ఆమె వల్ల కూలిపోయే పరువు

కొత్తగా వేసిన రోడ్డులేమో … కారు smoothగా వెళ్తోంది. లోపల సన్నగా AC చప్పుడు తప్ప వేరే ఏమీ వినపడడం లేదు. Accelerator  మీద కాలు ఆనించి, స్టీరింగ్ ని రెండు వేళ్ళతో పట్టుకుని relaxedగా డ్రైవ్ చేస్తోంది దివ్య. 

“ప్రశాంతంగా ఉంది వాడు రాకపోతే!” తల అడ్డంగా ఊపుతూ, నవ్వుతూ అన్నాడు. 

ఈ మధ్య కాలంలో ఏ గోలా లేకుండా వాళ్ళిద్దరే  ఈ మాత్రం ప్రయాణం చేసిన long జర్నీ ఇదే! వెనుక సీట్ లో కూర్చుని  ఏదో ఒకటి nonstop వాగుతూనే ఉంటాడు. ‘మీరెళ్ళండి! నేను అమ్మమ్మ తో ఉంటా’ అనేసరికి ‘దొరికిందే chance’ అని వాడిని వదిలేసి వచ్చారు. మాటలేమీ లేకుండా జస్ట్ ఆ quietness ని enjoy చేస్తూ వెళ్తున్నారు ఇద్దరూ.

ఫోన్ మోగింది. కాల్ పిక్ చేసి “దగ్గర్లోనే ఉన్నాం అన్నయ్యా … ఎటు నుంచి రమ్మంటావ్?” అటు వైపు రవి వాళ్ళ కజిన్. 

రవి ఫోన్ పెట్టేసాక థంబ్ ని స్టీరింగ్ మీద టాప్ చేస్తూ అంది దివ్య, “నేను రాకుండా ఉండాల్సిందేమో!”

“ఏం  కాదు! ఎక్కువ ఆలోచించకు ” అనేసి  రూట్ చెప్పడం లో పడిపోయాడు రవి. దివ్యకి మాత్రం వారం తరువాత రవి face చేయాల్సి వచ్చే disturbance బుర్రలో తిరుగుతోంది. 

రవి వాళ్ళ పెదనాన్న గారు చాన్నాళ్ళ నుంచి ఆరోగ్యం బాగోక మంచం మీదే ఉన్నారు. వారం క్రితం పోయారు. వార్త లేట్ గా అందడంతో వాళ్ళని పలకరించడానికని ఇవ్వాళ బయలుదేరి వచ్చారు. 

వెళ్లాల్సిన ఇల్లొచ్చేసింది. దిగి లోపలికెళ్ళారు.  ఆయన ప్రతీ పనీ చేసి చేసి ఉండి, అది లేని లోటు స్పష్టం గా అనిపించడం వల్లనో, లేక ఇన్నేళ్లు కలిసి ఉన్న మనిషి ఇక కనపడరనో కానీ  దివ్యని చూడ్డమే  ‘మీ మామయ్య వెళ్లిపోయారమ్మా’ భోరుమని ఏడ్చేసింది వాళ్ళ పెద్దత్తగారు!

కాస్త కుదుట పడ్డాక ‘బాబెలా ఉన్నాడనీ, ఏం చదువుతున్నాడనీ, ఎక్కడ వదిలేశామనీ… ‘ మామూలు విషయాలవీ మాట్లాడడం మొదలెట్టింది పెద్దావిడ. ముగ్గురు తోడికోడళ్లు, ఇద్దరు ఆడపడుచులు, అత్తగారితో  గది లోపల దివ్య కూర్చుంటే, జరగాల్సిన కార్యక్రమాల గురించిన చర్చ జరుగుతోంది, ఆరుబయట గేటు ముందు రవికి, అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్యలు, తక్కిన మగవాళ్ళకి! ఏ చావు ఇంట్లో అయినా స్టాండర్డ్ procedure ఇది. బయట ఆ చర్చలు ఆగాక, రవి లోపలికి  వచ్చి పెద్దమ్మతోనూ, వదినలతోనూ మాట్లాడాక, తిరిగి బయలు దేరారు. 

“మా పెద్దమ్మ నిన్నే చూస్తూ ఉంది తెలుసా?” కార్ ఎక్కాక తీరిగ్గా అన్నాడు రవి. 

“ఔనా…నేను మాటి మాటి కీ ఫోన్ చూస్కుంటున్నాననేమో! వీడు continuous గా message లు పెడుతూ ఉన్నాడు.”

“నీ ఫోన్ నే చూసిందో, నిన్నే చూసిందో రేపటి కల్లా తెలిసిపోతుంది, ఆగు” రవి నవ్వుతూనే అన్నా, జరగబోయే రచ్చ కళ్ళ ముందు మెదిలి దివ్య మాత్రం ఇబ్బందిగా కదిలింది సీట్ లో. ఇలా జరుగుతుందని తనకు ముందే తెలుసు. 

“అందుకే రానన్నాను. మహా అయితే, ఎంత పొగరో ఆ అమ్మాయికి రాలేదనేవాళ్ళు! వస్తే ఇలా ఈకకి ఈక తోకకి తోక పీకుతారు” చిరాగ్గా అంది.

“దివ్యా… నువ్ వచ్చినా ప్రాబ్లెమ్ యే! రాకపోయినా ప్రాబ్లెమ్ ఏ! లైట్ తీస్కో”

దీనంతటికీ కారణం…. దివ్య attire! 

Parrot green colour షార్ట్ కుర్తి, ankle length కాటన్ ప్యాంట్, boycutతో ఉంది దివ్య.  మెడలో తాళి, నల్లపూసలు,కాళ్ళకు మెట్టెలు లాంటివే కాదు… బొట్టు, కాటుక, లిప్స్టిక్, దిద్దులు, గాజులు, పట్టీలు, ఉంగరాలు లాంటివేవీ దివ్య ఒంటి మీద లేవు. నాలుగు నెలల క్రితం ఎండాకాలంలో జుట్టుని మేనేజ్ చేయడం చిరాకనిపించి, తిప్పి కొడితే నెలలో వచ్చేసే జుట్టు కోసం ఎందుకు ఇంత ఆలోచించడం అనిపించి, కొడుకు చేతికి trimmer ఇచ్చి గుండు చేయమంది. వాడు చేసాడు. ఆ  గుండు కాస్తా ఇప్పుడు boycut కి వచ్చింది. సో, ఆ రకంగా జుట్టు, జడ, పోనీ లాంటివో, వాటికి తగిలించడానికి వాడే clips, bands కూడా లేవు.

Generalగా దివ్య, ఇంట్లోనూ, బయటా పాంట్లు, tshirtలు లాంటివి వేసుకుంటుంది, వీలుగా ఉంటాయని. ఎండాకాలంలో అప్పుడప్పుడు కాటన్ కుర్తీలు, కాటన్ ప్యాంట్లు వేసుకుంటుంది. బొట్టు, etc ఏమీ ఉండకపోవడంతో చాలా మంది ‘మతం తీస్కున్నావా’ అని అడుగుతారు, బొట్టు, గాజులు, తాళి వేస్కోకుండా ఉండాలంటే కనీసం ఆ మాత్రం valid justification ఉండాలన్నట్టు. నాన్న నాస్తికుడు అవ్వడం వల్ల, పుట్టిన దగ్గరి నుంచి నాస్తికురాలైన దివ్యకి తన ముందు తరం ఫాలో అయిన హిందూ మతమే కాదు, మనుషుల్లో ప్రశ్నించే తత్వాన్ని తుడిచేసి, తలాడించమని బోధించే ప్రతి మతమూ దూరమే. సో, దివ్య అవతారానికి, మతాలకీ అసలు సంబంధమే లేదు.

