రెండో రోజు period సుమకు. ఈ రోజు lateగా లేచింది. School కి time అవుతోంది. తొందరగా ready అవ్వాలి. కానీ రోజూలా చలాకీగా లేదివ్వాళ. నెమ్మదిగా కదులుతోంది. Time చూసుకుంది. 7.50! స్నానం అయితే అయింది కానీ ఇంకా breakfast చేయాలి.
School bus timeకి ready అవ్వలేదని అర్ధం అయింది. నాన్న దగ్గరికి వెళ్ళి అడిగింది.
“నాన్నా ఇవ్వాళ కొంచెం schoolలో drop చేయవా?”
నాన్న హడావిడిగా ready అవుతూ “సరే తొందరగా కానీయ్, అన్నయ్య కాలేజీలో కూడా నాకు పనుంది. తొందరగా వెళ్ళాలి” అన్నారు.
నాన్న బండి start చేసి పిలిచాడు. “నువ్వెక్కు” అన్నాడు అన్నయ్య. “ముందు నువ్వెక్కు” అంది సుమ.
విచిత్రంగా చూసి బండి ఎక్కి కూర్చుని ముందుకు జరిగాడు అన్నయ్య. సుమ ఒక వైపు ఎక్కి కూర్చుంది.
“రెండు వైపులా కూర్చో, ఇలా place సరిపోదు” విసుక్కుంటూ order pass చేసాడు అన్నయ్య.
పక్కనే ఉన్న boys toilet దగ్గర కొంతమంది గుంపులుగా నుంచుని మాట్లాడుకుంటున్నారు. Pad bagలోంచి తీసి bathroomలోకి కనపడకుండా ఎలా తీస్కెళ్ళాలా అని ఆలోచిస్తోంది. Friends ఎవరూ కనిపించలేదు. Generalగా ఇలాంటప్పుడు toilet దగ్గరికి ఇద్దరమ్మాయిలు కలిసి వస్తారు.
చేసేదేం లేక అటు ఒక కాలు, ఇటు ఒక కాలు వేసుకుని కూర్చుంది. Speed breakers దగ్గరా, గుంతల్లోనూ సుమ బెదురు బెదురుగా కదులుతోంది. గాల్లోకి లేచి నుంచుంటోంది. ఎలా అయితేనేం schoolకి చేరింది. బండి దిగి dress సర్దుకుంది. వెనక్కి తిరిగి చూసుకుంది. అంతా బానే ఉంది. సరాసరి bathroom దగ్గరికి నడిచింది.
ఒక క్షణం తటపటాయించి bathroom బయట దిమ్మ మీద schoolbag పెట్టి లోపలికి వెళ్ళి check చేసుకుంది.
‘హమ్మయ్య! అంతా బానే ఉంది, pad ఏమీ displace అవ్వలేదు’ ఊపిరి పీల్చుకుని బయటికి నడిచింది.
సుమ class వైపు నడుస్తోంది. కాళ్ళ మధ్య pad వల్ల నడక కొంచెం తేడా ఉంటుంది. దానికి తోడు తాను కొంచెం బొద్దుగా ఉండటం వల్ల ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ ఆ తేడాని తెలీకుండా జాగ్రత్తగా నడవాలి. నడుస్తుంది. నడుస్తూ ఆలోచిస్తోంది.
తనకు period. నీరసంగా ఉంది. Bleeding అవుతోంది. Body అంతా sore గా ఉంది. Mind కొంచెం dull గా ఉంది. ఏమీ తినాలని లేదు. కానీ తాను మామూలుగానే ఉండాలి. ఇవేమీ ఎవరికీ తెలియనివ్వకూడదు. తాను రోజూ లాంటి సుమనే అని అందరినీ నమ్మించాలి. నమ్మిస్తున్నాను. ఎందుకు? Why am I hiding my period?
Class దగ్గరకొచ్చింది. తెలుగు class! Already teacher వచ్చేసింది. తనను చూసి “late ఎందుకయింది?” అని అడిగింది.
“Bus miss అయింది మేడం” అని చెప్పేసి క్లాస్ లోకి నడుస్తుంటే అందరూ తననే చూస్తున్నట్టు, అబ్బాయిలు నవ్వుతున్నట్టు అనిపించింది. తను bus miss అవ్వడమో , classకి late రావడమో ఇదేం first time కాదు. చాలా సార్లువచ్చింది. కానీ ఆ late కి కారణం period అవ్వడం మాత్రం ఇదే first time.
Late వచ్చినపుడల్లా teacherకి సమాధానం చెప్పేసి careless వచ్చి తన placeలో కూర్చునే తాను, ఇవ్వాళ మాత్రం ఇబ్బందిగా classలోకి నడిచింది. Class మొత్తానికీ తనకు period అని తెలిసిపోయినట్టు అనిపించింది. ఆ ఆలోచనకే తల దానంతట అదే వంగిపోయింది తన ప్రమేయం లేకుండానే. తల దించుకుని, బెరుకు బెరుగా వెళ్ళి కూర్చుంది. దించిన తల చాలా సేపు ఎత్తలేదు. Teacher చెప్పే పాఠం బుర్రలోకి వెళ్లడం లేదు. ఏవేవో ఆలోచనలు.
