men having control on the situation

Male Authority

#నాన్నతో ఇంటికి కావలసిన సరుకుల shopping చేయడానికి వెళ్తావు. Two wheeler అయినా four wheeler అయినా driving నువ్వే చేస్తావు. ఏం కొనాలి, ఏం వద్దు, selection, billing అన్నీ నువ్వే చేస్తావు. నాన్న shoppingలో just assist చేస్తారు నీకు. ఇంటికి వెళ్ళే దారిలో, traffic constable బండి ఆపి helmet అడుగుతాడు.

నువ్వు Respond అయ్యే లోపే నాన్న”లేదండీ పాప ఆఫీస్ నుంచి వచ్చే హడావిడిలో helmet మర్చిపోయింది” అని ఆయనకు తోచిన విధంగా constableకి సర్ది చెప్పడం మొదలెడతారు. బండి మీద నువ్వు single గా ఉండి ఉంటే నీతోనే మాట్లాడే ఆ constable అప్పుడు మాత్రం నీతో కాక నాన్నతో మాట్లాడుతూ ఉంటాడు. 

“ఏంటండీ? మీరైనా చూసుకోవద్దా… ఆడపిల్ల, ఆ పిల్ల కంటే తెలీదు” అని అజ్ఞానాన్ని నీ gender మొత్తానికి  ఆపాదించేసి, నీ బాధ్యతకి , రక్షణకి మీ నాన్నని answerable చేసేసి మాట్లాడతాడు.   

పెద్దాయన నాన్న మాట్లాడుతున్నారు కాబట్టి నువ్ interfere అవ్వవు.  అంతా ఆయనకి వదిలేసి, నింపాదిగా అక్కడ  జరిగే చోద్యాన్ని చూస్తుంటావు. నీ negligence వల్ల ఆయన మాట పడాల్సి వచ్చినందుకు కోపంతో తిరిగి ఇంటికి వెళ్ళేప్పుడు నాన్న ఇచ్చే ఉచిత సలహాలనీ, ఆవేశాన్ని మౌనంగా భరిస్తావ్.

నీతో నాన్న లేకపోతే ఇంత drama ఉండేది కాదని కానీ,  తప్పు నీదే కాబట్టి calm గా 100 రూపాయల fine కట్టేసి వచ్చేసేదానివని కానీ, పోనీ ఇదంతా కాకపోయినా నీ negligence కి నాన్నెందుకు మాట పడాలని కానీ నీకు అనిపించదు. నాన్న నీతో ఉన్నపుడు ఏ పరిస్థితిని నువ్వు నీ చేతిలోకి తీసుకోనవసరం లేదు. తీసుకుందాం అనుకున్నా నీకా అవకాశం నాన్న ఇవ్వరు.  అలాగే ప్రశ్నలతో విసిగిస్తుంది. నీకు నలభైలు దాటినా, నలుగురు పిల్లలున్నా సరే… నువ్వెలా ఉన్నావ్? ఏం బట్టలేసుకుంటున్నావ్? ఎవరితో ఉంటున్నావ్? నీ చేతలు, నీ మాటలకి, నీ ప్రతీ కదలికకూ, అన్నిటికీ బ్రతికున్నంతకాలం నిన్ను కన్నందుకు ఆయనే బాధ్యత వహించాలన్నట్టు ప్రవర్తిస్తుంది సొసైటీ. అమ్మా నాన్నలు కూడా దానికి తలవంచుతారు. ఇంత వయసొచ్చాక కూడా పిల్లల actionsకి parents బాధ్యులెలా అవుతారని తిరిగి ప్రశ్నించనంత కాలం, నీకు కాపలాదారుగా మీ నాన్న కొనసాగుతూనే ఉంటారు.

#ఇద్దరు female friends, ఒక male friend తో కలిసి సినిమాకి వెళ్తావు. Interval రావడమే మీ male friend ‘తినడానికి ఏం కావాలి’ అని అడిగి మరీ తెస్తాడు. అతని చేతుల్లో పట్టకపోయినా కష్టపడి నాలుగు popcorn tubs పట్టుకొస్తాడు. అతను మీ కోసం effort పెట్టడం special status లా feel అవుతారు. ముగ్గురమ్మాయిలు వెంట ఉండే సరికి ఎవరూ చెప్పకుండానే, మీ safety and care అతని responsibility అని అతను ఫీల్ అవుతాడు.