అలా అని దివ్య చిన్నప్పటి నుంచీ ఇలానే లేదు. చిన్నప్పుడు అని ఏముందిలే?  నాలుగేళ్ళ క్రితం ఉన్నట్టు, ఇప్పడు లేదు. నాలుగేళ్ళ క్రితం ఉన్నట్టు, ఎనిమిదేళ్ల క్రితం  లేదు. ఎనిమిదేళ్ళ క్రితం ఉన్నట్టు, పదేళ్ళ క్రితం  లేదు.  మార్పు ఏ మనిషికైనా సహజం. అయినా సరే, ఆ విషయాన్ని ఒప్పుకోడానికి అస్సలు మనసొప్పదు మనుషులకి. మార్పుని చెడు(నెగటివ్) గానూ, మారకుండా rigid గా closed గా ఉండే తత్వాన్ని మంచి(పాజిటివ్)గానూ చూస్తారు!

చిన్నప్పుడు ఆడపిల్లలు వేసుకునే వస్తువులన్నీ వేసుకునేది దివ్య. ఇంకా చెప్పాలంటే  మోజు కూడా ఉండేది. బాగా చిన్నప్పుడు గాజులు, ఆ తరువాత పట్టీలు, ఆ తరువాత ఓణీ, చీర లాంటి వాటి మీద బానే ఇంటరెస్ట్ ఉండేది.

7th, 8th classes లో అమ్మ నల్లపూసలు వేసుకుని తిరిగేది. పెద్దమ్మ, అమ్మమ్మ, ఇంటి చుట్టూ పక్కన అమ్మలక్కలందరూ అలా వేసుకోకూడదు అని తిట్టినా ‘నాకు బాగుంది’ అని వేస్కుని తిరిగేది. 

చీర, లంగా-ఓణీలు కట్టుకుంటే చూడ్డానికి బాగుంటుంది అనుకునేది. ఎక్కువ కట్టుకునేది కాదు కానీ ఇష్టం ఉండేది. ఒకవేళ ఎప్పుడైనా కట్టుకున్నా, ఒళ్ళు అలిసే పనులో, చెమట పట్టే పనులో చేసి పొడిచేసేదేం ఉండేది కాదు కనుక, కట్టిన ఓణీ నలక్కుండా కూర్చునేది, తిరిగేది. నడుము కనిపించడం, ఏమీ కనపడకుండా సర్దుకోవాల్సి రావడం ఇబ్బంది అనిపించినా, కట్టుకున్నప్పుడు ఆ పని తప్ప చేయాల్సిన పని వేరే ఏమీ లేక దాన్ని అప్పట్లో పెద్ద ప్రాబ్లెమ్ లా చూసేది కాదు. 

ఎండాకాలం వస్తే, మల్లెపూలో, జాజి పూలో ఓపిగ్గా కూర్చుని మరీ కట్టుకునేది. ఇంత బారు జడలో, నాలుగు పేటల్లో జడ బారు పూలు పెట్టుకుని తిరిగేది. ఇప్పటికీ మల్లెపూలు అంటే ఇష్టమే కానీ మల్లె పూలు పెట్టుకోవాలి అంటే ఫ్రెష్ గా స్నానము చేసి వేరే ఏ పనీ చేయకుండా పూలు పెట్టుకుని తిరగడమో, కూర్చోడమో చేయాలి కానీ పనుల జోలికి వెళ్లడం ఇష్టం ఉండదు. అలా తనకిప్పుడు కుదరదు కాబట్టి, కుదిరినా ఏ రాత్రి పూటో మాత్రమే కుదురుతుంది కాబట్టి పూలు పెట్టుకోవడం మానేసింది తప్ప పూలు పెట్టుకోడం ఇప్పటికీ ఇష్టమే

పెళ్ళి అయ్యాక ఆఫీస్, ఇంటి పనుల మధ్య చీర కట్టుకోవడం అనేది పెద్ద పనిలా అనిపించేది. దాని కోసం రోజుకో పావుగంట టైం కేటాయించడం కష్టం అనిపించేది. At the same time, చీర కట్టుకుని పనులు చేయడం తన వల్ల కాదు. అందుకని చీరని ఫంక్షన్స్ కి, స్పెషల్ occassionsకి పరిమితం చేసేసింది. తరువాత్తరువాత అది కూడా మానేసింది. ఏదైనా స్పెషల్ occassions అప్పుడు ఇంట్లో పని, వంటలతో పాటు ఈ రెడీ అవ్వడం ఇదంతా దేని కోసం అనిపించేది. వేరే ఎవరో చేస్కునే functions కోసం ‘నేను చీరలు కొనుక్కోవడం ఏంటి పిచ్చ కాకపోతే’ అనిపించేది. చీరలు కొనుక్కోవడం, వాటిని కుట్టించుకొని maintain చేయడం ఇదంతా తలనొప్పి వ్యవహారం అనుకుంది. తను వేసుకునే dressesయే ఎక్కడికెళ్ళినా వేసుకోడం మొదలెట్టింది. దానికి తోడు ఆ చీర కట్టుకున్న దగ్గర్నుంచి దాన్ని సర్దుకుంటూ కూర్చోవాలి. అసలు సగానికి పైగా ఒళ్ళంతా కనిపించి, సైడ్ నుంచి చూస్తే breast shape క్లియర్ గా తెలిసిపోయే, గట్టిగా ఒక్కసారి లాగితే కుప్పలాగా ఊడిపోయే చీర ఏ రకంగా ఆడపిల్లలకి సేఫ్ ఓ దివ్య కి అర్ధం కాదు. Jeansలు, tshirtలు చీర విప్పడం కంటే కాస్త ఓపిగ్గా చేయాల్సిన పని. safety wise చూస్కుంటే అవే బెటర్ అమ్మాయిలకి. కుచ్చిళ్లని, పైట అనీ, స్టెప్స్ అనీ చీర కట్టుకుని సగం ఒళ్ళు చూపించడం కంటే, చక్కగా ఓ స్కర్ట్ ఓ, జీన్స్ ఓ, nighty ఓ తగిలించుకుని ఏమీ సర్దుకోవాల్సిన అవసరం లేకుండా ఒళ్ళంతా కవర్ కవర్ చేస్కుని ఉండడం సుఖం కదా?

తలకు పోసుకున్నపుడల్లా, జుట్టు దిద్దుల్లో ఇరుక్కుంటుంది అని దిద్దులు తీసేసి తలకు పోసుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు. అమ్మ దగ్గర్నుంచి బయటికొచ్చేసాక ప్రతీ పనీ తనే చేసుకోడంలోని నొప్పి తెలిసాక, ప్రతీ చిన్న పనీ టైం consuming, needs lot of effort అనిపించడం మొదలయ్యింది. ‘ఈ దిద్దులు పెట్టుకునేది ఎందుకు? తీసేది ఎందుకు?బోల్డు టైం వేస్ట్’ అనిపించి  అని దిద్దులు అప్పుడప్పుడూ, ample time ఉన్నప్పుడు, లేదా ఏదైనా functions ఓ occassions ఓ ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకొనేది.

