Moral Policing

Foreign Body

Foreign Body, ఇది ఊహించి రాసిన fiction కాదు. ఒక friend lifeలో జరిగిన incident.  Conversation మాత్రం as it is గా present చేశాను. మిగిలినదంతా readability కోసం రాసినది. ఇది రాయడానికి inspiration తనే అయినా ఇక్కడ రాసిందేదీ కొత్త విషయం కాదు. మనలో ప్రతీ ఒక్కరికీ, ఏదో ఒక సందర్భంలో కాస్త ఎక్కువ intensity తోనో, తక్కువ intensityతోనో అనుభవంలోకి వచ్చినదే. అందుకే, Names తో identify అయ్యి, ఏదో storyలా చదవకూడదనే characters ని name చేయలేదు. Place yourself in the plot and feel the abducted freedom of your’s! 

Lunch time!!

ఏవో photos చూసుకుంటూ నవ్వుకుంటున్నారు officeలో ముగ్గురు male colleagues. వెళ్ళి చూసింది ఆమె కూడా! Beachలో ముందు రోజు దిగిన photos అనుకుంటా.  

‘అబ్బా… ఈ Covid ఏమో కానీ beachకి వెళ్ళి ఎన్నాళ్ళైందో! వీళ్ళు బానే వెళ్తున్నారు. నన్నే వెళ్ళొద్దంటోంది అమ్మ!  ఎక్కడికి వెళ్ళేది నువ్వు అన్నీ close చేసి ఉంటే’ అని.  వీళ్ళని చూస్తుంటే కుళ్ళుగా ఉంది ఆమెకు. 


“మేము అప్పుడప్పుడు వెళ్తూనే ఉన్నాం. ఎవరూ ఏం ఆపడం లేదు. బోల్డు మంది వస్తున్నారు. వెళ్ళు ఏం కాదు!”అన్నాడు అందులో ఒకతను.  

“అమ్మ ఒప్పుకోవడం లేదు. జనాలు ఎవరూ లేకపోతే safe కాదేమో అని నేను కూడా ధైర్యంచేయడం లేదు.” 

“అలా అయితే చెప్పు. పోనీ నేనొస్తాను.” ఆఫీస్ లో క్లోజ్ ఫ్రెండ్ అతను.  

“వస్తావా? సరే అయితే రేపు ఆఫీస్కి ఒక 2 hours పర్మిషన్ తీస్కుని వెళదామా? పొద్దున్నేఅంటే మళ్ళీ అమ్మని ఒప్పించాలి.” 

“సరే అయితే! నా బండి మీద వెళ్ళిపోదాం” 

“done! రేపు నీ బండి మీదే ఆఫీసుకెళ్తా అని అమ్మకి చెప్తా అయితే!” 

Every girl

బీచ్లో కూర్చుని తినొచ్చు అని tiffin parcel  చేయించేసుకుని direct గా వెళ్ళిపోయారు. అక్కడ bike park చేస్తుండగానే, దూరం నుంచే ఒక పోలీస్ whistles వేస్తూ చేతులూపుతున్నాడు Entry లేదు అన్నట్టు. అటుగా చూస్తే ఒక నలుగురు అబ్బాయిలు నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు fishermen ఓ common menఓ తెలీదు. వాళ్ళని ఏమీ అనని police వీళ్ళని మాత్రం వద్దని చెప్పేసాడు.  

“వీడేంటి ఇంత overaction చేస్తున్నాడు. మేమొస్తే మమ్మల్ని కనీసం చూడను కూడా చూడడు. అమ్మాయి అబ్బాయి కలిసొస్తే చాలు extra లు చేస్తూ ఉంటారు. వీడితో discussion ఎందుకులే కానీ పద next point కి పోదాం. మనకి టైం కూడా ఎక్కువ లేదు.”  

Next point లో కూడా అదే పరిస్థితి. Already వీళ్ళ కంటే ముందుగా అక్కడికొచ్చిన ఒక నాలుగేళ్ళ బాబుని, వాళ్ళ డాడీని కూడా allow చేయలేదు. ఆ బుడ్డోడు ఏడుపు మొహంపెట్టుకుని చూస్తున్నాడు. బలవంతంగా వాళ్ళ నాన్న వాడిని లాక్కెళ్ళి బండి ఎక్కిస్తే వాడి చూపంతా బీచ్ మీదే ఉంది.  

“పిల్లాడినే వద్దన్నాడు అంటే వీడు మనల్ని అస్సలు వెళ్ళనివ్వడు” అన్నాడు.  

ఆమె కూడా ఏడుపు మొహం పెట్టింది. Dissappointment స్పష్టంగా కనపడుతోంది ఆమె మొహంలో. 

“సర్లే ఏం కాదు … beach road అంతా రోడ్డుకి పక్కనేగా బీచ్! పైకి వెళ్దాం పద!” నవ్వుతూ అన్నాడు.   

కొంత దూరం వచ్చాక “ఆకలేస్తుంది. తినేసి వెళ్దాం కదా?” అన్నాడు 

“ఇలా నుంచుని తినేద్దామా?”  

అప్పటికే బాగా ఎండొచ్చేసింది.  రోడ్డుకి అటు పక్కగా  under  constructionలో ఉన్న ఒక కమాన్ ని చూపిస్తూ “అక్కడ కాస్త నీడ ఉంది. అక్కడకెళ్ళి తిందాం” అన్నాడు.  

