నా చిన్నప్పటి నుంచీ… మా ఇంట్లో పండగ అంటే, రోజూ కంటే ఆ రోజు కాస్త ఎక్కువ వంటలు చేస్కుని తినడం. మా ఇంట్లో జరిగే పండుగలు మా పుట్టినరోజులు, అమ్మానాన్నల పెళ్ళి రోజు, దీపావళి, భోగి (తెల్లారుఝామునే లేచి పుల్లలన్నీ ఏరుకొచ్చి భోగి మంటలు వేస్కోడం), ఉగాది (పచ్చడి కోసం… అమ్మకి, నాకు, చెల్లికి ఇష్టం ), కాలనీ వాతావరణం కావడం చేత అందరూ కలిసి ఒక చోట gather అయ్యే December 31st.
చెల్లికి నాకు, చిన్నప్పుడు మతాల మధ్య తేడా తెలీదు. తెలిసిన ఒకే ఒక్క తేడా… బొట్టు పెట్టుకోవడం, పెట్టుకోకపోవడం మాత్రమే.
పూజలు పునస్కారాలు లేకపోవడం వల్ల దీపావళి మతపరమైన పండుగగానో, హిందూ సంప్రదాయాన్ని భుజస్కందాలపై మోసుకుంటూ జరుపుకునే పండుగగానో తెలీదు. మాకు దీపావళి అంటే రోజూ కంటే కాస్త ఎక్కువ items తిని, టపాసులు కాల్చుకునే పండగ. అంతే! కొత్త బట్టలంటారా? అవి పుట్టినరోజులకి మాత్రమే పరిమితం.
ఇక crackers విషయానికి వస్తే… ఆడపిల్లలం కాబట్టి సున్నితంగా, సుకుమారంగా చిన్న చిన్న కాకరపువ్వొత్తులకు, చిచ్చుబుడ్లకు పరిమితమవ్వకూడదనీ, strong గా brave గా అన్నీ కాల్చాలనీ నాన్న అనేవారు. ఆడపిల్లలు ప్రతీ దానికి భయపడుతూ, కార్ కార్ మని అరుస్తూ, timidగా ఉంటారనీ, పెద్ద పెద్ద bombs అవీ మగపిల్లలు మాత్రమే కాల్చుతారు, కాల్చగలరు లాంటి stereotypesని ఏ మాత్రం entertain చేసేవాళ్ళు కాదు. అమ్మకిష్టమని అమ్మ కోసం మాత్రం మతాబులు తెచ్చినా, మాతో మాత్రం అన్ని రకాల బాంబులు, హావైసువ్వాయిలు దగ్గరుండి కాల్పించడం చేసేవారు. ఆ రకంగా చిన్నప్పుడు మాకు దీపావళి టపాకాయల పండగ మాత్రమే.
నాకు, చెల్లికి పిల్లలు పుట్టాక వాళ్ళ కోసం crackers తెచ్చేవాళ్ళు నాన్న. వాళ్ళతోనూ అలాగే కాల్పించాలనుకొనేవారు. (ఇద్దరూ మగపిల్లలే అయినా సరే). ఇప్పుడు పెద్దయిపోయి (ఒకడికి 14, ఇంకొకడికి 10) వాళ్ళంతట వాళ్ళు environment conscious అయి, మేము crackers కాల్చము అని వాళ్ళంతట వాళ్ళు మానేశారు. 10, 14 ఏళ్ళకే పెద్దయిపోవడం అనే మాట వాడడం కాస్త అతి అయినా వాళ్ళ ఆలోచనల వల్ల, చాలా మంది పెద్దవాళ్ళ కంటే వీళ్ళే పెద్దవాళ్ళు అనిపిస్తుంది.
మా వాడు మానేసి చాన్నాళ్ళు అయింది. వాడంతట వాడు వాడి ఇష్ట ప్రకారమే మానేసినా సరే, ఎవరైనా friends కానీ cousins కానీ “నేను ఇన్ని crackers… ఇన్ని డబ్బుల పెట్టి కొనుక్కున్నాను. నువ్వేం కొనుక్కున్నావ్?” అని అడిగితే సమాధానం చెప్పడానికి బిక్కమొహం వేసేవాడు. ఎందుకు మానేశాడో వాడికి తెలిసినా, చిన్నవాడవ్వడం చేత అదంతా explain చేసి ఎదుటి వారికి అర్ధమయ్యేలా చెప్పలేక quiet గా ఉండిపోయేవాడు.
