శృతి inter first year చదువుతోంది! College ఇంటికి దూరం అవ్వడం, collegeకి bus provision లేకపోవడం వల్ల city busలో వెళ్లి వస్తుంది రోజూ! తాను బయలుదేరే time peak hours కావడంతో buses rushగా ఉండటం, traffic ఎక్కువగా ఉండటం, ఒక్కోసారి నుంచునే వెళ్ళాల్సి రావడం, ఆఖరికి foot board పట్టుకుని వేళ్ళాడడమూ, ఏదీ తప్పటం లేదు. చదువుతో వచ్చే tiredness కన్నా ప్రయాణం వల్ల ఎక్కువ tired అయిపోతోంది శృతి.
శృతికి అదే routeలో busలో వచ్చే నవ్య, ఆకాష్, హరి friends అయిపోయారు. అందరూ కలిసేదాకా ఆగి, rushగా ఉన్న bus అయినా సరే ఎక్కేస్తారు.
ఆ రోజూ కూడా అంతే! 2 seater seats లో కూర్చుని మంచి హుషారుగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఒక పెద్దావిడ seat లేక నుంచుని ఇబ్బంది పడటం చూసి శృతి లేచి తన seat ఇచ్చింది. ముగ్గురూ కనపడేలా వాళ్ళ పక్కనే నుంచుని non-stop గా మాట్లాడుతూ ఉంది.
Right side seatలో కూర్చున్న ఒకావిడ శృతి ని పిలవాలని ప్రయత్నించడం, హరి చూసే సరికి ఆగిపోవడం ఒక రెండు సార్లు జరిగే సరికి హరి చిరాగ్గా చూసాడు. ఆవిడ శృతి dressనే చూస్తూ తెగ ఇబ్బంది పోతుండడంతో doubt వచ్చి లేచి శృతి వెనక్కి వెళ్ళి చూసాడు హరి.
వెంటనే శృతిని తాను లేచిన seatలోకి తోసేసాడు. శృతి ఒక్కసారిగా ఉలిక్కిపడి “ఏంట్రా” అని గట్టిగాఅరిచింది. “చెప్తా! కూర్చో ముందు” బ్రతిమాలాడు హరి . ఆకాష్కి, నవ్యకి హరి ఏం చేస్తున్నాడో అర్ధం కాలేదు. నెమ్మదిగా ముందుకి వంగి చెప్పాడు. ‘నీ డ్రెస్ stain అయింది. కూర్చో’ అని. ఒక్కసారిగా శృతి మొహం మాడిపోయింది. నవ్య గబాల్న తల తిప్పేసుకుంది గాభరాగా.
‘ఇపుడు ఏం చేయాలి? బస్సు స్టాప్ నుంచి ఇంటి దాకా ఎలా నడుచుకుని వెళ్ళాలి? Light yellow colour dress! Stain చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎలా?’ శృతి బుర్రలో ప్రశ్నలు తిరుగుతూ ఉన్నాయి.
ఏడుపొచ్చేస్తుంది శృతికి. హరి చేత ఈ విషయం చెప్పించుకోవడం ఇంకా embarassingగా,చాలా అవమానంగా ఉంది తనకి.
“Relax శృతి! Nothing to worry! cool గా ఉండు” అని చెప్తున్నాడు హరి.
శృతి తల ఎత్తలేకపోతుంది. ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి. ‘ఛీ… ఈ periods ఇప్పుడెందుకు వచ్చాయి? ఇంకా నాలుగు రోజులు టైం ఉంది కదా! తనకి తెలీను కూడా తెలీలేదు, అబ్బా…. ‘ కళ్ళలో నీళ్ళు తిరిగిపోయాయి!
“నవ్య నువ్విటురా, ఆకాష్ లేవరా!” అని నవ్యని శృతి పక్కన కూర్చోమన్నాడు హరి.