బాబు పుట్టాక చాన్నాళ్లు ఇంట్లో ఉండిపోవడంతో బయటకు వెళ్ళేప్పుడు, బయటికి వెళ్ళాలి కాబట్టి రెడీ అవ్వడం అనే conceptయే చిరాకనిపించేది. ఇంట్లో ఎలా ఉన్నానో, బయటికి కూడా అలానే nighty తోనో, నైట్ డ్రెస్ తోనో వెళ్ళిపోతే బాగుండు కదా అనిపించేది. Baby care వల్ల నిద్ర సరిగా లేక,  self careకి టైం సరిపోక  ఒక్కోసారి hair comb కూడా చేసుకునేది కాదు. బయటికి వెళ్ళేటపుడు ఆ జుట్టంతా చిక్కు తీసి, జడ వేయడానికే బోల్డు టైం పట్టేసేది. విసుగనిపించేది. ఇంతింత టైం మనల్ని మనం present చేసుకోడానికి waste చేయాలా అనిపించడం మొదలయ్యింది. 

నెమ్మది నెమ్మది గా వొంటి మీద నుంచి మెట్టెలు, గాజులు, మెడలో చైన్ అన్నీ వెళ్ళిపోయాయి. Convenient గా ఇంట్లోనూ, బయట ఒకేలా ఉండేలా t shirt, pantsకి మారిపోయింది.

పని మాలా గుర్తు పెట్టుకుని మరీ బొట్టు పెట్టుకోకపోతే ఏమైంది అనిపించింది. బొట్టు పెట్టుకోడం కూడా మానేసింది. 

దివ్య లో వచ్చిన ఈ transition overnight వచ్చింది కాదు. అలా అని ఏదో rebellious గానో radicalగానో ఉండాలన్న identity కోసమో, అలా ఉండటంలోని kick కోసమో, attention కోసమో  చేసింది కూడా కాదు. తన వీలు బట్టి, తనకు కావలసినట్టు తన attireని  మార్చుకుంది. It is just based on her convenience and comfort!

వేసుకునే బట్టలు, నగలు, attire అంతా బయట వాళ్ళకు మనల్ని మనం present చేసుకోడానికే. అది మన original personalityని represent చేయాలి. ‘ఎలా ఉంటే జనాలకు నచ్చుతాను’… ‘ఎలా ఉంటే చూసేవాళ్ళకు ఓకే కాదు’ ‘దాని కోసం నన్ను నేను ఎలా మార్చుకొని present చేసుకుంటే నచ్చుతాను?’ అని లెక్కలేసుకుని కష్టపడే కన్నా ‘ఎలా ఉంటే comfortable గా ఉంటాను’ … ‘ఎలా ఉంటే నా original self కి నేను దగ్గరగా ఉంటాను’ అన్నది ఎక్కువ important అని ఫీల్ అవుతుంది తను.

బయటికొకలా, లోపలికొకలా ఉండాల్సి వచ్చే strenuous job తన వల్ల కాదు అనిపించింది. ఎవరో ఏదో అనుకుంటారనో, ఎవరి expectationsనో meet అవ్వడం కోసమో,  ఎవరి egoనో gratify చేయడం కోసమో, ఎదుటి వాళ్ళని మెప్పించడం కోసమో project చేస్కునే unreal image కంటే రియాలిటీకి  closeగా ఉండడం బెటర్ అనుకుంది. బయట వారి కోసం మనం కాని character ని మోసుకు తిరగడం కంటే ఎవరేమనుకున్నా లెక్క చేయకుండా, ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండడంలో బోల్డు సుఖముంది.

ఇంట్లో ఎలా ఉంటున్నామో, ఎలా behave చేస్తున్నామో, ఏది ఇష్టపడతామో, ఏది ఇష్టపడమో, same అలాగే నలుగురిలోనూ, చుట్టాలలోనూ, పెళ్ళిళ్ళ లోనూ, దినాలలోనూ ఉండడంలోని weightless feeling ని ఒక్కసారి experience చేసాక ఇంక దివ్య చాలా liberated గా ఫీల్ అయింది.

తన looks, బట్టలు, అవతారం, జుట్టు తనకి మాత్రమే సంబంధించిన విషయాలు, Partnerకి కూడా అవసరం లేని విషయాలు. ఒకవేళ తక్కిన ఆడపిల్లల్లా ఆమె ఉండకపోవడం వల్ల పార్టనర్ కి తనపై attraction తగ్గితే, ఆ అట్రాక్షన్ అంతా ‘తను వేసుకునే బట్టల వైపే కానీ తన వైపు కాదు కదా’ అనిపిస్తుంది. ఆ image ని తను maintain చేయలేదు. But, ఈ విషయంలో ఎప్పుడూ రవి కి తనకి ఎటువంటి difference లేదు. రవి ఎప్పుడూ తన attire విషయంలో interfere అవ్వలేదు. తనను unattractive గానూ ఫీల్ అవ్వలేదు. అందుకే రవికి, దివ్య కి ఈ విషయంలో ఎప్పుడూ ఎటువంటి discussion జరగలేదు. 

‘రవి ఏదో మంచోడు కాబట్టి, అర్ధం చేసుకున్నాడు కాబట్టి, బాగా ఆలోచిస్తాడు కాబట్టి నీకు సాగుతుంది కానీ, రవికి ఓకే కాకపోతే ఏం చేసేదానివి? రోజూ గొడవ పడతావా? చచ్చినట్టు compromise అవుతావు’ అనేవాళ్ళు ఉన్నారు. ‘రవికి ఓకే కాబట్టి రవి దివ్య లైఫ్ లో ఉన్నాడు, ఓకే కాకపోతే ఉండడు కదా’ అనే విషయం చెప్పి వాళ్ళకి రవి మీద ఉన్న positive ఒపీనియన్ ని పోగొట్టడానికి try చేయలేదెప్పుడూ. రవిని చూసి ఇంప్రెస్స్ అయ్యి ఆడవాళ్ళ attire విషయంలో కలగజేసుకోడం మానేసే మగవాళ్ళెవరైనా ఉంటే అది మంచిదే కదా అనిపిస్తుంది.

మొదట్లో ఫంక్షన్స్ కి పెట్టుకునేది కాబట్టి అత్తా మామలు పెద్దగా పట్టించుకోలేదు. రానురానూ అక్కడ కూడా పెట్టుకోవడం మానేయడంతో పాటు, వాళ్ళు ఊరు మారడం, కొత్త ఊర్లో చుట్టు  పక్కల వాళ్ళు ‘ఏంటమ్మా మీ కోడలు’ అని అడగడం మొదలెట్టాక, నస మొదలు పెట్టారు.

‘వాళ్ళ చెల్లి, తను ఒకింట్లోనే పుట్టారుగా? ఆ పిల్ల ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటుంది. వాళ్ళ cousins అందరూ అలానే ఉంటారు. దీనికేం అయింది’  లాంటి మాటలతో రవిని విసిగించడం మొదలెట్టారు. ‘తన బట్టలు, తన ఇష్టం, ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటుంది, మీకు సంబంధం లేదు’ అని రవి సమాధానం చెప్పేసి వదిలేసినా, వాళ్ళు మాత్రం వదిలే వాళ్ళు కాదు. ‘After all కోడలు… మా మాట ఎందుకు లెక్క చేయదు’ అన్నట్టు రవిని సాధించేవాళ్ళు. 

అలాంటిది, ఇప్పుడు వాళ్ళ చుట్టాలింటికి, అందులోనూ చావు ఇంటికి దివ్య ఇలా వెళ్ళడం పెద్ద గొడవనే తీసుకు రావచ్చు. 

