Break the Stigma

ప్రియ కి summer holidays. అమ్మమ్మ వాళ్ళ ఊరొచ్చింది. ఆ ఊరంటే బోల్డు ఇష్టం తనకి. 

హైదరాబాద్ లో ఎపుడూ pollution లో ముక్కు మూసుకుని రోడ్డు దాటడం, సమయం తో పని లేకుండా కిక్కిరిసి ఉండే రోడ్లు, ఒకదానికి ఒకటి అనుకుని ఉండే buildings, వీటన్నిటి మధ్యా అక్కడక్కడా ఒకటీ ఆరా కనిపించే చెట్లు! ఎపుడూ దేని వెనుకో ఉంటారెందుకు మనుషులు అనిపిస్తుంది ప్రియకి.

అమ్మమ్మ ఊర్లో అలా కాదు. మట్టి రోడ్లయినా రెండు వైపులా ఉండే పొలాలు, కాలువ గట్లు, గట్ల వెంట చెట్లు, ఉదయించే సూర్యుడు, రాత్రి వేళ చంద్రుడు, లెక్క లేనన్ని చుక్కలు… అక్కడున్నన్నాళ్ళు ఏదో లోకంలో ఉన్నట్టు ఉంటుంది ప్రియకి. 

ప్రతీ చోటా నచ్చినవి ఉన్నట్టే ఈ పల్లెటూళ్ళో కూడా నచ్చనివి చాలానే ఉన్నాయి. 

‘ఆడపిల్లవి, ఏంటా గెంతులు?’, 

Break the Stigma and be a happy woman

‘ ఆడపిల్లవి, చీకటి పడేదాకా ఏంటా ఆటలు?’, 

‘ ఆడపిల్లవి, ఏంటా ఇక ఇకలూ, పకపకలూ?’,

‘పెద్దదానివయ్యావు, పొందిగ్గా ఉండమ్మాయ్’ అంటూ చుట్టూ పక్కల వారు, మాట్లాడితే తన gender ని గుర్తు చేస్తూ తనెలా ఉండాలో ఉండకూడదో నిర్దేశించడం అసలు నచ్చేది కాదు. హైదరాబాద్ లో కూడా gender disparity ఉన్నా అది ఇక్కడున్నంత severe గా ఉండదు. వాళ్ళలా మాట్లాడుతుంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా వాళ్ళ మాటలు వినే అమ్మమ్మని కోరగా చూస్తుంటుంది ప్రియ.  


అలాంటిది, ఈ సారి ప్రియకి ఇంకో కొత్త అనుభవం ఎదురైంది. తనకు periods start అయ్యాక అమ్మమ్మ ఊరెళ్ళడం ఇదే మొదటి సారి. 


తనొచ్చి పదిహేను రోజులైంది. ఇపుడు period వచ్చింది. ఊరు బయలుదేరే ముందు sanitary pads బాగ్లో పెట్టుకోడం మర్చిపోయింది. ఇపుడు, ఇక్కడ shop కి వెళ్ళి కొనుక్కోవాలి.

travel as you like and break the stigma

“అమ్మమ్మా… నాకు periods వచ్చాయి. నేను… ” అని ఏదో చెప్పబోతుంటే, ఆ మాటల్ని మధ్యలోనే నొక్కేసింది అమ్మమ్మ ప్రియ నోరు మూసేసి.

పైగా…. “ఎందుకే అలా అరుస్తున్నావ్? నెమ్మదిగా చెప్పలేవా? అందరికీ తెలియాలా?” అనేసరికి తెల్ల మొహం వేసింది ప్రియ.

“Pads తెచ్చుకోలేదు. Shopకి వెళ్ళి తెచ్చుకుంటా”  అంది ప్రియ. 


“ఏం అక్కర్లేదు! తాతయ్యకి  వచ్చేప్పుడు తెమ్మని ఫోన్ చేస్తాలే! నువ్వేక్కడికీ వెళ్ళేది?” కళ్ళు పెద్దవి చేస్తూ కోపంగా అంది అమ్మమ్మ. 


“తాతయ్య వచ్చేసరికి రాత్రి అవుద్ది అమ్మమ్మా! అప్పటిదాకా ఎలా?” చిరాగ్గా అంది ప్రియ!


“గుడ్డ ఇస్తాను, అప్పటిదాకా అది పెట్టుకో” అన్న అమ్మమ్మ మీద కోపం తారాస్థాయికి చేరుకుంది. ఏడుపొచ్చేసింది.

అమ్మకి ఫోన్ చేసింది. అమ్మ ఎదో తిప్పలు పడి అమ్మమ్మకి నచ్చచెప్పింది. 

“సరే తగలడు” అని రుసరుస లాడుతూ లోపలికి  వెళ్ళిపోయింది అమ్మమ్మ. డబ్బులు పట్టుకొని medical shop కి బయల్దేరింది. పెద్ద దూరం కాదు medical shop. పక్క వీధే!