“సరే” బండిని తోసుకుంటూ road cross చేసి కమాన్కి అటు పక్కన నీడ ఉన్నవైపు బండి స్టాండ్ వేసాడు. ఇంకా workers ఎవరూ రాలేదు.  బండి మీద అతను కూర్చుని, ఆమె నుంచుని తినడం మొదలెట్టారు.  ఏవో మాట్లాడుకుంటూ, తినడం ముగించి చేతులు కడుక్కుంటుండగా వచ్చారు ఇద్దరు పోలీసులు bike మీద! 

Bike ఆపి అడిగారు.  “ఇక్కడేం చేస్తున్నారు?”  

“బీచ్ కని వచ్చాం, entry restricted అన్నారు. టిఫిన్ తినడానికి…. ” 

“ఇక్కడేం చేస్తున్నారు?” 

“టిఫిన్ తినడానికి ఆగాము”సమాధానం చెప్పాడు.  

“ఆ అమ్మాయి నీకేం అవుతుంది?”  

కమాన్ కి మధ్యలో ఆపిన బండి దగ్గర నుంచి ఒక ఇరవై అడుగులు దూరంలో ఉన్న పోలీసుల దగ్గరగా వెళ్ళి చెప్తున్నాడు
అతను. “Friend!!”

అసలే మాత్రం problematic situationని predict చేయని ఆ అమ్మాయికి వాళ్ళేం, ఎందుకు అడుగుతున్నారో అర్ధం చేసుకోడానికి కొంత time పట్టింది.  

అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ!  

“ఇక్కడేం చేస్తున్నారు?” అతను చెప్పిన సమాధానమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు.  

“నువ్వేం చేస్తుంటావ్? ఆ అమ్మాయి ఏం చేస్తుంది? నువ్వెక్కడ ఉంటావ్? ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది? ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడించు… ” 

“అదేంటండీ రోడ్డు పక్కన బండి ఆపి నుంచుంటే మీరెందుకిలా question చేస్తున్నారు? రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ ఇలానే అడుగుతారా?” 

“రోడ్ మీద వెళ్ళే వాళ్ళందరినీ ఎందుకు అడుగుతాం? ఎవరి మీదైనా doubt ఉంటేనే అడుగుతాం కానీ?”  

“ఇప్పుడు మీకు డౌట్ వచ్చే పని మేమేం చేసాం?… రోడ్డు పక్కన బండి ఆపి.. ” అతని మాట పూర్తి చేసే లోపే పోలీస్
అతని బండి దగ్గరికెళ్ళాడు.

Ignitionలోంచి key తీసేసుకుంటూ మళ్ళీ అదే మాట అడిగాడు. 

“ఇక్కడ దీని వెనుక మీరేం చేస్తున్నారు?” 

“అదేంటండీ… మెయిన్ రోడ్డు పక్కన నుంచుని టిఫిన్ తింటుంటే మీరు ఏం అడుగుతున్నారు? మేమేమన్నా ఏ bushes లోనో, చాటుగా ఉన్నామా… మెయిన్ రోడ్ మీదే కదా ఉన్నాము!” 

“అందరూ ఇలాగే చెప్తారు. ఏవి legal affairs ఓ ఏవి illegal ఓ మాకెలా తెలుస్తుంది? ఎవరెవర్నో తీసుకొచ్చి ఏదో చేసి, ఎక్కడో పడేసిపోతే, మళ్ళీ మేమే వాటి చుట్టూ తిరగాలి.” 

“ఏంటమ్మా? ఏమౌతావ్ ఇతనికి నువ్వు? మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు?” Phoneలో camera on చేసి ఆమె మీద మీదకి వచ్చేస్తున్నాడు ఒక పోలీస్. అతను దగ్గరగా వచ్చే దాకా ఆమెకు అర్ధం కాలేదు అతను camera on చేసాడని. 

Tiffin తినటానికనీ తీసిన mask మళ్ళీపెట్టుకోవడం మర్చిపోయింది. కొన్ని seconds తరువాత కానీ అర్ధం కాలేదు పోలీస్ cameraకి ఆమె face clearగా దొరికిందని. అప్పుడు వేసుకున్నా ఉపయోగం లేదని ఆమెకు తెలిసినా వెంటనే mask వేస్కుంది.

అప్పటిదాకా ఏం జరుగుతుందో అర్ధం కాక ఒక లాంటి shock లో ఉన్న ఆమెకు  అమ్మ నాన్న అన్న మాట వినడమే తెలియని ఒకలాంటి బెదురు వచ్చేసింది. 

‘అమ్మకు చెప్పకుండాఇలా బీచ్ కి రావడం,  పోలీసులు ఇలా పెద్ద scene చేయడం అమ్మకి తెలిస్తే’ అన్న ఊహకే ఆమెకు భయం వేసింది.  

“Tiffin తినడానికని ఇక్కడ ఆగాము. దీన్లో ఏం తప్పుంది?” నోరు తెరిచింది ఆ అమ్మాయి.  

అటు పక్క ఇంకో పోలీస్ తో అతను చాలా గట్టిగా వాదిస్తున్నాడు. పోలీస్ ఏదో అంటున్నాడు…  

“ఇలాంటి వాళ్ళని ఏమంటారో తెలుసా… prostitutes అంటారు.” 

“మీరేం మాట్లాడుతున్నారండీ అసలు… ముందు బండి తాళం ఇవ్వండి” 

పోలీస్ చేతిలోంచి కీ లాక్కోడానికి try చేస్తున్నాడు అతను.  

నిజంగానే ఇద్దరికీ మధ్య affair ఏదైనా ఉండి ఉంటే వేరేలా ఉండేదేమో… అసలేమీ లేని చోట పోలీసులు ఇలా ఇరికించడం ఏమీ అర్ధం కావడం లేదు.  

