#Period_Period

period talk girl portrait

Examination time కావడంతో అక్కడక్కడ అప్పుడప్పుడు వినిపించే పక్షుల అరుపులు తప్ప స్కూల్ అంతా ప్రశాంతంగా ఉంది. స్టాఫ్ రూమ్ లో టీచర్లందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీ గా ఉన్నారు. 

ఇంతలో ఓ 9th క్లాస్ అమ్మాయి,  స్టాఫ్ రూమ్లోకి entry restricted కావడంతో డోర్ మీద knock చేసింది. డోర్ కి దగ్గరగా ఉన్న మాథ్స్ టీచర్ గౌతమ్, తలెత్తి ఏంటన్నట్టు చూసాడు. 

ఆ అమ్మాయి “Is there a sanitary pad available over here?” అని గట్టిగా అడిగింది.

స్టాఫ్ రూమ్లో ఓ corner లోకూర్చున్న కొత్త హిందీ టీచర్ లత, అప్పటిదాకా పరిసరాలతో సంబంధం లేనంతగా తన పనిలో మునిగిపోయినదల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భూకంపమో, సునామీనో మీద పడినట్టు చివుక్కున తలెత్తింది.

వెంటనే తేరుకుని, రెండడుగుల్లో ఆ పిల్ల దగ్గరికి పరిగెత్తే లోపే గౌతమ్ cupboard లోంచి ఓ sanitary pad తీసి ఆ పిల్లకి ఇచ్చాడు. Pad తీస్కుని థాంక్స్ చెప్పి ఆ పిల్ల మామూలుగా వెళ్ళిపోయింది. తన ప్లేస్ లోకి వెళ్తూ ఏమైందన్నట్టు లతని ఓ చూపు చూసి వెళ్లి మళ్ళీ తన పనిలో తాను మునిగిపోయాడు గౌతమ్. 

అప్పుడు చూసింది చుట్టూ. తాను, తనను గమనిస్తున్న ఇంకో టీచర్ తప్ప ఇంకెవరూ కనీసం తల కూడా ఎత్తలేదు.  అసలేం జరిగిందో కూడా ఎవరికీ కనీసం తెలీనంతగా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు.

Talk Open, Talk Periods:

బరువుగా అడుగులో అడుగు వేసుకుంటూ తన ప్లేస్ కి వెళ్ళి కూర్చుంది. చాలా embarrassing గా అనిపించింది. Lunch time ఏ వరకు పనీ చేయలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు. కనీసం తల కూడా ఎత్తలేదు.

తనని గమనించిన టీచర్ పేరు స్వప్న. వెళ్లి ఆమె పక్కన కూర్చుంది లంచ్ టైం లో. 

అలా ఎలా” అని అడిగింది?   

“ఏది ఎలా?” స్వప్న ఎదురుప్రశ్న.

ఓసారి చుట్టూ చూసి,  గొంతు తగ్గించి “అక్కడ అంత మంది ఆడవాళ్ళుండగా మేల్ టీచర్ pad ఇవ్వడమేంటి? ”   

“ఇస్తే ఏమైంది?” మళ్ళీ ప్రశ్న. 

“ఆ పాప అంత open గా అడగటం, pen ఓ pencil ఓ ఇచ్చినంత casualగా ఆయన pad ఇవ్వడం, thanks చెప్పి ఆ పాప వెళ్లిపోవడం… అంతా ఏదోలా ఉంది. “

“ఏదోలా అంటే??” ఇంకో ప్రశ్న స్వప్న నుంచి.

“ఆ పాప అంటే చిన్నది ఇంకా ఇవేం తెలీవు. కానీ…” అంటూ ఆగిపోయింది. 
“ఎం తెలియాలి ఆ పాపకి?” 

తాను అడిగే ప్రశ్నలకి ప్రశ్నలు మాత్రమే సమాధానాలుగా వస్తుంటే ఏం మాట్లాడాలో తెలీక మొహమంతా ఎర్రగా అయిపోయి, బేలగా చూస్తుండిపోయింది స్వప్న వంక. 

“సరే లతా!” అలా రెట్టించడం వల్ల ఆమె ఇంకా ఇబ్బంది పడుతుందనిపించి భుజం చుట్టూ చేయి వేసి అడిగింది. “Pad సంగతి వదిలేయ్! నీకో tablet కావాలి! అపుడు కూడా అడగడానికి ఇలాగే ఇబ్బంది పడతావా?”

“టాబ్లెట్కి ఎందుకు ఇబ్బంది పడతాను?”