అదే కాక, ఈ మొత్తం ప్రాసెస్ లో రవి emotionalగా నలుగుతున్నాడు అనిపిస్తుంది దివ్య కి. ‘అదేమీ లేదు, నువ్ నా గురించి ఏం పట్టించుకోకు’ అని  రవి చెప్పినా దివ్యకి convincing గా అనిపించదు. 

రవి వాళ్ళ అమ్మా నాన్నల ఆరోగ్యం ఎప్పుడూ బాగోదు. అందుకని వాళ్ళతో ఎటువంటి గొడవ పెట్టుకోడు. వాళ్ళేమన్నా ఇలాంటి విషయాల గురించి టాపిక్ తెచ్చినా, తను చెప్పాల్సిన మాట చెప్పేసి ఊరుకుంటాడు తప్ప వాళ్ళని convince చేయడానికి try చేయడు. డిస్కషన్ పొడిగించడు. రవి వాళ్ళ అమ్మ నాన్న ఎంత మూర్ఖులో దివ్యకి తెలుసు. ‘గట్టిగా మాట్లాడొచ్చు కదా’ అని దివ్య అడిగితే ‘ఈ వయసులో వాళ్ళు అంతే ఉంటారు. మూర్ఖంగానే ఉంటారు. వదిలేయడమే. ఏదైనా గట్టిగా మాట్లాడి గొడవ అయితే వాళ్ళ ఆరోగ్యం పాడవ్వడం తప్ప వాళ్ళలో కొంచెం కూడా మార్పు రాదు. వాళ్ళు అనుకునేది వాళ్ళు అనుకోనీ, మనకు పోయేదేముంది?’ అనేస్తాడు  రవి.

భుజం పట్టుకుని కుదుపుతూ ‘cheer up అమ్మాయ్… ఏం ఆలోచించకు’ ఇంటి ముందు కార్ ఆపాడు. కార్ పార్కింగ్ సౌండ్ కి ‘హాయ్’ అంటూ  పరిగెత్తుకుంటూ బయటికి వచ్చిన కొడుకుని చూసి నిట్టూరుస్తూ కార్ దిగింది. 

తరువాత రోజు, రవి వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాడు. 

రవి తిరిగి వచ్చిన వెంటనే ఎదురెళ్ళి “ఏమన్నారు?” దివ్య అడిగింది. 

“ఏముంది! మామూలే! అలా వెళ్ళారు, ఇలా వెళ్ళారు అని ఏదో అంటారు! ఇంకేం ఉంటుంది? ” మాట దాటేయడానికి try చేస్తూ అన్నాడు. 

” అలా వెళ్ళడం అంటే?” దివ్య రెట్టించింది. 

“చనిపోయిన వాళ్ళింటికి ఎలా వెళ్ళాలో తెలీదా అని?”

“మనమెలా వెళ్ళామో, ఎవరు చెప్పారు అట?”

“ఎవడు చెప్తే ఏముందమ్మాయ్? అందరూ అదే బాపతు! నువ్వెళ్ళిందేమో మనిషి పోయిన వాళ్ళని పలకరించడానికి! అక్కడ వాళ్ళు చూసేది, నువ్వేం వేస్కున్నావ్, ఎలా ఉన్నావ్, ఎలా వచ్చావ్ అని. వీళ్ళకి మనుషుల కంటే, మనుషుల కట్టు బొట్టే ఎక్కువంట. పరువు మర్యాదలంట” వెటకారం గా అన్నాడు. 

“నీకో విషయం తెలుసా… ఇవ్వాళో, రేపో, ఈ వారమో లేక ఈ నెల లోపో నేనేదైనా ఆక్సిడెంట్ లో పొరపాటున పోయాననుకో!” నవ్వుతూ అన్నాడు. రవి ఆ మాట అన్న టోన్ కి దివ్య కి కూడా నవ్వొచ్చి నవ్వేసింది. 

“అదంతా నువ్వివ్వాళ బొట్టు, గాజులు, తాళి వేసుకోకుండా వెళ్ళి ఆవిడ్ని కలిసి రావడం వల్లనే అని తీర్మానించేస్తారు. బ్రతికుండగానే మాటలతో పీక్కు తిని మరీ నిన్నుచంపడానికి కూడా వెనుకాడరు వీళ్ళు. నాకేదైనా అయితే నీకు సేఫ్టీ కావాలని ముందే పోలీస్ కంప్లైంట్ ఇస్తే బెటర్. అంత మూర్ఖులు వీళ్ళు. ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం మనకే టైం వేస్ట్. లైట్ తీస్కో!” రవి గొంతులో బాధ.

రవి చిరాకులో ఉన్నాడని అప్పటికి ఇంక మాట్లాడలేదు దివ్య. 

పడుకునేపుడు రవి బుగ్గ పట్టుకుని అడిగింది దివ్య “డల్ గా ఉన్నావ్? ఏమైంది నాకు చెప్పవా?”

“ఏమీ లేదు దివ్యా! ఎప్పుడూ ఉండేదే! వాళ్ళు మారరు. వాళ్ళు expect చేస్తున్నారని వాళ్ళ కోసం మనం మారడం అనేది utter foolishness. పోనీ మనమెలా ఉన్నామో అలా మనల్ని వదిలేస్తారా అంటే continuous గా torture చేస్తూనే ఉంటారు. పేరెంట్స్ కాబట్టి వాళ్ళని వదలడమూ కుదరదు. వాళ్ళ పనికిమాలిన practices ని tolerate చేయడమూ అవ్వదు. మనక్కావల్సినట్టు మనముంటూ, వాళ్ళు మన లైఫ్ ని disturb  చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా , వాళ్ళని మనం ignore చేయాల్సిన అవసరం లేకుండా, బాలన్స్ maintain చేయడం అనేది కష్టం కానీ తప్పదు. మనం వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నువ్వివేం ఆలోచించకు” నచ్చచెపుతున్నట్టు చెప్పేసి నిద్ర పోయాడు. 

తనని మారమని అడగలేక, ఇంట్లో వాళ్ళకి అర్ధం అయ్యేలా చెప్పలేక రవి నలుగుతున్నాడేమో అనిపిస్తుంది దివ్యకి. రవి మాత్రం ‘నిన్ను మారమని నేనెందుకు అడగాలి. అది నీ choice. నీ ఇష్టం’ అంటాడు. 

నిద్రలోకి జారుకున్న రవి కి దగ్గరగా జరిగి భుజం చుట్టూ చేయి వేసి ఆలోచనలో పడింది.

అసలీ మనుషుల ప్రాబ్లెమ్ ఏంటి? పుట్టిన దగ్గర్నుంచీ , ఆడపిల్లలకు అందం అనీ, అవి వేసుకుంటే ఆడతనం ఉట్టిపడుతుందనీ పనికి మాలిన కబుర్లన్నీ చెప్పి పెంచుతారు. అదే కరెక్ట్ అనుకుని ఆడపిల్లలూ పెరుగుతారు. ఒక వేళ, వాళ్ళంతట వాళ్ళకు సొంతగా వేసుకోవాలని లేక వేస్కోకపోతే, మగరాయుడిలా ఏంటా బట్టలు అనో, ఏంటా వేషాలు అనో మాటలు పడాల్సి వస్తుంది. ఈ గోలంతా ఎందుకు అని నలుగురినీ మెప్పించడానికి, అందరి చూపుల్ని తప్పించుకోడానికి వేస్కుని తిరుగుతారు. అలాగే ఉంటారు. 