“మేము ఇద్దరం majors! చిన్నపిల్లలం కాదు. మీకు మమ్మల్ని ఇలా అడిగే right లేదు, అదీ రోడ్డుమీద ఉన్నవాళ్ళని!”

వాళ్ళ ఇంట్లో తెలీడం అతనికి కూడా problem యే! అదీ కాక office లో దీని గురించి ఎవరెన్ని రకాలుగా
మాట్లాడుకుంటారో ఊహించడం కష్టం. మీరేం చేయకుండా పోలీసులు ఎందుకొస్తారు అన్నట్టు ఉంటుంది వాళ్ళ ఆలోచన.  

అతను మాట్లాడుతున్నాడు కదా అని, అప్పటిదాకా quiet గా ఉన్నదల్లా ఆమెకి కూడా కోపం వచ్చేసింది. అసలు ఏం చేశామని వీళ్ళిలా మాట్లాడుతున్నారు?  

“ఏంటండీ… రోడ్డు పక్కన నుంచుని tiffin తినడంలో ఏంటి problem?”ఆ అమ్మాయి గొంతు పెంచి అడిగింది.  

అప్పటికే అతను చాలా సేపు వాళ్ళతో వాదించడం, ఆమె కూడా గట్టిగా సమాధానం చెప్తుండడంతో ఏమనుకున్నారో తెలీదు. Bike keys ఇచ్చేసాడు పోలీస్. అతను bike start చేసాడు. బండి ఎక్కేసింది ఆమె. బీచ్ రోడ్లో ముందుకి పోనిస్తున్నాడు అతను. 

ఆమెకి అసలిక అక్కడ ఉండాలని లేదు. Beach చూడాలన్న కోరిక చచ్చిపోయింది. అతనితో అలా వచ్చి పెద్ద తప్పు చేశానేమో అనిపించింది. ఉన్న పళంగా ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది.  

“వెనక్కి వెళ్ళిపోదాం” అంది.  

“ఇప్పుడు వెనక్కి వెళితే వాళ్ళక్కడే ఉంటారు. వాళ్ళ theory ఏదో correct అన్నట్టు feel అవుతారు. కొంతసేపు ఉండి వెళ్ళిపోదాం.”

ఆమెకసలు ఏటూ వెళ్ళాలని లేదు. రోడ్డు పక్కగా బీచ్ ఉన్న place వచ్చినా ఆమె చూపు అంతా ఎటో ఉంది.  

freedom butterfly



బండి ఆపి “వెళ్దాం పద” అన్నాడు. అక్కడ కొంతమంది ఉన్నారు. పిల్లలతో వచ్చిన parents, groups గా వచ్చిన friends, కొంతమంది couples అక్కడక్కడా ఆ stretch అంతా scatter అయి ఉన్నారు.  

ఎగిరెగిరి పడుతూ ఒడ్డుని తాకిన అలలు తెల్లటి నురగని ఇసుక మీద పల్చగా కప్పిపోతున్నాయి. ఎండకు sea surface వెండిపళ్ళెం లా మెరుస్తూ ఉంది. కానీ ఇవేవీ ఆమెకు కనిపించడం లేదు. కళ్ళ వెంబడి నీళ్ళు కారిపోతున్నాయి.  

ఒక ఐదు నిముషాలు ఆమెను గమనించిన అతను “ఎక్కువ ఆలోచించకు దాని గురించి. వాళ్ళంతే”  

“ఎందుకలా?” 

“ఏముంది చిల్లర కోసం! ఇలా అడిగితే భయపడిపోయి డబ్బులు ఇచ్చేస్తారని.” 

“ఏంటీ అదంతా డబ్బుల కోసమా?” గొంతుపెగుల్చుకుని అడిగింది. 

“నెలాఖరు కదా… దానికోసమే!” 

“చిల్లరంటే ఎంత?”

“ఏముందీ వందా, రెండొందలు, ఐదొందలు… situationని బట్టి, ఎదుటి వాడి vulnerability బట్టి! మన దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేస్తారు? ఎంత ఉంటే అంతే పట్టుకుని పోతారు. జనరల్ గా ఏంటంటే కాస్త intimate గా కనిపించిన వారి దగ్గర ఇలాంటి వేషాలు వేస్తారు. ‘మీ నాన్నతో మాట్లాడతాం, police stationకి రండి’ అంటూ బెదిరిస్తారు. ఇంట్లోవాళ్ళకు తెలిస్తే problem కాబట్టి Obviousగా Couples బెదిరిపోతారు. డబ్బులిచ్చేస్తారు. అవి తీస్కుని ఏమీలేనట్టు quiet గా పోతారు పోలీసులు. అది వీళ్ళకు మామూలే! ఇలా రోడ్డు పక్కన ఆగి, వాళ్ళ పని  వాళ్ళుచేస్కుంటున్న వాళ్ళని కూడా ఇలా విసిగిస్తారని నాకు తెలీదు. బాగా కరువులో ఉన్నట్టున్నారు. దొంగ నా డాష్ లు.” 

“Intimate గా ఉండకూడదని  law లో section ఏంలేదు.” తనలో తనే గొణుక్కుంది.  

“ఔను! లేదు. ఇది సంస్కృతి పరిరక్షణ” వెటకారంగా అన్నాడు అతను.  

మళ్ళీ అతనే అన్నాడు. “చేతిలో చేతులేస్కుని దగ్గరగాకూర్చోవడం, వాళ్ళ లోకంలో వాళ్ళు నవ్వుతూ మాట్లాడుకోవడం, ముద్దు పెట్టుకోవడమో, hug చేస్కోడమో చేస్తూ ఉండడం లాంటివి వీళ్ళ దృష్టిలో పబ్లిక్ గా కాపురం చేయడం. దాన్ని ఎలా అయినా ఆపి సంస్కృతిని కాపాడే బృహత్తర కార్యాన్ని వీళ్ళ భుజం మీద వేసుకుంటారు.” 

