Beauty of Innocence, Fun of Imitation
Thank you Jesus!
అమ్మో దెయ్యం…అమ్మో బూచోడు…అమ్మో చీకటి …అమ్మో పోలీసు …అమ్మో పులి ??? నిద్ర లేచి కళ్ళు నులుముకుంటూ, మంచం దిగి, తడబడే అడుగులతో bedroom బయటికి వచ్చాడు రెండేళ్ళు నిండిన చిన్నూగాడు. వాడిని చూడడమే హుషారుగా ఎదురెళ్లి “good morning చిన్నులూ” అంటోన్న నాన్నని పట్టించుకోకుండా వంటగది లోకి వెళ్ళిపోయాడు. ఎదురుగా కనిపించిన ప్రవీణ ని చూడడమే విప్పారిన మొహంతో, “అమ్మా” అంటూ వెళ్ళి వాటేసుకున్నాడు. “లేచావా నాన్నా” గట్టిగా ముద్దు పెట్టుకుంటూ ఎత్తుకుని వాడిని చంకలో