చేయడమో లేక ‘నాన్నని దేవుడిచ్చాడు, దెయ్యమిచ్చింది’ లాంటి కాకమ్మ కబుర్లు చెప్పకుండా, వాడి chain of thoughts ని free గా flow అవ్వనిచ్చిన cousin ని కూడా appreciate చేయకుండా ఉండలేను.
Tendency to Observe, Question:
పిల్లల్లో సొంతగా ఆలోచించుకునే natureని, ప్రశ్నించే natureని, ప్రతీదాన్నీ ఏ ముక్కకా ముక్క విడదీసి postmortem చేసి తెలుసుకునే nature ని పెద్దవాళ్ళం మనమే spoil చేస్తుంటాం. వారి natural abilities మన selfish mottos కోసం pollute చేస్తుంటాం. చివరికి మనలా hypocrites లా తయారు చేసి వదిలేదాకా ప్రశాంతంగా ఉండలేము.
Of course, ఇవేవీ ఏ parent తెలిసి కావాలని చేసేవి కాదు.
Recreating miniature models of your own?
In the race of life, we tend to behave or acquire certain traits to please society and satisfy our egos. మన పిల్లలు మనక్కావలిసినట్టే behave చేయాలనో, మాట్లాడాలనో, మనలాగే ఉండాలనో అనుకుని వాళ్ళని అనుక్షణం tune చేస్తూ వారికి అవసరం లేని చెత్తనంతా వారి బుర్రల్లో నింపుతూ ఉంటాము.
మన పిల్లలు మన replicasలా… ఇంకా clearగా చెప్పాలంటే మనం ఏది ideal అని feel అవుతామో అలా అవ్వాలని ప్రతీ parent subconsciousగా కోరుకుంటూ ఆ దిశగా effort పెడుతూ ఉంటారు.
children or robots??
ఈ మొత్తం processలో parents మర్చిపోయే ముఖ్యమైన విషయం ఏంటంటే, ‘మన దగ్గర పెరిగే పిల్లలు, మనమేం చేయకపోయినా మనలాగే ఉంటారు, మనలానే ఆలోచిస్తారు, మన lifestyle నే ఇష్టపడతారు అని. మనలా వాళ్ళు తయారవ్వడం కోసం మనం ఎటువంటి extra effort పెట్టాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తించరు.
బలవంతంగా మన అభిప్రాయాలూ, religious, political and social inclinations ని వాళ్ళ మీద రుద్దుతూ ఉంటాము.
పిల్లలు ఎక్కడ చెడిపోతారో అని (చెడిపోవడం అనేదానికి ఎవరి definitions వాళ్ళవి) వాళ్ళపై మన పెంపకాన్ని enforce చేయడం అనేది చాలా దారుణమైన, actualగా crimeగా పరిగణించాల్సిన విషయం అనిపిస్తుంది నాకు.
మనం ఎంత వద్దనుకున్నా మనం ఎక్కడైతే ఉంటామో, ఎవరితో అయితే ఉంటామో, చుట్టూ ఉన్న society, friends వీటన్నిటి influence మనపై చాలా బలంగా ఉంటుంది. అలాంటిది మనని కని పెంచిన parents influence ఉండదా?
So, పిల్లలపై మీ అభిప్రాయాలను రుద్దడం మానేయండి. Natural గానే మీ influence వాళ్ళపై ఉంటుంది.
Originality ని uniqueness ని వాళ్ళకి దూరం చేసి, చివరికి ఏది చెప్తే అది గుడ్డిగా follow అయ్యే robots లానో Format చేసిన hard drive లానో కాకుండా, సహజంగా వారిని ఎదగనివ్వండి. ప్రశ్నించనివ్వండి.