“పబ్లిక్ places లో nudity crime కానీ intimateగా ఉండడం కాదు. పోలీసులు public servants! వాళ్ళ duty, law and order maintain అయ్యేలా  చూడడం మాత్రమే. సంస్కృతి పరిరక్షణ వాళ్ళ job కాదు.”ఉక్రోషంగా అంది.  

మళ్ళీ తనే అంది. “వీళ్ళు పోలీసులా? జనాలని పీడించి పీల్చుకు తినే వీళ్ళు పోలీసులా?” 

అతనేం మాట్లాడలేదు. కొంతసేపటి తరువాత అతనే మొదలెట్టాడు.  

“నీకు first time ఇలా అయిందికాబట్టి ఇంతగా feel ఔతున్నావ్. Couples చాలా మంది experience చేసేదే ఇది.లాస్ట్ టైం నా fiancee తో వచ్చినపుడు ఇలానే అయింది.బీచ్ లో దగ్గరగా కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉంటే ఒక పోలీస్ వచ్చి వాడేదో brothel house ridingకి వచ్చినట్టు behave చేసాడు. మేమిద్దరం engaged అనిచెప్పాను. అయినా కూడా parents అదీ ఇదీ అని overaction చేసాడు. మాఇద్దరి parentsకీ తెలీడం ప్రాబ్లెమ్ కాదు కాబట్టి మేం బెదరలేదు. చేసేదేం లేక, డబ్బులు రాలేదన్న కోపంతో “దూరంగా కూర్చోండి. ఇది మీ bedroom కాదు”అని  ఉచిత సలహా ఒకటి ఇచ్చి పోయాడు. 

వరసగా జరిగినదంతా కళ్ళ ముందు రీల్ లా తిరిగింది. చెవుల్లో వాళ్ళ మాటలు మళ్ళీ మళ్ళీ వినపడుతున్నాయి. మళ్ళీ దుఃఖం వచ్చేసింది. చాలా insulting గా ఉంది. తనకేమీ సంబంధం లేని దానిలో తనని ఇలా నిలదీయడం చాలా కష్టంగా అనిపిస్తోంది. ఎంత ప్రయత్నించినా దాని లోంచి బయటకు రాలేకపోతుంది.  

ఆమె మూడ్ మార్చడానికి “సముద్రం బాగుంది కదా” అన్నాడతను. 

ఆమె మాట్లాడలేదు. ఆమె చూపు దూరంగా horizon మీద ఉంది. కానీ ఆమె దాన్ని చూడడంలేదు. ఆమె ధ్యాస ఇక్కడ లేదు. 

ఇలా ఎంతసేపు ఇక్కడ ఉన్నా ఆమె ఇలానే ఉంటుందనిపించింది అతనికి  “సరే! వెళ్దాం పదఅయితే” అన్నాడు అతను.  

“నన్ను ఇంటి దగ్గర దింపేసేయ్.”  

“ఏ? ఆఫీస్ కి రావా?ఏం కాదు. ఇలా ఉంటే అలానే ఉంటావు. ఆఫీస్ కి రా! ఎందుకేడుస్తున్నావ్ అని అమ్మ అడిగితే ఏం చెప్తావు?” 

ఎక్కడికీ వెళ్ళాలని లేదు. ఎవరితోనూ మాట్లాడాలని లేదు. ఎవరూ లేకుండా కొంత సేపు ఒక్కతే ఉండాలనిపిస్తుంది.  

“వద్దు ఇంటికెళ్ళిపోతా” 

ఇంక ఎక్కువ రెట్టించలేదు అతను. “సరే!” ఆమెను ఇంటి దగ్గర దింపేసి ఆఫీస్ కి వెళ్ళిపోయాడు.  

“ఏంటే వచ్చేసావ్” అని అమ్మఅడిగింది.  

“ఒంట్లో నలతగా ఉంది నా దగ్గరికి రాకు” అని అమ్మకి covid భయం పెట్టి గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. 


దిండులో గట్టిగా తల దూర్చేసి వెక్కి వెక్కి ఏడ్చేసింది.  

అసలు తను చేసిన తప్పేంటి? 
బీచ్ కి వెళ్ళాలనుకోవడమా? 
అమ్మకి చెప్పకుండా వెళ్ళడమా? 
ఆ అబ్బాయితో వెళ్ళడమా? 
లేక వెళ్ళి అక్కడ తినడానికి ఆగడమా?  

కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, లోయలు, మంచు, వెన్నెలఇవన్నీ అందరివీ కదా?  


ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా వెళ్ళగలిగే special status అబ్బాయిలు మాత్రమే ఎందుకు ఎంజాయ్ చేయాలి? 

అమ్మాయిలకెందుకు ఇన్ని limitations?  అమ్మాయి మాత్రం ఒక్కతే ఎక్కడికీ వెళ్ళడం safe కాదు. అది బీచ్ అయితేనేం, ఇంటి పక్కనే ఉండే చేరువైతేనేం…? 

నాన్నో, అన్నో, మొగుడో, లేక గుంపుగా friends తోనో వెళ్ళాలి తప్ప ఒక్కతే వెళ్ళడం మాత్రం మంచిది కాదు. పోనీ అలా అని ఎవరితోనైనా వెళ్ళొచ్చా అంటే ఎవరితో వెళ్ళాలి, ఎవరితో వెళ్ళకూడదు అనేది వాళ్ళే decide చేస్తారు. పొరపాటున ఏ boyfriendతోనో, singleగా male friendతోనో వెళ్తే ఇదిగో ఇలా మాటలతో, ప్రశ్నలతో వేధిస్తారు. 