‘అమ్మాయి అంటే అందంగా పొడుగ్గా ఉండే జుట్టు, మచ్చ లేని మొహం, చెక్కినట్టుండే శరీరం’ అనే భావజాలం societyలో పాతుకుపోయి ఉండడం వల్ల, దాన్నే standard గా తీస్కుని అలా ఉండకపోతే inferiorగానూ, problemగానూ ఫీల్ అవుతున్నారు ఆడపిల్లలు. అలా మెప్పించేలా ఉండడానికి ఎంతో కష్టపడుతుంటారు.

ఇద్దరాడపిల్లలున్న ఫ్రెండ్ ఒకమ్మాయి ‘పిల్లల్ని స్కూల్ కి పంపేప్పుడు వాళ్ళని రెడీ చేసి స్కూల్ కి పంపడానికి చాలా టైం పట్టేస్తుంది. ఏ బాయ్ కట్ ఓ, బాబ్ కట్ ఓ చేయించేయడానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అందరు girls లాగా long hair ఏ కావాలని గోల చేస్తున్నారు’ అని గొడవ చేసేది. వాళ్ళకి జడలేసి, బొట్టు పెట్టి, మిగిలిన పనులన్నీ చేసి పంపడానికి కనీసం ఒక 20 mins extra కావాలి. ఇది కాకుండా వారానికి ఒకసారో, రెండు సార్లో headbath అనే అతి పెద్ద టార్చర్ పేరెంట్స్ కి, పిల్లలకి కూడా! ఈ రకంగా రోజుకి పేరెంట్స్ టైం 20 mins, పిల్లల టైం 20 mins కలిపితే మొత్తమ్ 40 mins …! అదే రెడీ అవ్వడం అనే process రోజుకి ఒక మూడు సార్లు ఉంటే నెలకి ఎంత అవుతుంది? ఆ టైం మిగిల్చి మాత్రం వీళ్ళేం పీకుతారు అనే పనికి మాలిన argument ఒకటి readyగా ఉంటుంది ఈ మాట అనడమే. ఖాళీగా ఫోన్ ఏ చూస్కుంటారో, లేక ఇంకో అరగంట ఎక్స్ట్రా పడుకుంటారో, లేక ఊరికే గంతులేస్తారో అనేది వాళ్ళ చాయిస్. మనకి అనవసరం. మనం ఆలోచించాల్సిన విషయం ‘Unisex dressing saves lots of time and efforts’.

అసలు బేసిక్ biology లోనే ఆడ మగ లో తేడా ఉన్నప్పుడు, ఇంకా ఈ పై పూతలతో ఆడని ఆడ అని నిరూపించాల్సిన పనేముంది? ఆడవాళ్ళకి అదే ఎందుకు బేసిక్ ఐడెంటిటీ అవ్వాలి? 

చాలా మంది ఆడవాళ్ళు, ఇంట్లో బొట్టు, గాజులు, తాళి లాంటివి వేసుకోరు(మరీ orthodox అయితే తప్ప). కానీ specific గా కొన్ని places like temples, అత్తగారిల్లు, చుట్టాలిల్లు లేక పెద్ద gathering ఉండే functions కి మాత్రం అన్నీ వేస్కుని వెళ్తారు. మామూలుగా modern dresses వేసుకునే అలవాటున్నా, పండగలకు, పబ్బాలకు, ఊర్లలో అత్తగార్ల దగ్గరకు వెళ్లేప్పుడు మాత్రం అక్కడ ఆ ఊర్లో acceptableగా ఉండే clothing కి, attire కి మారిపోతారు.ఎందుకంటే, వాళ్లకు  కావలసినట్టు  మనముండకపోతే అనవసరమైన ప్రాబ్లెమ్ కాబట్టి. 

అలా అని, ఈ women ఇంట్లో  వేసుకునే బట్టలు, ఇంట్లో ఉన్నపుడు వీళ్ళ attire అత్తా మామలకు తెలీదా అంటే అదీ కాదు. అవన్నీ సిటీలోనో, టౌన్లోనో మాత్రమే acceptable! “మీ కోడలేంటమ్మా ఆ బట్టలు?”అని చుట్టూ పక్కల వాళ్ళు వీళ్ళని అడిగితే ‘ఆ అమ్మాయి బట్టలు ఆ అమ్మాయిష్టం’ అని చెప్పటానికి దమ్ము చాలని, పరువు పేరుతో సొసైటీకి ఊడిగం చేసే సన్నాసులందరూ  ఇంట్లో ఆడవాళ్ళను, ముఖ్యంగా కోడళ్ళను కంట్రోల్ చేయాలనుకుంటారు. 

ఒకవేళ కోడళ్ళు లెక్కచేయకపోతే సొంత కొడుకు పెళ్ళాం మాట వినే చవట అవుతాడు. పెళ్ళాన్ని అదుపులో పెట్టలేని చేతకాని దద్దమ్మ అవుతాడు. అంతే తప్ప, నోరు తెరిచి ‘మా కోడలు ఎలా ఉంటే మీకెందుకు?” అని అడగడం చేతకాని, ప్రశ్నించలేని ఎందుకూ పనికి రాని వెధవలం మనమే అని గుర్తించలేరు పాపం! అలా అడగడం మొదలెట్టిన రోజు వాళ్ళని అడిగేవాడు ఉండడు. వీళ్ళు ఇంకొకరిని అడగాల్సిన అవసరం ఉండదు. 

Character, Personality, ‘what a woman is as a person‘ అనేది ఆమె attire మాత్రమే డిసైడ్ చేస్తుంది వీళ్ళకి. వీటన్నిటికీ తోడు, భారతీయ మహిళలు అత్తగారింటిలో అణిగి మణిగి ఉండాలి. బయట ఆవిడ రాజ్యాలేలినా ఇక్కడికొచ్చి మాత్రం వీళ్ళకి obedient గా ఉండాలన్న పనికి మాలిన expectation ఒకటి ఏడుస్తుంది. 

ఆడవాళ్ళెలా ఉండాలి, పెళ్ళాలేలా ఉండాలి, కూతుళ్ళేలా ఉండాలి, కోడళ్ళేలాఉండాలి అని హితబోధలు, పరువు ప్రేలాపనలు మానేసి, ఎవడికి వాడు, ‘వాడు ఎలా ఉండాలి’, ‘ఎలా ఉన్నాడు’ అనేది చూస్కోడం మొదలెడితే ప్రపంచం చాలా ప్రశాంతంగానూ, productive గానూ మారుతుంది. 

Socially acceptable behaviour అంటే society మన మీద పెట్టుకునే పనికి మాలిన expectations ని meet అవ్వడం కాదు. ఎవడికి వాడు, వాళ్ళ actions కి సంబంధించిన responsibility ని తీస్కోడం.  Society యొక్క peaceful livingని disrupt  చేయకుండా ప్రశాంతమైన life  ని lead చేయడం. 

Socially acceptable behaviour అంటే పక్కోడి జీవితంలో వేలు పెట్టి, వాడికి పనికి మాలిన నీతులు చెప్పడం కాదు. ఒక్కొక్కరూ ఒక్కోలా ఉంటారు అని మనుషుల choicesనీ, ఆ మనుషులనీ respect చేయడం. కుళ్ళిపోయిన సంస్కృతి , సంప్రదాయం పేరుతో పనికి మాలిన పాత అచారాలన్నీ ఆడవాళ్ళ మీద రుద్దుతూ, వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాల మీద వాళ్ళకే హక్కు లేకుండా చేయడం ఏ రకంగా socially acceptable behaviour? 