శృతి ఇబ్బంది పడటం చూసి వాళ్లకు కొంచెం దూరంగా వెళ్ళి నుంచున్నారు.
శృతి తల ఎత్తటం లేదు. ఏడుస్తోంది. ఏడుస్తూ ఆలోచిస్తోంది. ‘కుర్తి లు వేసుకోడం అలవాటు అయ్యి చున్నీలు వాడటం మానేసాను. కనీసం చున్నీ ఉన్నా బాగుండేది కదా!’ తనని తాను తిట్టుకుంటోంది.
పక్కనే కూర్చుని, నవ్య శృతి చేతిని తన చేతిలోకి తీస్కుని ఏం మాట్లాడకుండా కూర్చుంది. ఏం మాట్లాడుతుంది? తను కూడా చున్నీ వేసుకోలేదు. నవ్యకి కూడా కంగారుగా ఉంది.
బస్సు చాలా నెమ్మదిగా కదులుతోంది. Traffic చాలా ఎక్కువగా ఉంది. శృతి ఆలోచనలు కూడా గజిబిజిగా గందరగోళంగా సాగుతున్నాయి.
“ఇప్పుడెలా… ఇప్పుడెలా…?” ఆ మాట ఎన్ని సార్లు అనుకుందో తనకే తెలీదు. ‘వేరే దారేమైనా ఉందా? బస్సు నిండా జనాలు, తను లేవాల్సిందే, లేచి నడవాల్సిందే అందరి ముందు, అందరూ తనను చూస్తారు.’
నవ్య మొహం రెండు చేతుల్లో దాచుకుని మోకాళ్ళ మీదకి ముడుచుకు పడుకుంది.
ఒకటే పదం బుర్రలో గిర్రున తిరుగుతోంది. “మరక…. మరక…. మరక…”తప్పదు! ఈ మరకతోనే ఇప్పుడు సీట్ లోంచి లేవాలి, లేచి bus door దగ్గరికి నడవాలి, బస్సు దిగాలి, bus stop నుంచి ఇంటి దాకా నడవాలి. శృతికి ఆ ఆలోచనకే నోరు ఎండిపోతుంది, కాళ్ళు వణుకుతున్నాయి.
‘మరక…. మరక….మరకంటే భయం! ఎందుకు? ‘ రకరకాల ఆలోచనలు శృతి ని కుదురుగా ఉండనివ్వడం లేదు. సమాధానం లేని ప్రశ్నలు బుర్రలో తిరుగుతూ ఉన్నాయి.
‘రక్తపు మరకని వదిలించడం కష్టం కాబట్టి, మళ్ళీ ఆ dress వాడలేము కాబట్టా?’
‘అలా అనుకుంటే periods అప్పుడు అన్నిటి కంటే పాత dress వేసుకున్నా కూడా మరక అవుతుందేమో అని భయపడతాంగా? మరి అది ఎందుకు?’
ఎవరైనా regularగా తనని closeగా observe చేస్తే తనకి periods ఎప్పుడో easy గా చెప్పేయొచ్చు. Periods అప్పడు తన dress code black!’
‘రక్తపు మరకైనా, మురికైనా బట్టల మీద ఒకటే అయితే first period games ఆడేసి మురికి అయిపోయిన బట్టలతో మిగిలిన రోజంతా గడిపేసినప్పుడు ఇంత ఇబ్బంది feel అవ్వము ఎందుకు?’
‘లోపలి నుంచి బయటకి దాకా తడి ఇబ్బంది పెడుతుందనుకుంటే ఒక్కసారి toiletకి వెళ్ళి వాష్ చేస్కుని, బట్టలు మార్చుకుంటే పోతుందిగా! మళ్ళీ ఇంతోటి దానికి మరకని దాచి పెడుతూ మన వెంట నడిచే స్నేహితురాలొకటి! ఎందుకు?’
