భయాన్నిపెంచుతున్నరక్షణ

భయాన్నిపెంచుతున్నరక్షణ

బాధ్యతాయుత జీవనానికో, మంచి ప్రవర్తనకో ఉదాహరణగా కాక, అన్నం తినిపించటానికో, అల్లరి మానిపించటానికో, తమ చంటి పిల్లలకి  మిమ్మల్ని బూచిలా చూపించే అమ్మలకీ … 


శాంతి భద్రతలను కాపాడే వారిలా కాక, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేయగలిగే మీకున్న అధికారానికి ఆకర్షితులై, పెద్దయ్యాక మీలా అవ్వాలనుకునే చిన్న పిల్లలకీ…

ప్రజాసేవ కోసం కాక జీతంపై వచ్చే పైడబ్బులపై మోజుతో మీ వృత్తిని చేపట్టాలనుకునే యువతకీ… 

పార్కుల్లోనూ బీచుల్లోనూ, చిల్లర కోసం వేధించే మిమ్మల్ని తప్పించుకునే క్రమంలో privacy వెతుక్కుంటూ ఏరి కోరి ప్రమాదాన్ని ఎంచుకునే జంటలకీ… 

పరిసరాల్లో మీరున్నారన్న స్పృహ వల్ల తెగువని కాక అభద్రతని అనుభవించే స్త్రీలకీ… 

‘ఎవరితోనో లేచిపోయుంటుంది, వచ్చేస్తదిలే’ అని మీరిచ్చే భరోసాకి భయపడి కనిపించని పిల్లల కోసం complaint ఇవ్వడానికి, పోలీస్ స్టేషన్ గడప తొక్కడానికి సంకోచించే తల్లితండ్రులకీ…

ప్రజల రక్షణ కోసం కాక మీ పై officers and politicians కోసమే మీరు పని చేస్తారనుకునే సామాన్య ప్రజలకీ ….

Law and orderని కాపాడాల్సిన police వ్యవస్థపై, ప్రజలు నమ్మకాన్ని, ధైర్యాన్ని, భరోసాని ఎప్పుడో కోల్పోయారనీ, వారంటే భయం, ఏవగింపు మాత్రమే మిగిలాయని నమ్మే ప్రతీ భారతీయ పౌరుడికీ ….

ఇలా మీ గురించి ఎన్నో రకాల అభిప్రాయాలనేర్పరుచుకున్న  మాకందరికీ …..

ఈ సమయంలో…

దేశమంతా అతలాకుతమౌతున్న ఈ సమయంలోనైనా…

వ్యక్తులుగానే కాక వ్యవస్థ గా కూడా ‘The most corrupt‘  అని పేరు పడ్డ మీ police వ్యవస్థ, వ్యక్తిగత ప్రయోజనాలూ, సౌకర్యాలని పక్కన పెట్టి కర్తవ్య నిర్వహణని సక్రమంగా ఎటువంటి బేధభావాలు, తారతమ్యాలు లేకుండా నిర్వర్తిస్తారని ఆశించడం అత్యాశ కాదని ఇప్పటికైనా నిరూపించకపోతే…

ప్రజలకి మీ పై గౌరవం పెరగాలంటే, మొదట మీ వృత్తిపై మీరు అంకితభావమూ, గౌరవమూ  పెంచుకోకపోతే… 

ఏ వృత్తిలోనైనా దుర్వినియోగానికి పాల్పడే వాళ్ళున్నట్టే, 

నిజాయితీగా కర్తవ్య నిర్వహణకి  కట్టుబడేవారున్నారని రుజువు చేయకపోతే …. 

కర్తవ్య రీత్యా పోలీస్ అయిన మీరు, మొదట భారత దేశ పౌరులుగా మీ హక్కులని ఒక్కసారి గుర్తు చేసుకోకోకపోతే , గుర్తు చేస్కుని వాటిని గౌరవించకపోతే… 

అలాగే మీ విధుల్ని నిర్వర్తించే క్రమంలో, దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలలోని ప్రజలపై  ఏ విధంగానైనా  అమానుషంగా ప్రవర్తించే హక్కు మీకు లేదనీ, పౌర హక్కులని ఎట్టి పరిస్థితులలోనూ ఉల్లంఘించకూడదన్న స్పృహని నిత్యం కలిగి ఉండకపోతే…

శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం ప్రతి పౌరుని ప్రాధమిక హక్కన్న విషయాన్ని విస్మరించి, మీకు మీ పై అధికారుల నుంచి వచ్చిన ఉత్తర్వులను మాత్రమే దౌర్జన్యంగా అమలు పరిచే ప్రక్రియలో మీరు భారత దేశ  పౌరులుగానే కాక మనుషులుగా కూడా చచ్చిపోయారన్న విషయాన్ని ఇప్పడు కూడా కాకపోతే ఇంకెప్పటికి గుర్తిస్తారు??

-written 19th December, 2019

P.S: This was written during the country wide protests against the CAB. The brutal attacks police attacks on the jamai islamia and jnu students and civilians who were protesting peacefully was such a shameful act!! Covid has brushed away all that brutality quietly under the carpet!

భయాన్నిపెంచుతున్నరక్షణ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top