చీకటిలోనూ , ఒంటరితనంలోనూ wild animalsకో, venomous reptilesకో కాక సాటి మనుషులైన మగవాళ్ళకి భయపడాలి.  

ఒక్కతే వెళ్తే చుట్టూ ఉండే మగాళ్ళతో danger.  

Boyfriend తోనో వెళ్తే, అతనితోనే danger. ఆడపిల్లల మీద, వాళ్ళ choices మీద ఏ మాత్రం నమ్మకముండదు. 

మీ మంచి కోసమే వద్దంటున్నాం అని ఆడవాళ్ళని కట్టడి చేసి safety పేరుతో స్వేచ్ఛనంతా లాగేసుకుంటారు.  

అమ్మ కంటే, నాన్న కంటే, చుట్టూ ఉన్నఅందరి కంటే ఆమె safety ఆమెకు కదా ముఖ్యం? 

ఎందుకు ఎప్పుడూ ఎవరో ఒకరు ఆమె వెంటే ఉంటూ ఆమెను కాపాడుకుంటూ ఉండాలి? 

నీకు చేత కాదు, నువ్వు చేయలేవు, నీకు బలంలేదు, నీకేం తెలీదు, నీకు లోకం పోకడ తెలీదు, నువ్వు మోసపోతావు అని అన్నిరకాలుగానూ ఆమెను తక్కువగానే consider చేస్తారు.

“అంత బరువు నువ్వు మోయలేవమ్మా!” 

“ఒక్కదానివే రాత్రి పూటవద్దమ్మా” 

“అంత దూరం ఒక్కదానివే travel చేయడం అంత మంచిది కాదమ్మా” 

“నీకు తెలీదు. అక్కడ ఉండే వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదమ్మా” 

“అబ్బాయిల సంగతి నీకు తెలీదు. మోసపోతావమ్మా!” 

… అంటూ ఏదీ తెలుసుకోనీకుండా, ఏదీ నేర్చుకోనీకుండా, ఎటువంటి ఇబ్బందికి, కష్టానికి, ప్రపంచానికి expose అవ్వనీకుండా, ఆమె capabilities and abilities ని unfold అవ్వనీకుండా ఆమెను restrict చేస్తూనేఉంటారు. 

restriction only FOR girls

Situation ని face చేస్తే కదా దాన్ని ఎలా handle చేయాలో తెలుసుకొనేది?

అసలా పరిస్థితే రానివ్వకుండా ఆమెను  జీవితాంతంవారిపై depend అయ్యేలా చేసుకుంటారు. ఎందుకు restrict చేస్తున్నావ్ అని  ఏ అమ్మాయైనా అడిగితే ఇది restriction కాదు, కాపాడుకోవడం, జాగ్రత్తగా ఉండడం అంటారు.
పని గట్టుకుని restrict చేయాలని చేయకపోయినా జరిగేది మాత్రం అదే!

ఆమెను ఎదగనిస్తే కదా! లైఫ్ ని ప్రపంచాన్ని explore చేయనిస్తే కదా? 

ఎంత చదువుకున్నదైనా, ఎంత సంపాదించేదైనా, ఎంత వయసు ఉన్నా ఆడవారికి మాత్రం freedom ఎప్పుడూ limited గానే ఉంటుంది. కుక్కకి biscuits వేసినట్టు కొంచెం కొంచెం గా ఆమెకు స్వేఛ్చని వదులుతూ ఉంటారు. ఆ స్వేఛ్చని పొంది వారికి జీవితాంతం రుణపడి ఉండాలి.  

అచ్చోసిన ఆంబోతుల్లా మగవాళ్ళు తిరుగుతూ ఉంటే, అమ్మాయిలు మాత్రం మానమనే ఒక imaginary value ని మోసుకుంటూ, దానికి ప్రాణాన్ని అడ్డు పెట్టి కాపాడుకుంటూ ఉండాలి.  అనుక్షణం భయపడుతూ, చుట్టూ గమనించుకుంటూ ఉండాలి. పొరపాటున ఏదైనా చిన్న ప్రమాదం(అది రేప్ అయినా, అబ్యూస్అయినా లేక వీధి చివర ఏడిపించే కుర్రాడైనా) ఎదురైతే దానికి కారణం ఆమె అజాగ్రత్త గానో, బరితెగింపు గానో చూస్తారే తప్ప మగవాడిని కంట్రోల్ చేయాలని, కట్టడి చేయాలని అనుకోరు. అసలు కారణాలన్నిటినీ convenient గా ignore చేస్తారు.  

ఎవరింట్లో అమ్మాయిలని వాళ్ళు కాపాడుకుంటూ ఉంటే మరి వాళ్ళకి harm చేసేదెవరు మరి?  

Okay…అర్ధమైంది! నా నాన్న, నా అన్న, నా మొగుడు నా కొడుకు నాకు మాత్రమే safe అన్న మాట. అవకాశం రానంతవరకే ఏ మగవాడైనా మంచివాడన్నమాట. అమ్మాయి ఒక్కటే  కనిపిస్తే మాత్రం ఆ అవకాశాన్ని ఏ మగవాడూ వదులుకోడన్నమాట. మగవాడి మీద, వాళ్ళ character మీద ఉన్ననమ్మకం అది. మగవాళ్ళందరూ కలిసి కట్ట కట్టుకుని, వాళ్ళు బ్రతికినంత కాలం సిగ్గు పడాల్సిన విషయం ఇది.