ఆడవాళ్ళ time, efforts పుట్టిన దగ్గర్నుంచి వీటి మీద కాకుండా, self development మీద, individual growth మీద పెట్టగలిగితే, ఆడవాళ్ళు achieve చేయగలిగే వాటి దరిదాపుల్లోకి కూడా మగవాళ్ళు రాలేరు. 

అలా జరక్కూడదనే వాళ్ళ టైంని అలంకరించుకోడం మీద, ఇంటి పనుల మీద, మనుషులని impress చేయడం మీద, జనాలకు తగ్గట్టుగా నడుచుకోవడం మీద ఉండేలా, వాళ్ళ దృష్టి వాటి మీద నుంచి మరలకుండా ఉండటానికి, for ages men try  చేస్తూనే ఉన్నారు. 

Pity ఏంటంటే, ఫామిలీ పేరుతోనూ, పరువు పేరుతోనూ ఆడవాళ్ళు కూడా తోటి ఆడవాళ్ళపై ఇది రుద్దుతూనే ఉన్నారు. కాస్త బొడ్డు కిందకి చీర కడితేనో, low neck blouse వేస్కుంటేనో, లేక తాళో,బొట్టో  తీసేస్తోనో ఆ మనిషి characterని తోటి ఆడవాళ్ళే క్రూరంగా assassinate చేస్తారు. మొగుడు పోయినా బొట్టు పెట్టుకునే ఆడవాళ్ళదీ అదే పరిస్థితి.   ఇవన్నీ అనడానికి బయటి వాళ్ళెవరో అక్కర్లేదు.  సొంత అత్త, ఆడపడుచు, తోడికోడలు, పెద్దమ్మ, అక్క, అమ్మమ్మ అయినా చాలు. 

చీర, కట్టూ, బొట్టు, సంప్రదాయం అని సొల్లు కబుర్లు చెప్పే పురుష పుంగవులందరూ ఆడవాళ్ళ(సొంత ఇంట్లో ఆడవాళ్ళు కాదు …వాళ్ళింటి బయట ఆడవాళ్ళు) శరీరంలో ఎక్కడ ఫ్రీగా ఏం చూడడానికి దొరుకుతుందో అని చొంగకార్చుకుంటూ ఎదురు చూసే వాళ్ళే! వాళ్ళింట్లో ఆడవాళ్ళని బయట మగవాళ్ళు అలా చూడకూడదని పద్ధతి, పాతివ్రత్యం అంటూ పనికి మాలిన థియరీలతో, ఇంట్లో ఆడవాళ్ళ బట్టల్నీ, behaviour ని కంట్రోల్ చేయడానికి కష్టపడుతూ ఉంటారు.

దివ్యకి సరిగా నిద్రపట్టలేదు ఆ రాత్రంతా. 

వారం తరువాత రవి వాళ్ళ తమ్ముడు దివ్య కి కాల్ చేసి ‘వాళ్ళమ్మకి నీరసంగా ఉంటోంది లేవట్లేదు అని హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు’ అని చెప్పాడు. 

ఫోన్ పెట్టేసి రవికి విషయం చెప్పి అడిగింది “అదేంటి నీకు తెలీదా మీ అమ్మకి బాలేదని”

“ఏమో నేను మాట్లాడలేదు” మాట దాటేశాడు.  

“సరే! రెడీ అవ్వు! వెళ్ళి చూసొద్దాం.” దివ్య అంది. 

“నువ్వొద్దులే! నేను వెళ్ళేసి వస్తా” అన్నాడు. 

“ఎందుకు? నేను కూడా వస్తాను పద” అన్నది దివ్య. 

Helplessగా దివ్యని చూస్తూ నుంచున్నాడు రవి. 

“ఏమైంది రవీ?” something is not right అనిపించింది దివ్యకి. 

దివ్యని భుజం చుట్టూ చేయి వేసి పక్కన కూర్చోపెట్టుకుని చెప్పడం మొదలెట్టాడు రవి. 

ఆ రోజు రవి వాళ్ళింటికి వెళ్లడం తోటే వాళ్ళ నాన్నగుమ్మంలోనే పట్టుకుని రవిని నిలదీసాడు. 

*********************************************************

“అక్కడికి నీ పెళ్ళాం ఎలా వచ్చిందో నాకు తెలీదనుకున్నావా … మొగుడు పోయిన వాళ్ళ మొహం చూడ్డానికి ఎలా వెళ్ళాలో ఆ మాత్రం తెలీదా? బొట్టు, గాజులు తీసేసి వెళ్తారా? నా పరువు తీయాలనే కదా?”

“అసలు తనెలాగో వెళ్తే మీ పరువు ఎందుకు పోతుంది?”

“నీ కోడలు బొట్టు, తాడు లేకుండా తిరుగుతుంటే నువ్వేం చేస్తున్నావ్ అని అందరూ నా మొహం మీద కాదా ఉమ్మేసేది? పోయేది నా పరువు కాదా?”

“ఆ అమ్మాయి వేసుకోదు. అది ఆ అమ్మాయి ఇష్టం అని చెప్పడానికి మీకేంటి నొప్పి? పరువు, పుచ్చకాయ అని కబుర్లెందుకు?”

“ఎంతమందికి చెప్పమంటావ్? ఊరంతా అడుగుతూ ఉంటే ఊరందరికీ చెప్పమంటావా?” 

“మీకు చెప్పడం కష్టంగా ఉంటే అలా అడిగే వాళ్ళని నాకు ఫోన్ చేయమనండి. నేను చెప్తాను పోనీ” వెటకారంగా అన్నాడు. 

“అంతేలే! అంతకంటే ఇంకేం చేయగలవు? పెళ్ళాని కి చెప్పుకోలేని చేతకానివాడివి! నీతో పాటు మేము కూడా కోడల్ని అదుపులో పెట్టలేని సన్నాసులం అవుతున్నాం!”

“అదుపులో పెట్టడానికి కోడళ్ళేమైనా మీ ఇంట్లో పాడే గేదెలా? మీరు ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా?”

“పెద్దా చిన్నా లేకుండా ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావా?”

“ముందు మీరు ఏం మాట్లాడుతున్నారో అలోచించి మాట్లాడండి” రవి గొంతు పెంచి అన్నాడు.

“ఏంట్రా…  ఏంటి? మా పరువు పోయే పనులు మీరు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? ” ఆవేశంతో ఊగిపోతూ రవి పట్టికెళ్ళిన డేట్స్ ప్యాకెట్ ని గుమ్మం బయటికి గిరాటు కొట్టాడు వాళ్ళ నాన్న. 

“నేను కాదు దరిద్రంగా ఉంది. నువ్వు నీ పెళ్ళామే అలా ఉన్నారు. ఇదిగో రవీ …..ఇప్పుడు చెప్తున్నా విను. నేను నీ ఇంటికి రావాలన్నా, నీ పెళ్ళాం నా ఇంటికి కానీ, నాకు సంబంధించిన వాళ్ళింటికి కానీ రావాలి అన్నా ముందు అది పద్ధతి ఉండాలి. పద్దతిగా రావాలి. లేదంటే రానక్కరలేదు. మేము కూడా మీ గడప తొక్కము.”

“పద్ధతి అంటే?”

“పద్దతిగా బట్టలేసుకోడం, తాళి, గాజులు అన్నీ వేసుకోడం. పరువు గల కుటుంబంలో ఆడోళ్ళు ఎలా ఉండాలి?” 