చుట్టూ ఉన్న friends, neighbours కాల్చుకుంటూ ఉంటే, వాడు వాటిని చూస్తూ internal గా ఒక లాంటి conflictని, peer pressureని, answer చేయలేని embarrassing situation ని avoid చేయడానికీ, అలాగే వాడు తీసుకున్న decision ని assertive గా ఫీల్ అవ్వడానికి, వాడు ఇంకా బెటర్ గా అర్ధం చేసుకోడానికి ,దీపావళి టైం కి ఏదైనా టూర్ కి తీస్కెళ్ళిపోయేవాళ్ళం.
Trips కి వెళ్ళడం వాడికి బోల్డు సరదా కాబట్టి “నేను crackers కొనుక్కునే డబ్బులతో ట్రిప్ కి వెళ్తున్నా, బోల్డు enjoy చేస్తున్నా, మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళండి” అని friends కి చెప్పేవాడు. అప్పుడంటే చిన్నపిల్లాడు. ఇప్పుడు పెద్దోడయిపోయి trips అవసరం కూడా లేకుండా కనిపించిన వాళ్ళకి crackers కాల్చొద్దు అని క్లాసులు పీకుతున్నాడు.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దీపావళి హిందూ పండగ అనే వాళ్ళందరూ, పుట్టుకతో atheistని అయిన నేను… దీపావళి పండుగ జరుపుకుంటూనే వచ్చాను, మేము దీపావళి జరుపుకోవడం వెనుక కారణం మతం కాదు అని.
అలాగే దీనికి contrasting story మా అత్తగారి వాళ్ళింట్లో చూసాను. వాళ్ళు కచ్చితంగా హిందూ మతాన్నినమ్మి follow అయ్యే family ఇప్పటికీ. నేను ఐదో తరగతిలో ఉన్నప్పటినుంచి వాళ్ళు నాకు తెలుసు. అప్పటినుంచి వాళ్ళని చూస్తున్నాను. పిల్లల కోసం crackers తెచ్చేవాళ్ళు తప్ప ఏ రోజు uncle కానీ aunty కానీ ఒక్క cracker కాల్చడం నేను చూడలేదు.
మా వాడు పుట్టాక “నానమ్మ, తాతయ్య రండి కాలుద్దాం” అని గొడవ చేసినా crackers కాల్చడం వైపు సుముఖంగా ఉండేవారు కాదు. కానీ దీపావళి రోజు చేసే పూజలు, traditions అన్నీ ఫాలో అయ్యే వారు. దీపాలు పెట్టి, అవి కొండెక్కకుండా వాటిలో నూనె పోస్తూ ఉండేవారు. రకరకాల వంటలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టి కానీ ముట్టుకోరు వాళ్ళింట్లో.
Crackers కాల్చడం కూడా దీపావళిలోనూ, హిందూ సంప్రదాయంలోనూ ఒక భాగమని చెప్పే వారు, టపాకాయలు ముట్టని మా అత్తా మామల్ని హిందువులు కాదంటారా?
లేక
కనీసం ఇంట్లో దేవుడి పటం లేని, ఏ రోజు దేనికీ కూడా రెండు చేతులు జోడించి నమస్కరించని మేము, పుట్టిన దగ్గరినుంచి పెద్దయ్యేదాకా ప్రతీ దీపావళి కీ టపాకాయలు కాల్చాము కాబట్టి మమ్మల్ని హిందువులంటారా?
అసలు బాణాసంచా కాల్చడానికీ, హిందూ మతానికీ ఏంటి సంబంధం? నా friendsలోనే ఎంతమంది muslim and christian families దీపావళి రోజు బాణాసంచా కాలుస్తారో నాకు తెలుసు. దీపావళి రోజు టపాసులు కాల్చే వారందరూ హిందూ మతస్థులైపోతారా? అసలు ఇక్కడ మతానికి, టపాసులకి ఏంటి సంబంధం?
బాణాసంచా కాల్చడం అనేది ఒక సరదా మాత్రమే! బాణాసంచా కాల్చడం నిషేధం అనగానే బాణాసంచా కాల్చే సరదాని వదులుకోలేని మన weakness ని మతం పేరుతో చాలా తెలివిగా కవర్ చేసుకోడం కాదా?