ఒకబ్బాయి రోడ్డు మీద సైకిల్ తొక్కుకుంటూనో, నడుచుకుంటూనో, jogging చేస్కుంటూనో వెళ్తే కనీసం గమనించని వాళ్ళంతా దూరంగా ఒక అమ్మాయి వెళ్తుంటే మాత్రం attention అంతా  ఆమె మీదే పెట్టి curiousగా చూసేస్తుంటారు. అమ్మాయి ఒక్కటే అలా తిరగడం, చూసే వాళ్ళకి indigestible matter. అదంతా పల్లెటూర్లలోనే అనుకోవడానికీ లేదు. సిటీల్లో కొన్ని విషయాల్లో acceptance ఉండొచ్చు.అక్కడ కూడా జనాలు తిరిగే చోట అంతగా పట్టించుకోకపోయినా, జన సంచారం తక్కువ ఉన్న చోట మాత్రం ఒకమ్మాయి presence attention grab చేయడం మాత్రం inevitable.  అసలా అమ్మాయి ఇక్కడే భూమి మీద వీళ్ళ మధ్యే పుట్టిందా లేక ఏదైనా గ్రహాంతర వాసా అన్నట్టు చూస్తారు. ఒక Foreign Body కానీ మానవ శరీరంలోకి enter అయితే body ఎలా react అవుతుందో అలా react అవుతారు. 

social anxiety

So, అమ్మాయిలకి స్వేఛ్చ ఒక privilege. ఆమెకు  ఇంట్లోవాళ్ళు , సొసైటీ, ఇలాంటి పోలీసులు వాళ్ళ వీలు బట్టి, విశాల హృదయం బట్టి చేసే favour. 

ఆ పోలీసులు చేసిన పని కూడా అదే! ఒకబ్బాయితో ఆమెను ఒంటరిగా వదిలేయడానికి లంచం కోసం వచ్చారు. 

స్వేఛ్చ ఒకరిచ్చేది ఏంటి అనుకుంటే అన్నిటికీ తెగించాల్సిందే. Risk చేయాల్సిందే. అలా తెగించినపుడో, risk తీసుకోడానికి రెడీ అయినపుడో ఇంట్లో వాళ్ళ దగ్గరి నుంచి resistance ఉండడం commonయే. భయపడతారు. భయపెడతారు. 

ఆ భయాలని, ఆ restrictionsని దాటుకుని ముందుకి వెళ్ళినపుడు ఒక citizen rightsని కాపాడే బాధ్యత Governmentది.

ప్రజల safety వాళ్ళ duty. పోలీసుల presence secure feeling ఇవ్వాల్సిన చోట insecurityని, panicని create చేస్తుంటే తప్పెవరిది? 

Indian penal codeలో ఉన్న sections బట్టి కాక సమాజం నమ్మే morality grounds మీద legalityని డిసైడ్ చేసి duty చేసేవాడు పోలీస్ ఎలా అవుతాడు? 

అలాంటి డ్యూటీలు చేసే moral పోలీసులు ప్రతీఇంట్లోనూ, వీధి చివరా, భారత దేశంలో కోకొల్లలు. పేరుకి మాత్రమే వీళ్ళు government servants.  

Citizen యొక్క rights and duties వాళ్ళ gender బట్టి మారవు అన్న awareness and understanding జనాల్లో తీసుకురావాల్సిన పోలీసులే ఇంత నీచంగా ప్రజలను భయపెట్టి  గూండాగిరి, దౌర్జన్యం చేస్తూ ఉండడాన్ని ఏమనుకోవాలి? 

దారినడ్డగించి బెదిరించి భయపెట్టి డబ్బులు లాక్కునే దారి దొంగలకు వీళ్ళకి తేడా ఏముంది? 

మాటలతో harass చేసి డబ్బులు గుంజాలని try చేసి కుదరక వదిలేసి వెళ్ళిపోయిన burglarsని రక్షక భటులు అని పిలవాలంటే అవమానంగా ఉంది.  

Rulesకి abide అయి unbiasedగా neutralగా ఉండి  law and order maintain చేయాల్సిన వాడు పోలీస్. 

Minimum duty ethics లేకుండా ఇలా చేస్తూ illegal గా behave చేసే వాళ్ళుపోలీసులెలా అవుతారు? 

Crime జరగకుండా ఆపాల్సిన వాళ్ళే, వాళ్ళ powerని అడ్డం పెట్టుకుని crime చేస్తూ ఉంటే ఎవరికి report చేయాలి?  

Crimes చేసేవాళ్ళకే,  వేరే వాళ్ళుచేసే crimes ని ఆపగలిగే right, just because of their job description వచ్చేస్తుందా?  

పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఇంతేనా? 

rape foreign body

ప్రశ్నలు తప్ప జవాబులు ఆమెకు మెదలడం లేదు. ఈ ప్రాబ్లెమ్ కి solution ఏంటి? అసలు లేదా? ఎప్పటికీ రాదా? 

కోపం, దుఃఖం, బాధ, ఏమీ చేయలేని నిస్సహాయత అన్నీ ఆమెని అతలాకుతం చేస్తున్నాయి.  పోలీస్ అన్నపదం తలచుకుంటే ఒకలాంటి జుగుప్స, అసహ్యం కలుగుతోంది. 

Suddenగా  కర్నూల్ లో SI గా చేస్తున్నచిన్నప్పటి తన classmate గుర్తొచ్చాడు. అప్పటిదాకా తనెంత shock లోనూ trauma లోనూ ఉందో అర్ధం అవుతుంది. Close friend! ఇప్పటి దాకా ఎందుకు గుర్తు రాలేదు? అతను కూడా ఇంతేనా? ఆ ఆలోచనకే గుండె మెలి పెట్టినట్టైంది.  