లోపల్లోపల కోపం రగిలిపోతున్నా రవి సాధ్యమైనంత కూల్ గా ఉండటానికి ట్రై చేస్తున్నాడు. టీవీ వంక చూసాడు. 

టీవీ లో అనసూయ anchor చేస్తున్న ప్రోగ్రాం ఏదో వస్తోంది. రవి ఇంటికి వెళ్ళే సరికి అది పెట్టుకుని చూస్తున్నారు రవి అమ్మ నాన్న. ఆ ప్రోగ్రాం లో, అనసూయ ఒక మినీ షార్ట్, చిన్న sleeveless top వేస్కుని anchoring చేస్తోంది. 

“ఆ అమ్మాయిని గంట నుంచి కళ్ళార్పకుండా చూస్తున్నారు ఇద్దరూ… ఆ అమ్మాయి తాళి, మెట్టెలు, బొట్టు ఏం వేసుకుందని చూస్తున్నారు? తనకి ఉన్న talent ని use చేస్కుని సంపాదించుకుంటున్న ఆ అమ్మాయి ఏ రకంగా పరువు తక్కువ పని చేస్తోంది? బయట వాళ్ళని గుడ్లప్పగించుకుని చూడొచ్చు, అలాగే ఇంట్లో వాళ్ళు ఉంటే మాత్రం పరువు పోతుంది.” కూల్ loose అవ్వకుండా అడిగాడు. 

“ఓహో… నీకు అలా అనిపిస్తోందా? అయితే దానితోనే పో! అలాంటోళ్ళే కదా నీకు కావాల్సింది?” 

రవి కి వాళ్ళ నాన్న ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కావడానికి ఒక నిమిషం పట్టింది.

“మీ వయసేంటి? మీరు మాట్లాడుతున్న మాటలేంటి నాన్నా? ఇంట్లో కోడలు మీదా, జనరల్ గా ఆడాళ్ళ మీద మీకెంత గొప్ప అభిప్రాయం ఉందో, మీదెంత గొప్ప సంప్రదాయమో దీని బట్టే అర్ధం అవుతోంది. మా అమ్మా నాన్న, ఆడోళ్ళ character ని వాళ్ళు వేసుకునే బట్టల బట్టి డిసైడ్ చేస్తారు అని అనుకోడానికి  నాకే సిగ్గుగా ఉంది. ఇంత filthy ఆలోచనలున్న మీతో ఇంత సేపు మాట్లాడినందుకు నా మీద నాకే అసహ్యం గా ఉంది. నే వెళ్తున్నా!” అని బయటకు వచ్చేసాడు. 

*******************************************************************

“నాన్న ఆలోచనలు అంత దిగజారిపోయి ఉన్నాయన్న ఆలోచనే చాలా hurting గా అనిపించింది. రిటైర్ అయిపోయారు. దేనికీ లోటు లేదు. ఏంచేయాలనుకున్నా, ఎక్కడికి తిరగాలనుకున్నా… ఆరోగ్యం గురించి జాగ్రత్త తప్ప డబ్బు గురించో, టైం గురించో ఆలోచించాల్సిన అవసరం లేని వయసు. Happy గా ఎంజాయ్ చేయలేక, పనీ పాటా లేక, తిన్నదరక్క పరువు మర్యాద, ఆడవాళ్ళ బట్టలు, కోడళ్ళ వల్ల మాత్రమే నిలబడే పరువు అనే పనికి మాలిన ఆలోచనలు. ప్రపంచంలో పనికి రాని చెత్తనంతా బుర్రల్లో మోస్తూ ఉన్నారు వీళ్ళు. నాకు బూతులు రావట్లేదు. ఇంత కన్నా ఎలా మాట్లాడాలో కూడా తెలీడం లేదు.”

దివ్య బ్లాంక్ గా చూస్తూ ఉంది ” …………” 

“అలా అని, ఆయన్ని మార్చాలనుకోడం మూర్ఖత్వం, impossible అని అర్ధం అయింది. ఈ చెత్తనంతా నీ బుర్రలోకి dump చేయడం వేస్ట్ అనిపించి చెప్పలేదు. తెలుసుకుని ఏం చేస్తావ్? నువ్వూ బాధ పడతావ్… ఇంకా చెప్పాలంటే చాలా ఎక్కువగా agitate అవుతావ్. ఎందుకంటే వాళ్ళలా అనుకునేది నీ గురించే కాబట్టి.”

“ఇది దాచే విషయమా? అసలలా ఎలా మాట్లాడతారు రవీ? Just because, నేను కోడలిని కాబట్టి వాళ్ళెలా ఉండమంటే నేను నోరు మూసుకుని అలా ఉండాలి అనుకునేంత బలుపు ఏంటి? ఎక్కడ నుంచి వస్తుంది. అమ్మాయంటే అంత చులకనా? 70 ఏళ్ళు నిండిన మీ బాబు కి ఏం చూసుకుని అంత అహంకారం? అది just నెంబర్ మాత్రమేనా? బతికితే ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతాడు ఆయన? ఇంట్లో పదిహేనేళ్ళు నిండని పిల్లాడు, ఆయన కన్నా లక్ష రేట్లు matured గానూ, broad గానూ ఆలోచిస్తున్నాడు. ఏం చేస్తే వీళ్ళకు బుద్ధి వస్తుంది?”

దివ్య కి చాలా ఉక్రోషంగా ఉంది. వాళ్ళ అత్తనీ మామనీ నిలబెట్టి ‘నేనెలా ఉండాలో చెప్పే రైట్ నీకు లేదని’ చెంప పగలకొట్టి మరీ చెప్పాలనుంది. వాళ్ళెవరు అసలు తను ఎలా ఉండాలో, ఏం చేయాలో చెప్పడానికి?

ఇంతకాలం, తనకు నచ్చినట్టు తాను ఉండడంలో ఎవరికీ ఏ harm చేయడం లేదు కాబట్టి ఎవరేమనుకున్నా పట్టించుకోనవసరం లేదనుకుంది. కానీ, ఇవ్వాళ ఇంకో కొత్త విషయం తెలుసుకుంది. 

మనకు నచ్చినట్టు మనముంటున్నపుడు continuous గా మన lifeని disturb చేయడానికి try చేసే  elementsని కూడా దూరం పెట్టాలి అని. సొంత వాళ్ళే కదా అనో, వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించో, లేక వాళ్ళకి నచ్చచెప్పలేమనో…. పోనీలే అని భరిస్తూ పోతే, మన వైపు వాళ్ళ ill behaviour ని tolerate చేస్తూ పోతే … gangreneలా చివరికి మన existence కే detrimental అవుతారని realise అయింది. 

వాళ్ళని as another individual respect చేయడం, మన సెల్ఫ్ respect విషయంలో at any cost compromise అవ్వకపోవడం రెండూ వేరు వేరు విషయాలు. Just because, they are our parents, in-laws or siblings or someone near or dear doesn’t mean we tolerate their bullshit. When it is about self respect, No matter, who the opposite person is… Just stand up for yoursel and never give in! Keep them at bay if needed and just be happy. 

కూర్చున్న చోట నుంచి కదలలేదు. 

“నువ్వెళ్ళేసి రా! వచ్చే ముందు నాకు కాల్ చెయ్” అని రవిని వాళ్ళింటికి వెళ్ళిపోమంది.  

ఒక అరగంట తరువాత రవి దగ్గర నుంచి కాల్ వచ్చింది.

కాల్ ఎత్తి “స్పీకర్ లో పెట్టు రవీ!” 