“ఏ ఎందుకు ఇబ్బంది పడవు?”

“టాబ్లెట్ అడగటం, పాడ్ అడగటం ఒకటేనా?”

“తేడా ఏంటి? ఫీవర్ వస్తే paracetamol అడుగుతావ్! Period వస్తే pad అడుగుతావ్! ఏదైనా ఒకటే కదా?”


లత ఆలోచనలో పడింది. కొంతసేపటి తరువాత నెమ్మదిగా అంది “నువ్ ఇలా అంటుంటే చాలా simple గా ఉంది! కానీ నిజంగానే అది అంత సింపులా అని ఆలోచిస్తే కాదనే అనిపిస్తుంది.” 

“సరే! ఎందుక్కాదో చెప్పు? అలాగే అది అంత కాంప్లికేటెడ్ గా ఎందుకుండాలో కూడా నువ్వే చెప్పు”. “ఎందుక్కాదు అంటే…!!!” సాగదీసింది. “పర్లేదు చెప్పు”

Why hide periods?

period talk. Time to talk, period.
Image Credit: TOM WANG/123RF

“నా చిన్నప్పటినుంచీ period గురించి మాట్లాడాలంటే చెప్పే వారి నోటికి, వినే వారి చెవికి అడ్డంగా చేయి ఉండడం must అని మాత్రమే తెలుసు. 

నా సైగలతోనో, కళ్ళు తిప్పిన పద్ధతితోనో నాకు పీరియడ్  అని అర్ధం చేసేస్కునే అమ్మ…
‘ఉందా’ అని అడగడమే అది ఏంటో చెప్పే అవసరమే లేకుండా dress చాటునో చున్నీ చాటునో దాచి పెట్టి ఇచ్చే friend…
dispose చేయాల్సిన padని towel కింద దాచుకుని bathroom నుంచి dustbin దగ్గరికి పరిగెత్తే నేను…
ఆ time లో ఏ అన్నయ్యో ఉంటే వాడు చూడకుండా అడ్డుగా నుంచునే పెద్దమ్మ కూతురు …
వీటన్నిటి మధ్యలో menses was always a forbidden topic for me

అమ్మకీ period వస్తుందని నాకు period start అయిన చాలా రోజులకి కానీ తెలీలేదు. అన్నాళ్ళూ అమ్మ తను వాడే cloth napkins ఉతికి, ఆరేస్తూ ఆ విషయం ఇంట్లో ఉన్న నాక్కూడా తెలీకుండా జాగ్రత్త పడేదా అని ఆశ్చర్యపోయాను. period time లో నేను పడే pain and discomfort అన్నాళ్ళూ, అన్నేళ్ళూ అమ్మకీ ఉన్నాయని తెలుసుకున్నాక చాలా guiltyగా అనిపించింది.

బయట నుంచి వచ్చే అన్నయ్యని ‘chocolate తెచ్చి పెట్టరా’ అని కొన్ని వేల సార్లు అడిగిన నాకు ఎంత Urgent అయినా ‘pads తెచ్చి పెట్టరా’ అని అడగాలన్న ఆలోచన కనీసం రానీయనంతగా పాతుకుపోయిందీ feeling. ఇవ్వాళ్టిది కాదు. అంత తొందరగా పోదు. పోవడం అంత simple కూడా కాదు”

“మార్పు ఎపుడూ simple కాదు. కానీ మార్పు తప్పదని తెలిసి కూడా అటు వైపు అడుగు వేయకపోవడం పిరికితనమే. మన జనరేషన్ లో మనం మోసిన జాడ్యాలని మన తరువాత జనరేషన్ కూడా ఎందుకు మోయాలి? Next generation కూడా వాటినే పట్టుకు ఎందుకు వేలాడాలి?”

ఇక లంచ్ అయ్యేదాకా మాట్లాడలేదు లత. లంచ్ అయ్యాక లేస్తూ “నిజమే! ‘ఆకలేస్తే biscuitనో fruitనో అడగటానికీ, period వస్తే pad అడగటానికి తేడా ఏముంది’ అని వాళ్ళే question చేసేలా పిల్లల్ని పెంచగలిగితే బాగుంటుంది.”  అని వెళ్ళబోయింది లత.

“ఒక్క నిమిషం” ఆగమన్నట్టు చేయి పట్టుకుంది స్వప్న. 