వెంటనే ఫోన్ చేసింది.  చాలా సేపు రింగ్ అయ్యాక ఎత్తాడు. 

 “అబ్బా ఎన్నాళ్టికి గుర్తొచ్చాం మేము! ఎలా ఉన్నారు madam?” అన్నాడు.  

“బిజీగా ఉన్నావా?”  

“పర్లేదు చెప్పు. ఆఫీస్ లేదా ఏంటి ఇవ్వాళ, ఈ టైం లో కాల్ చేసావ్? ఏంటి విషయాలు?”  

జరిగినదంతా మళ్ళీ గుర్తొచ్చి గొంతు పూడుకుపోయింది. 

“Hmm” 

“అంతా ok నా?” కంగారుగా అడిగాడు.  

కష్టం మీద జరిగిందంతా చెప్పింది.  

“ఎవడాడు?  ఏ పోలీస్ స్టేషన్?  పేరు చూసావా? అయినా వెంటనే నాకు కాల్ చేయకుండా ఏం చేసావ్ నువ్వు?” 

Expect చేసిన reactionయే! నిట్టూర్చింది.  

“ఆ టైం లో నాకసలు బుర్ర పనిచేయలేదు. It was completely unexpected! ఇది జరిగి almost నాలుగు గంటలుఅయింది. ఇప్పటిదాకా కూడా నువ్వు గుర్తు రాలేదు.” 

“ఇంత తాపీగా చెప్తున్నావ్ ఏంటసలు నువ్వు?? Aunty కి చెప్పకు. కంగారుపడతారు.”

ఎందుకో ఒక్కసారిగా ఏడుపంతా మాయమయ్యింది. ఒక లాంటి care taking authority తోనే మాట్లాడుతున్నాడు.  అందరూ కాపాడుకుంటూ ఉండడానికి తనేమీ showcase లో బొమ్మకాదు. ప్రేమ పేరుతో జనాలు చెలాయించే considerate పెత్తనంతో విసిగిపోయి ఉంది. తనకెవ్వరి జాలి, సానుభూతి, రక్షణ అక్కర్లేదు అనిపించింది. ఆ tone ని tolerate చేసే situation లో లేదు. తను ఫోన్ చేసింది Information కోసం. 

కొంచెం చిరాగ్గా అంది. “చెప్పలేదు. చెప్పే ఉద్దేశ్యం కూడా లేదు. నువ్ కూడా పోలీస్ department ఏ కదా? ఇలాంటి situation లో నువ్వేం చేస్తావో తెలుసుకోవాలనిపించి చేశాను.” 

Ego hurt అయినట్టుంది. “నేనెందుకు చేస్తాను? Beatకి వెళ్ళేది constables. వాళ్ళే చిల్లర కోసం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు.” 

“అంటే నువ్వు క్లీన్ అంటావు?” కొంచెం వెటకారం గానే అంది.  

“చేసింది వాడెవడో అయితే నువ్వేంటీ నా మీద పడ్డావ్? అయినా ఎవడెళ్ళమన్నాడు నిన్ను వాడితో?” వెటకారం పాళ్ళు ఏ మాత్రం తగ్గకుండా తిరిగి అన్నాడు వాడు.  

“అనుకున్నా… నువ్వు కూడా ఇలాగే మాట్లాడతావని! తప్పు చేసింది వాళ్ళు. కానీ, అక్కడికివెళ్ళి నేనే  తప్పు చేసానన్నట్టు మాట్లాడుతున్నావ్ చూడు. That says it all. నీతో మామూలుగా మాట్లాడదాం అని చేశాను. నీ సలహాలు సూచనలు నాకక్కర్లేదు. ఉంటాను. Bye!” కాల్ కట్చేసింది. 

మళ్ళీ వెంటనే తిరిగి కాల్ చేసాడు.  “‘నువ్ cleanఆ’ అన్నావని కోపం వచ్చింది! సారీ సారీ! అయినా కొట్టుకోవడం మనకి మామూలే కదా! ఇంక అలా మాట్లాడను. ప్రామిస్!” అన్నాడు. 

ఇంకా కోపం తగ్గలేదు. Quiet గా ఉంది.  

“నీకు తెలియనిదేముంది? రేపులు, abuseలు ఎలా పెరుగుతున్నాయో చూస్తున్నావు కదా? అవి జరక్కుండా ఆపాలని మా మీద stress ఉంటుంది. ఇదిగో దాని వల్ల ఇలా కనిపించిన ప్రతీ వాళ్ళనీ అనుమానిస్తూ ఉంటారు. వాళ్ళు చేసింది తప్పే.” 

“నిజంగా rapes ఆపే సదుద్దేశ్యంతో వస్తే అంత demeaningగా నోటికొచ్చినట్టు మాట్లాడరు. వాళ్ళకి డబ్బులు కావాలి. అడిగిన వెంటనే భయపడి ఇచ్చేసే జంటలు కావాలి. Rapes, murders ఆపడానికనివాళ్ళు చెప్పేదంతా పెద్ద డ్రామా! They are trying to exploit their power and loot people. జనాల Weakness ని cash చేసుకోవాలని చూడడం. వాళ్ళు చేసేదాన్ని duty  అనరు. Burglary అనాలి.” 

“hmm” అన్నాడు.  