చిన్న చిన్న పిల్లలు పర్యావరణం గురించిన అవగాహన, శ్రద్ధ, responsibility తో బాణాసంచా కాల్చనని తీర్మానించుకుని కూర్చుంటే, పెద్దవాళ్ళు బాణాసంచాని వెనకేసుకు రావడం నిజంగా సిగ్గు పడాల్సిన విషయం. ఆ మాటకొస్తే మా పిల్లలతో పోల్చుకుంటే పెద్దయ్యేదాకా బాణాసంచా కాల్చిన మాకు సిగ్గు లేదని ఒప్పుకోడానికి నేను ఏ మాత్రం సిగ్గు పడను. అదే విషయం పిల్లలతో చెప్తాము కూడా!
ఒక మంచి cause కోసం, మన చుట్టూ ఉన్న మనుషుల కోసం, మనం బ్రతికే ఈ భూమిని కాపాడడం కోసం, మన ముందు తరాల కోసం, మన ఇష్టాల్నివదులుకోలేని బలహీనతల్ని ఇలా మతాలు, పండుగలు, మనోభావాలు అని వెనకేసుకొస్తూ ఉంటే మన పిల్లలు చూస్తూ ఊరుకోరు. ఏం చేస్తారో విడమరిచి చెప్పక్కర్లేదు కూడా!
P.S: అలా అని మన అభిప్రాయాల్ని ఆలోచనల్నీ పిల్లలపై రుద్ది బలవంతంగా వారి ఇష్టాలకు against గా crackers కాల్చడం మాన్పించమని కాదు. Facts ని explain చేసి, consequences ని అర్ధమయ్యేలా చెప్పాక వాళ్ళేం చేయాలనుకుంటారనే నిర్ణయాన్ని వారికే వదిలేయడం, వారి అభిప్రాయాలను గౌరవించడం, parents గా మన కర్తవ్యం. చిన్న పిల్లలు కాబట్టి పెద్దరికం పేరుతో మన ideologies వారి మీద రుద్దడం parenting కాదు. పెత్తనం!!
Wish you all a happy Diwali and all the children a very happy children’s day!!
పండుగలు అనేవి కేవలం మతం ముద్ర వేయిన్చుకోవడం కోసం కాదు
పూర్వం అందరూ కలవడం కోసం కొన్ని రకాల అకేషన్స్ క్రియేట్ చేసారు
ఎప్పుడంటే అప్పుడు కలిసే అవకాశం చాలా రకాల పదార్థాలు చేసుకునే ఆర్థిక స్తోమత అందరికీ ఉండేది కాదు
అందుకే ఈ వీటి ద్వారా కలసే అవకాశం ఉండేది
వాటికి మూర్ఖత్వం, మూఢత్వం జత చేసింది తర్వాత తరాలే
బాణసంచా అనేది పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి మాన్పించే అంత ప్రమాదకరమైనది కాదు
అంతకన్నా ప్రమాదకరమైన పొల్యుషన్స్ మనం చాలా రిలీజ్ చేస్తున్నాం
ఇది కేవలం నా అభిప్రాయం
Thank you
హిందువులే కాదు దాదాపు అందరూ టపాసులు పేలుస్తారు కానీ దీపాలు హిందువులనుకునే వాళ్లే పెడతారు(ఆడవారు). ఇకపోతే ముఖ్యంగా బాణా సంచా కాల్చేది మగవారు పిల్లలు సో ఇందులో ఆనందం కంటే అనాలోచన మేల్ ఈగో బాధ్యతా రాహిత్యమే ఎక్కువగా కన్పిస్తోంది.
సంప్రదాయం మతం పేరుతో గుడ్డిగా పర్యావరణాన్ని పాడుచేసుకోడం ఉచితమైన పని కాదు అలాగే ఈ సందర్భంలో మరో మాట వెలుగు లోకి వస్తుంది వాహనాలు, ఫ్యాక్టరీలు, మెషీన్లతో పోలిస్తే ఇదే పాటని. సో కాలుష్యాన్ని పోటీ పడి మరీ పెంచుతున్నాం అదే పోటీ తగ్గించడంలో వుంటే బాగుండు.
బై ద వే వెరీ నైస్ రైటప్ అండ్ మీ ముఖాల్లో కాంతి దీపాలతో పోటీ పడుతోంది ఇది కదా అసలైన పండుగ.
PS: మీరెన్ని చెప్పినా సరే మా టపాసులు మా ఇష్టమండి..కాల్చకుండా వదిలేది లేదు..