అన్నయ్య విసుక్కున్నపుడు ‘నాకలా కుదరదు. నాకు period. ఇలాగే వీలవుతుంది, ఇలాగే కూర్చుంటా’ అని గట్టిగా ఎందుకు చెప్పలేకపోయింది?
బండి దిగడమే dress stain అయిందేమో అని అమ్మో, friends ఓ ఉన్నపుడు ‘ఒకసారి చూడు’ అని వెనక్కి తిరిగి అడిగినట్టు నాన్ననూ, అన్నయ్యనూ అడగదేం? అడగలేదేం?
Bathroom బయట అంత సేపు తచ్చట్లాడకుండా directగా bathroomలోకి padని దాచుకుని అయినా తీస్కుని లోపలికి వెళ్లలేకపోయిందేం?
ఇపుడు classలో ఎప్పటిలా casual గా తన పని తాను చేస్కుంటూ పోకుండా ఇలా మొహం ముడుచుకుని, తల వంచుకుని, ఎదో తప్పు చేసిన దానిలా సతమతమౌతుందేం?
Physicalగానూ, psychological గానూ ఇవ్వాళ తను రోజూ ఉండే సుమ కాదు. కానీ రోజూలా ఉండాలని ప్రయత్నిస్తోంది. Period day కి non period days కి తేడా ప్రపంచానికి తెలీకుండా జాగ్రత్త పడుతుంది. తన లోపల నెలలో 25 రోజులు ఒకలా, మిగిలిన 5 రోజులు ఇంకోలా ఉన్నా తన చుట్టూ ఉన్నవారికి నెలలో ముప్పై రోజులూ తను అదే సుమ అని నిరూపించాలని చూస్తుంది. ఎందుకు?
తెలుగు class అయిపోయి math class కూడా start అయింది. Board మీద ఏదో లెక్క చేస్తుంది teacher. తను అన్యమనస్కంగా notesలో ఏదో కెలుకుతోంది కానీ బుర్రలోకి ఏమీ వెళ్ళడం లేదు. తను చదివేది 10th. చుట్టూ చూసింది. క్లాస్ లో 20 మంది అమ్మాయిలు ఉన్నారు.
‘వీళ్ళలో ఇవ్వాళ ఎంత మందికి period ఉందో కదా! పోనీ ఇవ్వాళ కాకపోతే రేపు. రేపు కాకపోతే ఎల్లుండి. కానీ అందరూ నాలాగే అనుకుంటారు కదా! ఇది తెలియకూడదు అని. Normal గా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు కదా! పడుతున్న బాధని, ఇబ్బందిని నొక్కిపెట్టి పైపైకి మాత్రం happyగా ఉన్నట్టు, లేని బలాన్ని తెచ్చుకుని నవ్వుతూ నటిస్తూ ఉంటారు కదా!’
తల వంచుకొని notesలో ఏదో పిచ్చి గీతలు గీస్తున్నదల్లా bell మోగేసరికి తలెత్తింది. Interval ఇపుడు. ఉక్రోషంగా లేచి Staff room వైపు నడిచింది. Tea తాగుతున్న biology teacherని “ma’am” అని పిలిచింది. కప్పు పక్కన పెట్టి “Yeah Suma! Tell me!” అని ఆవిడ బయటికి వచ్చింది.
“మీరు male and female reproductive system గురించీ, అమ్మాయిల్లోనూ అబ్బాయిల్లోనూ puberty లో వచ్చే శారీరక మార్పుల గురించీ చెప్పారు. మేము ప్రస్తుతం అదే experience చేస్తున్నాం. Those lessons were so useful ma’am! Now, I know my body well and I am happy about it! కానీ….!!” సుమ ఆగిపోయింది.
“చెప్పు. కానీ..?”
“మీరు Menstruation ఎప్పుడు, ఎందుకు, ఎలా మొదలౌతుందో చెప్పారు. కానీ ప్రతీ నెలా వచ్చే menstruationని దాచి ఉంచాలని మీరు చెప్పలేదు. మరి నేనెందుకు దాస్తున్నాను? ఆ timeలో bleed అవ్వడానికి reasons చెప్పారు. ఆ bleeding కోసం వాడే padsని ఎవరికీ కనపడనీయకూడదని చెప్పలేదు. మరి నేనెందుకు దాస్తున్నాను?
Menstruation టైంలో pain and discomfort quite natural అని చెప్పారు.