“ఇదే ninth grader అదే టీచర్ని తన క్లాస్లో అందరిముందు లేచి నుంచుని pad కావాలని అడగగలదా? అని నువ్ నన్ను అడుగుతావనుకున్నా. నువ్ అడిగుంటే “అడగలేదేమో” అని సమాధానం చెప్పేదాన్ని.” 

“ఏ” సాలోచనగా అంది లత.

“classroomలో అబ్బాయిలుంటారు కదా!” అని ఆగింది. గట్టిగా నిట్టూర్చి మళ్ళీ మొదలెట్టింది

“టీనేజ్లో ఆడ – మగ ఇద్దరి శరీరాల్లోనూ మార్పులు రావడం, అలాగే Opposite జెండర్లో  వచ్చే మార్పులపై క్యూరియాసిటీ ఉండడం రెండూ సహజమే.

Talk to your boys about periods!

Menstruation అనేది ఆడవారికి సంబంధించినది కావడం, దానికి సంబంధించిన విషయాలేవీ మగపిల్లలకు తెలియనివ్వకుండా గుట్టుగా ఉంచడం వల్ల టీనేజ్ లోని మగపిల్లలకి పీరియడ్ గురించిన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. 

గుట్టుగా ఉంచే విషయం పై కుతూహలం ఉండడం హ్యూమన్ tendency కాబట్టి ఫ్రెండ్స్ దగ్గర నుంచి సగం సగం ఇన్ఫర్మేషన్ ని మాత్రమే సంపాదిస్తారు. 

అంతే కాక, స్త్రీ ఆస్థిగానూ, వస్తువుగానూ పరిగణించబడే మన సమాజంలో ఆమె శరీరానికి అనవసరమైన attention చాలా ఎక్కువ. వ్యక్తి గా ఆమె అభిప్రాయాలకు, ఆలోచనలకు విలువ అతి తక్కువ. ఆమె ఇష్టాలను ఇబ్బందులను గుర్తించి గౌరవించి నడుచుకోలేని సంప్రదాయాలు మన సొంతం.

అవగాహనా రాహిత్యంతో పాటు ఇటువంటి సమాజంలో పెరిగే మగ పిల్లలు వెకిలి నవ్వులు, వల్గర్ కామెంట్స్ తప్పని ఎందుకనుకొంటారు? పైగా అది గొప్పగా, heroic గానూ భావించి దాన్నే అలవర్చుకుంటారు?” 

“అవును … ఇలాంటి విషయమేమైనా వినపడడమే వాళ్ళ కళ్ళు పెద్దవవడం, తలలన్నీ అటు వైపు తిరగడం, పెదాలపై వెక్కిరింతగానో వంకరగానో నవ్వు, గుసగుసలు … ఇవన్నీ common!

తెలిసి తెలిసి ఇలాంటి ఇబ్బందిని ఏ అమ్మాయి మాత్రం కొని తెచ్చుకోవాలనుకుంటుంది? అవి లేకుండా ఏ అమ్మాయీ Indiaలో అయితే పెరిగి ఉండదేమో, at least ఇప్పటివరకు! చాలా convenientగా ఇబ్బందిని avoid చేస్తూ పెరిగేసాం మనం” 

కిటికీ లోంచి బయటికి చూసింది స్వప్న. దూరంగా బాస్కెట్ బాల్ కోర్టులో ఆడుకుంటున్న ఆడ – మగ పిల్లలు కనిపించారు. ఒక అమ్మాయి ఎగిరి  బాస్కెట్ వేస్తే కొంత మంది మగ పిల్లలు వచ్చి ఆ అమ్మాయి భుజం తట్టి మళ్ళీ ఆటలో నిమగ్నమైపోయారు. 

“పిల్లలు భలే ఆడుతున్నారే …. ” లత అంది. అక్కడ ఆడుతున్న పిల్లల్లో ఆడ మగ కనిపించడం లేదు మరి.

Sex education should start at home. 

సెక్స్ ఎడ్యుకేషన్ ఇంటి దగ్గరే మొదలవ్వాలి. మగపిల్లల్లో క్యూరియాసిటీ కాక awareness ని పెంచడం అవసరం. పూర్తి విషయావగాహన ఉన్నప్పుడు ఆడపిల్లలను, వారి ఇబ్బందులను ఇష్టాలను గౌరవించగలిగే మగపిల్లలు తయారవుతారు.” 

విభేదించడానికేం లేదన్నట్టు లత లేచింది. స్వప్న మాత్రం చాలా సేపు బాస్కెట్ బాల్ ఆడుతున్న పిల్లల్ని చూస్తూ ఉండిపోయింది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top