“మీ ఇంటికి రావాలి అంటే నేను బొట్టు, గాజులు, తాళి వేస్కుంటేనే రావాలి అని కండిషన్ పెట్టారట. నేను నేనులా ఉంటే, మీరు ఊపిరాడక గిలగిలా కొట్టుకుని ప్రాణాల మీదకి తెచ్చుకోడం ఎందుకు పాపం? ఇకపై నేను మీ ఇంటికి రాను. రావాల్సిన అవసరమూ నాకు లేదు. నేనెలాగూ మీ ఇంటికి రానులే కానీ, మీరు కూడా మా ఇంటికి రాను అన్నారట? మా ఇంటికి వస్తే మీ ఆవిడని మా ఇంటి పద్దతుల బట్టి బొట్టు గాజులు, తాళి తీసేసి రమ్మంటానని భయపడ్డారా ఏంటి? మా ఇంటికి వచ్చే వాళ్ళు వాళ్ళెలా ఉండాలనుకుంటే అలానే రావచ్చు. మీరెప్పుడు కావాలంటే అప్పుడు మా ఇంటికి రావచ్చు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు….. రవీ! నీ పని అయిపోతే తొందరగా ఇంటికి వచ్చేయ్. రేపు early morning బయలు దేరి, మనం గోవా పోవాలి.”

ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా చేష్టలుడిగి చూస్తుంటే, ఫోన్ కట్ చేసి, రవి బయటికి వచ్చి బండి స్టార్ట్ చేస్కుని ఇంటికి బయలు దేరాడు. 

అటు దివ్య కూడా ఫోన్ కట్ చేసి, గోవాలో తిరగాల్సిన places గురించి ఆలోచిస్తూ luggage సర్దడంలో పడిపోయింది.  

ఆమె వల్ల కూలిపోయే పరువు

4 thoughts on “ఆమె వల్ల కూలిపోయే పరువు”

  1. దివ్య డిటర్మినేషన్ బాగుంది 😍 కానీ అందరూ అలా వుండలేరు వుండనివ్వరు అందుకని చాలా మంది లేడీస్ సరెండరయిపోతారు. దీనికి చదువు ఉద్యోగం మినహాయింపు కాకపోవడం గమనార్హం. చిన్నప్పటినుంచీ ఆడవాళ్లకు సర్దుకుపోడమే గొప్ప విద్యగా నేర్పిస్తారు. రవి లాంటి భర్తలు చాలా అరుదు సాధారణంగా ఇటువంటి వేధింపులు భర్తలే ఎక్కువ చేస్తారు కానీ నేను ఇలాగే వుంటానని చెప్పే వాళ్లను ఏమీ పీకలేరు. సో అటువంటి ధైర్యం సపోర్ట్ అమ్మాయిలకు కొంచమయినా దొరికితే గిల్ట్ ఫీలవరు… వెరీ నైస్ writeup dear keep writing

    PS: Boycut వచ్చిందనమాట.. మీ ఇంట్లో వాళ్లకు కూడా అగ్ని పరీక్ష లే పెడుతున్నావ్. But i idmire your guts keep inspiring with your deeds and writes.
    Love you ❤

  2. చాలా బాగుంది చరితా !
    ఇది కేవలం అత్తగారి ఇంటి వైపు నుంచే కాదు , అమ్మ , అక్క ఇలా చిన్నతనం నుంచి మన గురించి బాగా తెలిసిన వాళ్ళ నుంచి కూడా వచ్చే సమస్యే ! అంత దాకా ఎందుకు ఫంక్షన్స్ కి చీర కట్టుకోకపోతే అదే పెద్ద issue, అబ్బాయిలు ఎలా ఐన రావొచ్చు అదే అమ్మాయిలు casual attire లో వస్తే అదొక పెద్ద తప్పు , కొందరు కట్టుకో బాగుంటుంది అంటారు ! ఎవరికీ బాగుంటుందో నాకైతే అర్ధం కాదు , కొందరు ఇది మన సంస్కృతి , సంప్రదాయం అని చెప్తారు , ఏ ఫంక్షన్ కి పంచె కట్టుకు వచ్చే అబ్బాయిలు కనపడలేదు నాకు ,ఈ సంప్రదాయాలు అన్ని అడవాళ్ళకే ఎందుకు ఉన్నాయో మరి.
    పూలు , తాళి , గాజులు లేకపోతే మనకి భర్త పోయిన వాళ్ళకి తేడా ఏముంటి అని బుగ్గలు నొక్కుకునే వాళ్ళని చాల మందిని చూసా నేను , తేడా అసలు ఎందుకు ఉండాలో నాకైతే అర్ధం కాదు , చిన్నపాటి నుంచి మాకు comfort కాదు బాబోయ్ అన్నా అలవాటు చేసి వాళ్ళ టైం బాగాలేక భర్త పోతే క్రూరంగా అన్ని లాగేసే ఈ రాక్షస సంస్కృతి కి అంతం ఎప్పుడో !
    మీరు పెట్టుకునే బొట్టు లో , పెట్టుకునే తాళి , గాజులు లోనే భర్త ఆరోగ్యం ఆయుషూ అని పిచ్చి నమ్మకాలని బుర్రలలో ఎక్కించి emotional గా sentimental గా బ్లాక్ మెయిల్ చేస్తారు !
    చిన్నప్పటి నుండి అమ్మాయిలకి భర్త , పసుకు కుంకుమలు జీవితం అని కాకుండా independent thinking అలవాటు చేస్తే కనీసం మన తరవాతి తరం లో ఐన ఈ మూర్ఖత్వం పోతుంది.

  3. మీ కథలు పెద్దగా శబ్దం చెయ్యని నొప్పులను వెలికి తీస్తాయి. ఎవరికీ పట్టని, శత్రువు ఎవరో తెలియని యుద్ధం లో బాధ, బాధితులు మాత్రం మిగులుతారు. నాకు మీరు ఇచ్చిన కంక్లూజన్ నచ్చింది. మీరు నిజం గా స్వేచ్చను కోరుకుంటే దానికన్నా ముఖ్యమైనది జీవితం లో లేదు అనుకుంటే చాలా మందిని దూరం పెట్టాలి. అది మనల్ని ప్రేమించే వాళ్ళని అయినా సరే. వెచ్చగా బ్రతకడానికి అలవాటు పడ్డ సమాజంలో.. స్వేచ్ఛ గా బ్రతకలేక పోయినా కనీసం అలా బ్రతికే వాళ్ళని వాళ్ళ మానాన వాళ్ళని వదిలెయ్యడం అయినా చెయ్యాలి. Keep writing and keep exposing the society. All the best.

  4. కధనం బావుంది. ఆధునిక స్త్రీ కి ఎదురయ్యే ఇబ్బందులు సూటిగా తెలియజేసారు. అభినందనలు.
    ఆడది అనే పదం లోనే హింస ఉంది.
    స్త్రీ తన జీవితం తాను బతుకనివ్వని వివక్షతో , హింస తో కూడిన సమాజం.
    ఆధునికత అంటే Gadjet లు , అవధులు లేని విలాసాల జీవితం కాదు.
    ఇతరులకు , సమాజానికి కష్టం , నష్టం కలిగించని జీవితం స్త్రీ లను జీవించనివ్వాలి.
    మానవత అంటే అదే కదా.
    ఇతరుల జీవితాల లోకి తొంగి చూస్తూ , ఆంక్షలు , కట్టుబాట్లు వంటివి , స్త్రీ వికాసాన్ని , మేధస్సు ను కుదించడానికే.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top