“మేము ఇద్దరం అంటే friends. మామూలుగానే వెళ్ళాము. వచ్చేసాము. కానీ కొంత మంది lovers ఉంటారు. వాళ్ళకి privacy కావాలి. Privacy అంటే మీ పోలీసోళ్ళు అనుకునేట్టు పబ్లిక్ గా కాపురం చేయడంకాదు. కాసేపు మాట్లాడుకోవడం, ఒకరినొకరు చూసుకోవడం, చేతిలో చెయ్యేసుకుని నడవడం లాంటి చిన్నచిన్నవే సవాలక్ష ఉండొచ్చు couples మధ్య! Love affairs ఇంట్లో వాళ్ళకి తెలిసేలా ఉంటాయా? పోనీ, ఇలా కనిపించిన ప్రతీ జంటని భయపెడితే, రేపులు murders ఆగిపోతాయని నువ్వూ అనుకుంటున్నావా?” 

moral police to check foreign body

“Specific గా నేనేమీ అనుకోవడం లేదు! మా డ్యూటీ మేం చేస్తాం. మాకు పై నుంచి వచ్చే orders ఫాలో అవుతాం. అంతే! Couples ని target చేస్తే తగ్గుతాయని నేనూ అనుకోవడం లేదు. అదొక misconception. నేనూ ఒప్పుకుంటాను. Rapes lovers మధ్యలో rapes జరిగే సందర్భాలు చాలా తక్కువ. నమ్మి వచ్చిన అమ్మాయిని రేప్ చేయాల్సిన అవసరం ఏముంది?  mutual consent తో జరిగే దేన్నీ rape అనరు కదా!” 

“కదా? మరి మీ వాళ్ళేమిటి? ఇంత regressiveగా దిగజారిపోయి ఉన్నారు? మీరిలా వాళ్ళ వెనుక పడుతూ ఉంటే మిమ్మల్ని తప్పించుకోవడం కోసం, privacy కోసం ఇంకా ఇంకా remote places వెతుక్కుంటారు కదా?  అలా చేసి వాళ్ళని ఇంకా risk and dangerous situations లోకి మీ చేతుల్తో మీరే తోస్తున్నారు కదా?  మీ పోలీసుల cruel behaviour, crimes పెరగడానికి, జరగడానికి దోహదపడుతుందే  తప్ప తగ్గించడానికెక్కడ ఉపయోగపడుతుంది??”  

“నువ్వు చెప్పేది నిజమే! ఈ రకంగా నేనెప్పుడూఆలోచించలేదు. ఇంతకీ వాళ్ళు ఏ స్టేషన్ వాళ్ళో తెలుసా?” 

“ఏమో మరి! బీచ్ ఏ ఏరియా లోకి వస్తుందో తెలీదు.”

“ఇప్పుడు నన్నేం చేయమంటావ్ చెప్పు?” 

“నా కోసం అయితే నువ్ ఏమీ చేయనక్కరలేదు. ఈ incident వల్ల  నీ ఆలోచన మారి కనీసం రేపెప్పుడైనా ఇలా ఎవరైనా జంట కనిపిస్తే వాళ్ళతో కాస్త decentగా మాట్లాడి proper గా treat చేస్తే చాలు. కుదిరితే మీ staffని educate చెయ్యి. ఇలా డబ్బుల కోసం కక్కుర్తిగా మనుషుల్ని వేధించడం మానేలా చెయ్యి. కనీసం నీ పరిధి వరకు నువ్ చేస్తే అదే నాకు నువ్ చేసే పెద్ద help!”

“ఫోన్ చేయడమే నీ గొంతు విని భయపడిపోయాను! ఏ పోలీస్ స్టేషన్ ఓ కనుక్కుని అక్కడ SI తో ఒకసారి మాట్లాడతాను. మారతారు అని నేను కచ్చితంగా చెప్పలేను. కానీ try చేయాలిగా” 


“hmm… మార్నింగ్ బాగా disturb అయ్యాను.కానీ ఆలోచించగా ఆలోచించగా నేను face చేసింది చాలా తక్కువ అనిపించింది. ఈ రోజు, మా ప్లేస్ లో ఏ couple ఓ intimateగా ఉండి ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో తలచుకోవడానికే భయంగా ఉంది. ఇలా వీళ్ళు ఎంత మందిని torture చేస్తున్నారో కదా! అవి కాస్త కంట్రోల్ అయితే చాలు. Freedom is our birthright అని చదువుకున్నాం చిన్నప్పుడు. మీరు అయితే, అదే మాటని మొన్న మొన్నటి దాక కూడా చదువుకుని ఉంటారు! దాన్నిఇలా లాక్కోవడం అతి పెద్ద క్రైమ్ కదా! ఇప్పుడేదో overnightలో dramaticగా  ఏదో change వచ్చేస్తుంది అని అయితే expect చేయలేం కానీ ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు మొదలెట్టాలిగా! Thanks for listening to me! సరే అయితే… ఉంటా !నీకు పనుందేమో?”

“భలే దానివేనువ్వు! గంటన్నర సేపు నా టైం తిని ఇప్పుడు పనుందేమో అంటావా?” ఏడిపించడానికి అన్నాడు. 

“హహహ ఏడవకు! పెట్టేస్తున్నా!” ఆమె కూడా నవ్వేసింది.

“ఆంటీ ని అడిగానని చెప్పు. ఈ సారి అటు వచ్చినపుడు కలుస్తా! bye” కాల్ కట్ అయింది.                    

Woman with Outstretched Arms


1 thought on “Foreign Body”

  1. Telling the story without using names is interesting.

    We forgot the actual duty of police instead we habituated fo the moral policing.

    Police is somehow represent the society .. Our society more concern about the moral values than social values (like security etc.)

    Your story beautifully discussed these concerns.

    I felt her contemplation before calling police friend can be shortened.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top