మీరు ముగ్గురే వచ్చినా, లేక మీరొక్కరే single గా వచ్చినా మీరే వెళ్ళి తెచ్చుకుంటారు అన్న విషయం ఆ నిమిషానికి మీకు గుర్తు రాదు.  You feel privileged and choose to become handicapped.

ఒక్కరే ఉన్నపుడు జాగ్రత్తగా careful గా చుట్టూ గమనించుకునే మిమ్మల్ని just ఒక male presence ఎందుకు relax అయ్యేలా చేస్తుంది? అతని capability or physical strength కన్నా అతని gender వల్ల మాత్రమే మీకా ధైర్యం వస్తుందని మీకే కాదు, అతనికి కూడా తెలుసు. Suddenగా ఏదైనా unwanted situation ఎదురైతే అతనొక్కడే ఏమీ చేయలేడన్న విషయం కూడా తెలుసు. కానీ ఆ విషయానికి ఏ మాత్రం importance ఇవ్వకుండా అతని మీద rely అవ్వడానికి, మీ responsibility అతని మీద పెట్టడానికి ఏ మాత్రం సంకోచించరు.  

Over protective man

#మీ boyfriendతో  beach కో, park కో వెళ్తారు. జనాలు తిరిగే place లోనే, కాస్త దూరంగా ఏ bench మీదో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నపుడు, constable ఒకడు వచ్చి  “మీరు ఒకరికి ఒకరు ఏమౌతారు” అని అడుగుతాడు. Answer చేయాలని నువ్ అనుకోవు. నువ్ చేస్తావని అతను ఎదురుచూడడు. 

Answer చేసే responsibility, lead తీసుకునే privilege and situation ని నేను మాత్రమే handle చేయగలను అనుకునే power ఎప్పుడూ అతనివే! ఆ విషయంలో unanimousగా ఇద్దరూ ఒకటే thought మీద ఉంటారు. Officeలో managerial position లో రోజూ బోల్డు మందిని handle చేసే  capability ఉన్న నువ్వు అక్కడ మాత్రం, నీ boyfriend police కి నచ్చచెప్పడానికి కిందా మీదా పడుతుంటే మౌనంగా చూస్తుండిపోతావ్. 

#Highway ల్లోనూ city లోని గల్లీల్లోనూ సునాయాసంగా car drive చేస్తావు. కానీ, Familyతో బయటికి వెళ్ళేపుడు మాత్రం front passenger seat వైపు నువ్వు, driving seat వైపు అతను involuntaryగా వెళ్ళిపోతారు (unless you discuss about who is gonna drive the car beforehand). ఇద్దరూ ఒకేసారి driving నేర్చుకున్నా, ఇద్దరూ ఒకేలా drive చేసినా, ఒకే రకమైన experience ఉన్నా కూడా driving విషయంలో నీకంటే అతనికే ఎక్కువ authority ఉంటుంది.

Drivingలో  దొర్లే చిన్న చిన్న పొరపాట్లు ఇద్దరికీ common ఏ అయినా అతని driving లో దొర్లే mistakesని అతని incapabilityలా చూస్తావు నువ్వు. మరీ అతని డ్రైవింగ్ ఇబ్బంది అనిపిస్తే అదే point out చేస్తావ్. ఎందుకంటే అతని కంటే నువ్ capable అన్న thought అతనికి ఉండదు సరే… నీకు కూడా ఏ  మూలా ఉండదు. నీ Driving mistakes లో మాత్రం అతను నీ incapability, inexperience and ignoranceని మాత్రమే చూస్తాడు. నిన్నొక్కదాన్నే కాక నీ gender మొత్తాన్ని చేతకాని వాళ్ళలా చాలా తేలిగ్గా ఎత్తి చూపిస్తాడు.