‘ఇంట్లోనే ఉండి అందుబాటులో మార్చుకోడానికి వేరే dress, pad అన్నీ ఉన్నా, ఏ నాన్న friend ముందో, అన్న friend ముందో బట్టలు stain అయితే తల కొట్టేసినట్టు feel అవుతాం. ఎందుకు?’
‘Pad పెట్టుకోవడం సరిగా రాకపోవడం చేతకానితనమని సిగ్గు పడుతున్నాం అనుకుంటే, మొదటి సారి స్కూల్లో period వచ్చిన juniorకి మరకని దాచే సలహాలిచ్చి మరీ ఆమెకి మరక భయం నేర్పిస్తాంగా. ఎందుకు?’
‘ఎవరి శరీర నిర్మాణానికైనా సరిపడేలా అన్ని sizesలో sanitary pads దొరుకుతున్నాయి marketలో ఇప్పుడు! Menstrual flow ఎక్కువున్నపుడు పెద్ద pads, sudden heavy flow ని absorb చేసే pads, నిద్రలో pad displace అవుతుందన్న భయం లేకుండా extra wide pads, ఇలా ఎన్ని రకాలు అందుబాటులో ఉన్నాసరే , అప్పుడే period మొదలైన అమ్మాయి దగ్గరి నుంచి menopause కి దగ్గరలో ఉన్న స్త్రీ దాకా, period timeలో అందరినీ వెంటాడుతుందీ మరక భయం.
‘ఇవి మాత్రమే కారణాలైతే, మరక అయినప్పుడు ఏం చేయాలో అది చేస్తే సరిపోతుంది. కానీ దాన్ని మించినది, పరువుకి సంబంధించినది, గేలి చేయబడేది, చులకనగా చూడబడేది, తప్పు చేసినట్టు తల వంచుకు తిరగాల్సి వచ్చేది… ఈ రక్తపు మరక’
శృతి గట్టిగా తల విదిల్చింది.
‘ఇప్పుడు ఈ మరక వల్ల తనకి ఏంటి problem? హరి చూసాడు. ఏమైంది? బస్సులో అందరూ చూసి ఉంటారు. దాని వల్ల తనకు ఏంటి నష్టం? అందరు ఆడవాళ్ళకూ వచ్చే period నాకు మాత్రమే వచ్చిందన్నట్టు నేనెందుకు ఇలా తల వంచుకు కూర్చున్నాను? ఇప్పుడు నాకు right away కనిపించే నష్టం నాకెంతో ఇష్టమైన ఈ yellow dress ఇంకెప్పుడూ వేస్కోలేకపోవచ్చు, తడి తడిగా చిరాగ్గా ఉన్న bleeding ఇంటికి వెళ్లి స్నానం చేసి pad పెట్టుకుంటే పోతుంది, అంతేగా? నా dress stain అవ్వడం ఎవరో చూడడం వల్ల నాకొచ్చిన నష్టమేంటి?’
ఎన్నాళ్ళ నుంచో మోస్తున్న భారం తొలగిపోయినట్టు శృతి తేలిగ్గా లేచి నుంచుంది. Next stop లో దిగాలి తను. చుట్టూ చూసింది. ఎవరి పనిలో వాళ్ళున్నారు. ఒక వేళ అందరూ తననే చూస్తున్నా సరే పట్టించుకునే స్థితిలో శృతి లేదు. నవ్య కూడా లేచింది, “నీతో నేనూ దిగుతా” అని. “వద్దు” కచ్చితంగా చెప్పేసి ముందుకి నడిచింది. తన వెనక ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం శృతికి ఇంకెప్పటికీ రాదు. ఆశ్చర్యంగా చూస్తున్న హరిని చూసి నవ్వి bye చెప్పేసి bus దిగింది మునుపటి హుషారుతో. ఇంటి వైపు నడిచింది ఏ మాత్రం తడబాటు లేకుండా తన original pace లో ఎప్పటిలా హుషారుగా!