Pads తెచ్చుకొనే లోపల ఎక్కడ spotting అవుతుందో, మళ్ళీ దానికి అమ్మమ్మ ఎంత గోల చేస్తుందో అని కంగారుగా నడిచి medical shop లోకి వెళ్ళింది. తనకు తెలిసిన uncle shop అది. కానీ ఇవ్వాళ ఎవరో కుర్రాడున్నాడు.

Counter దగ్గరికి వెళ్ళి “ఓ whisper choice wings ఇవ్వండి” అని అడిగింది.  

Counter కింద open display లో పెట్టిన బోల్డు sanitary napkins packet మధ్యలోంచి తనకు కావాల్సింది తీస్తూ, ఆశ్చర్యం, వ్యంగ్యం తో కూడిన అతని నవ్విన నవ్వు ప్రియ దృష్టిని దాటి పోలేదు. Already అమ్మమ్మ మీద కోపంతోనూ, బట్టలకి ఎక్కడ spotting అవుతుందో అన్న కంగారులోనూ ఉందేమో అతని నవ్వుని tolerate చేయలేకపోయింది.

“ఎందుకు నవ్వుతున్నావ్?” అని అడిగేసింది ఆ అబ్బాయిని. 

వెంటనే ఆ అబ్బాయి మోహంలో నవ్వు మాయమైపోయింది. ప్రియని బెరుగ్గా చూస్తూ “లేదు” అన్నాడు. 

ఆ packet ని ఒక పేపర్లో చుట్టి, మళ్ళీ దాన్నఇంకోి నల్ల కవర్లో పెట్టి చేతికి ఇవ్వబోయాడు. 

“ఇక్కడ display లో పెట్టింది అమ్మడానికి కాదా?” అడిగింది ప్రియ. 

“ఔను” అన్నాడు ప్రియని భయంగా చూస్తూ!”

అవి open గానే displayలో పెట్టారుగా! నాకివ్వడానికి ఎందుకింత overaction? చేతికివ్వు” అని చేయి చాచింది. 

చేతికిచ్చిన packetని bagలో పెట్టుకుంటూ అంది.

“ఇది అందరు ఆడవాళ్ళకీ ఉండేదే కదా! మీ అమ్మకీ, మా అమ్మకీ, నీకు అక్కో, చెల్లో  ఉంటే వాళ్ళకీ? వాళ్లకి periods వచ్చినపుడు వాళ్ళని చూసి ఇలాగే నవ్వుతావా? హేళన చేస్తావా?”

తల వంచుకుంటూ “లేదు” అన్నాడు. 


“pads కొనుక్కోవడం, periods రావడం ఆడవారు సిగ్గు పడాల్సిన విషయమా? దాచి దాచి ఉంచాల్సిన విషయమా? ఆడోళ్ళందరికీ ఉండేదే! లేనిదెవరికి?” మళ్ళీ అంది ప్రియ.

సిగ్గుతో తల వంచుకున్నాడు ఆ అబ్బాయి. 

“తల వంచుకోవడం దేనికి? నాకో help చేస్తావా?” అడిగింది. 

“చెప్పండి” అన్నాడు మనస్ఫూర్తిగా!

“నువ్ medical shopలో work చేస్తున్నావ్ కాబట్టి నీకు marketలో వచ్చే కొత్త pads, వాటి special features గురించి నీకు ఎక్కువ తెలుస్తుంది. అదేదో ఆడవారు సిగ్గు పడాల్సిన విషయంలా చూడకుండా, pads అవసరమై వచ్చిన అమ్మాయికి అది సిగ్గు పడే విషయం కాదన్న ధైర్యాన్నిచ్చేలా ఉండగలవా? దానికి నువ్వేం చేయనవసరం లేదు కూడా. Friendlyగా ఉంటూ వారికి కావాల్సింది వాళ్ళకి ఇస్తే చాలు. వాళ్ళు ఇబ్బంది feel అవ్వకుండా ఏం కావాలో అది అడిగి తీసుకెళ్తారు. నీకూ ఆ రకంగా business పెరుగుతుంది కదా?”

“తప్పకుండా” ఈసారి honestగా నవ్వాడు! 

ఇంతలో, ఎప్పటినుంచో వెనుక నుంచుని Shop ఎపుడు ఖాళీ అవుద్దా అని ఎదురు చూస్తూ నుంచున్న ఇద్దరమ్మాయిలు, వీళ్ళ discussion విని ముందుకొచ్చి అడిగారు, “Stay free ఇవ్వు” అని. 

వాళ్ళని చూసి పలకరింపుగా చిరునవ్వునవ్వాడు. అతన్ని చూసి ఆ అమ్మాయిలూ నవ్వారు friendly గా!

ప్రియ హాయిగా నవ్వేసింది. వెంటనే తాను pad పెట్టుకోపోతే, అమ్మమ్మ రూపంలో ముంచుకొచ్చే పెనువిపత్తు గుర్తొచ్చి “అమ్మో! నే వెళ్ళాలి! bye” అని చేయి ఊపేసి బయటికి పరిగెత్తింది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top