gender inequality

ఇక workplaces లో ఆడవారిపై discrimination, అధికారం,పెత్తనం, superiority inevitable. కానీ ఇక్కడ ఒక advantage ఏంటంటే వాళ్లపై చూపబడే Difference and discrimination చాప కింద నీరులా కాకుండా, చాలా obvious గా కనపడుతూ ఉంటుంది. ఆ discrimination and authority ని కొన్ని సార్లు resist చేసినా, ఎక్కువ సార్లు succumb అయినా కనీసం దాన్ని ఇంటిలోనూ, intimate circles లోనూ accept చేసినట్టు చేయరు.

ఒక ఆడ ఒక మగ కలిసి ఉన్నప్పుడు decision making, answering and responding authority అతి ఎక్కువగా మగవాడి చేతిలో ఉండడమనేదాన్ని వారిద్దరూ అసలు గుర్తించను కూడా గుర్తించరు. నేను ఇక్కడ quote చేసిన examples తక్కువ కావచ్చు. కానీ ఒక స్త్రీ దినచర్య గమనిస్తే ఇలాంటివి పదుల్లో ఒకే ఒక్క రోజులో గమనించవచ్చు. అన్ని రకాలుగా capable అయిన స్త్రీలు కూడా ఈ power play కి succumb అవుతున్నారని వారికే తెలియదు.  

మన కంటే పెద్దవాళ్ళు అన్న feeling ఉండడం వల్లో, మనల్ని పెంచిన వాళ్ళవడం వల్లనో, unknowing గా parents మీద depend అయ్యే trait ఉండే అవకాశం ఉంది. మనకు తెలీకుండానే మన బాధ్యతని వారికి వదిలేయడాన్ని కొంతవరకూ justify చేసుకోవచ్చేమో! ఎక్కువ experience ఉందని మన కంటే వయసులో పెద్దవాళ్ళ దగ్గర, మన కంటే ఎక్కువ knowledge ఉన్న వాళ్ళ దగ్గర, మన కంటే ఎక్కువ చదువుకుని మనకంటే ఎక్కువ అవగాహన ఉంది అనుకున్న వారి దగ్గర, మన కంటే ఎక్కువ experience ఉన్న వారి దగ్గర, boss దగ్గర, మన కంటే ఎక్కువ power ఉన్న వారి దగ్గర, physical గా మనకంటే బలవంతులైనవారి దగ్గర ఒక superiority ని authority ని accept చేస్తున్నాం అనుకోవడం కూడా reasonable కాకపోయినా కొంతవరకు justifiable.

patriarchy

కానీ ఇవేవీ లేకపోయినా just because of the gender, అవతలి వారికి వచ్చే power ని ఏ రకంగా define చేయాలి? అతని Gender మాత్రమే అతనికి మన కంటే ఎక్కువ power ని, ఎక్కువ abilityని, ఎక్కువ పెత్తనాన్ని, మన responsibilityని ఎలా అప్పచెపుతుంది? ఒక్కరమే ఉంటే ఏమైనా చేసుకోగలిగే మన బాధ్యత ఒక మగవాడు మనతో ఉండేసరికి అతని చేతుల్లోకి ఎలా వెళ్ళిపోతుంది? అది ఎవరు అనే దానితో సంబంధం లేకుండా వారి మీద మన బాధ్యతనంతా ఎలా వదిలేస్తాం? మనకి తెలియకుండానే మనల్ని మనం వారికంటే తక్కువ గానూ, weaker గానూ ఎందుకు consider చేస్తాం?