కానీ, నేనెందుకు unnatural గా దాన్ని బయటపడనీయకుండా నొక్కిపెట్టి normal గా ఉన్నట్టు act చేస్తున్నాను? నేనే కాదు. నా చుట్టూ ఉన్న అమ్మాయిలందరూ అంతే! అమ్మ కూడా అంతే! If I am not wrong, మీరు కూడా అంతే! ఎందుకు? Why am I hiding my period? Why are we all women hiding our periods?”
Biology Teacher అంటే classలో అందరికీ ఇష్టం. ఎటు వంటి doubts అయినా విసుగు లేకుండా answer చేయడం ఆవిడ specialty. Classకి రావడమే “ఇవ్వాళ మనం ఒక interesting topic మాట్లాడుకుందాం! Are you all ready?” కళ్ళెగరేస్తూ నవ్వుతూ అడిగిందావిడ.
ఆవిడ సుమని దగ్గరికి తీస్కుని భుజం చుట్టూ చేయి వేసి ” Thanks Suma! I am glad you brought this up. I will discuss this issue in class today. Go to the class now!”
“Yes ma’am” class అంతా ఉత్సాహంగా అరిచింది.
“okay…”
అమ్మాయిల వైపు తిరిగి “Girls! How many of you are having your period right now?”
“And boys! How many of you have a bleeding sister or mother at home or someone you know bleeding today? Raise your hands!”
Class అంతా ఒక్కసారిగా silent అయిపోయింది. అబ్బాయిలు కళ్ళు పెద్దవి చేస్కుని చూస్తుంటే అమ్మాయిలు ఇబ్బందిగా కదులుతున్నారు.
“సరే … it is my turn first” అని టీచర్ చేయి పైకి ఎత్తింది.
Classలో లేచిన రెండో చేయి సుమది! నెమ్మదిగా ఇంకొక మూడు చేతులు పైకి లేచాయి అమ్మాయిల వైపు. అబ్బాయిల వైపు ఒక్కరూ లేపలేదు.
“Ok boys! let’s make it much easier. How many of you know about your mother’s or sister’s menstruation this month?”
నెమ్మదిగా అబ్బాయిలు గుసగుసలాడుకోడం మొదలెట్టారు.
“Any problem?” టీచర్ అడిగింది.
ఒకబ్బాయి మాత్రం చేయెత్తాడు. ఈ లోపు ఇంకో అబ్బాయి లేచి “లేదు మేడం! వాళ్ళ period గురించి మాకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు చెప్పరు కదా?” అన్నాడు.
“And మీరు lesson లో చెప్పినట్టు వాళ్ళు menstrual pain feel అవడం, suffer అవడం ఎపుడూ చూడలేదు” ఇంకొక అబ్బాయి అందుకున్నాడు.
“ఔను చెప్పరు. చెప్పనంత మాత్రాన వాళ్ళకి problem లేదనీ, ఉండదనీ కాదు. వాళ్ళు నెలలోని ప్రతీ రోజూ ఒకలానే ఉన్నట్టు కనబడతారు. కనపడాలని, period గురించి మాట్లాడడం పెద్ద పాపమనీ , ఆ విషయాన్ని దాచి ఉంచాలనీ వాళ్ళకు నేర్పించారు. అఏ జ్వరం గురించో ఎంత casual గా చెప్తారో గురించి కూడా అంతే casual గా చెప్పేయగలిగితే ఎంత బాగుంటుందో కదా?
ఆల్రెడీ వాళ్ళకి ఉన్న physical painకి తోడు, దాన్ని దాయాలి అన్న psychological stress లేకుండా ఇంట్లో అయినా schoolలో అయినా ఇబ్బంది లేకుండా మాట్లాడగలిగితే బాగుండదా? For ages, menstruation is a taboo! Don’t you all think we need to break it right away?”
“Yes” నెమ్మదిగా వచ్చింది.
“సరే ఓ పని చేద్దాం! ఇక నుంచి మనం menstruation గురించి మాట్లాడటానికి సిగ్గు పడొద్దు. Boys! ఇంట్లో మీ sisterకి ఏదైనా pads కావాలేమో అడిగి తెచ్చి పెట్టండి. ఆ timeలో వారికి ఉండే pain and discomfortని అర్ధం చేస్కుని cooperativeగా ఉండండి! అమ్మాయిలూ…మీరు pads కావాలంటే ఇబ్బంది పడకుండా మీ అన్నయ్యనో తమ్ముడినో తెచ్చి పెట్టమనండి.
వాళ్ళతో మాట్లాడండి. మీకు period time లో ఉండే ఇబ్బందుల గురించి వారితో మాట్లాడండి. ఎవరైనా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావని అడిగితే మా biology teacher మాట్లాడమంది అని చెప్పండి. నా దగ్గరకు తీసుకు రండి. సరేనా? And we shall discuss our experiences every 15 days. Are you all ok with this?
“Yes ma’am” ఈ సారి క్లాస్ అంతా గట్టిగా అరిచారు. సుమ టీచర్ దగ్గరికి పరిగెత్తి Teacher ని కౌగిలించుకుంది.