‘బయట పరిస్థితులు బాలేదు, rape లు ఎక్కువ జరుగుతున్నాయి’ కాబట్టి ఇదే కరెక్ట్ అని చెప్పొద్దు. నిజంగా threat ఉన్నపుడు ఒక నలుగురు అబ్బాయిలు వచ్చి మీద పడినపుడు, ఆ ఒక్క మగవాడు ఎంత బలవంతుడైనా ఏమీ చేయలేదన్నది అతనికి కూడా తెలిసిన నిజం. ఇలాంటి కేసులు ఆల్రెడీ బోల్డు చూసాం. ఆమె ఒక్కతే ఉన్నపుడు చాలా జాగ్రత్తలు తీసుకునే ఆమె, మగవాడు పక్కన ఉండేసరికి relax అయిపోవడం వల్ల ప్రమాదంలో పడిన సందర్భాలు కూడా బోలెడు. ఒక isolated placeలో ఆమె ఒక్కతే ఉన్నప్పటి ఆమె safety కి, ఒక మగవాడితో ఉన్నప్పటి safety కి ఏమంత పెద్దగా తేడా ఉంటుంది?

‘ఒక్కతే ఉంటే, చూసే వాళ్ళు chance తీసుకోడానికి వెనకాడరు. అదే ఒక మగవాడు ఉంటే కాస్త ఆలోచిస్తారు, ఆగుతారు’ లాంటి lame excuses ని కాసేపు పక్కన పెడదాం. Maybe that is true to an extent, but not completely. 

verbal abuse

ఒక మగవాడి presenceలో అతని కంటే ముందు respond అయ్యే స్త్రీ మీద చాలా లోకువ భావం ఉంటుంది. అలాగే ఆ మగవాడిని చేతకాని వాడిగా చూస్తారు. పైన చెప్పిన example లో ఆ పోలీస్ కి అతను కాక ఆమె సమాధానం చెప్పి ఉంటే?

ఆమె singleగా ఒక threat face చేస్తున్నపుడు ఆమె deal చేయగలినట్టే, ఆమె ఎవరితో ఉన్నా deal చేయగలిగే అవకాశం ఆమె ఎప్పుడూ పోగొట్టుకొకూడదు. ఎందుకంటే ఎవరితో ఉన్నా ఆమె safety ఆమెకు అతి ముఖ్యం కాబట్టి. ఎటువంటి చిన్న పొరపాటైనా దాని consequences face చేయాల్సింది కూడా ఆమె మాత్రమే కాబట్టి. 

ఆమె natural instincts and instantaneous responses, situation analysis and her own way of judgement and awareness ఆమెలో active గా ఉండడం అవసరం. ఆ particular trait ని hone చేస్కోడం, situation ఆమె controlలోనే ఉండడం అత్యవసరం.  

woman relaxing while protects her

మనతో ఉన్న మగవాడు నిజంగా, ఆ టైం కి situationని సరిగా deal చేయకపోతే ఇంకా ఎక్కువ dangerలోకి నెట్టబడతాం. అతని incapability మనకి threat అవుతుంది. ఎదుటి వారి capabilities మనకి add on లా అయితే పర్లేదు కానీ వారి presence మన natural abilities ని hamper చేయకూడదు. కానీ ఎక్కువ సార్లు ఇదే జరుగుతుంది. Stop relaxing in the presence of a man. 

మీరు lead తీస్కుని మాట్లాడడం మొదలెడితే, మీ పనులు మీరే చేసుకోడం మొదలెడితే మీ నాన్న పెద్దగా పట్టించుకోకపోయినా, మీ male friends, boyfriends, husbands అతి దారుణంగా అవమానంగా ఫీల్ అవ్వడం మాత్రం ఖాయం.  ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి, equality, empathy గురించి public platforms లో ఊదరగొట్టే so-called feminist లు కూడా తమ partners దగ్గరకో, ఇంట్లో వాళ్ళ దగ్గరకొచ్చేసరికి మాత్రం self-centric గా వారి convenience ప్రకారమే మాట్లాడడం చాలా common. Women face చేసే problemsని అర్ధం చేస్కునే compassion ని miss అవుతూ ఉంటారు. Convenient గా ignore చేస్తూ ఉంటారు. Egoistic గా behave చేస్తారు.

Whoever the man is, how much ever his abilities are and whatever he is to you, Just Stand up for yourself and talk when needed. Never leave your safety to the benefit of the doubt. Take the control of the situation always into your own hands. Stop caring for the brittle egos of the men that get shattered quite easily. It’s their headache. Be yourself and be the one having control over your situations. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top