తాతయ్య కి మందు అలవాటు (alcohol consumption) ఉండేదట. మామూలుగా ఉన్నప్పుడు చక్కగా ప్రవర్తించే తాతయ్య, తాగి ఉన్నప్పుడు నానమ్మతో గొడవ పడడం, ముందు వెనకా ఆలోచన లేకుండా తాగుడు మీద ఖర్చు పెట్టడం, అవసరాలను ignore చేసి అలవాటును choose చేసేస్కునే బలహీనత, అన్నీ కలిపి నాన్నకి తాగుడు మీద, మొత్తానికి అలవాట్ల మీదే aversionని బాగా build చేసాయి.
చిన్న వయసులో ఆయన తీసుకున్న నిర్ణయానికి ఆయన అరవై దాటినా కట్టుబడి ఉన్నారు. అవకాశం రాకనో, లేకనో కాదు. Just out of conviction తాగలేదు.
మందు దాకా ఎందుకు? ఆయన కాఫీ టీ లు కూడా ముట్టుకోరు. మేము తాగడాన్ని కూడా discourage చేసేవారు. మమ్మల్ని వద్దంటున్నారని ఆపుతున్నారని తిట్టుకున్న సంధర్భాలున్నా, habitual గా చేసే పనుల వల్ల ఏర్పడే weakness ని మాత్రం కాదనలేము. ఆయన conviction ని respect చేయకుండా ఉండలేము.
ఏదైనా ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండడం అనేది personal choice అనేది నిజమే అయినా అలా ఉండగలగడం వెనుక ఉండే నిబద్ధత మాత్రం కచ్చితంగా మెచ్చుకోదగినది.
నాన్న పరిస్థితి ఇదైతే, పదేళ్ళ తరువాత అదే ఇంట్లో పుట్టిన బాబాయ్ వేరు. బాబాయ్ కి cigarette, alcohol అన్నీ చాలా తొందరగానే అలవాటు అయ్యాయి. నాన్నని ప్రభావితం చేసిన విషయాలేవీ బాబాయిని ప్రభావితం చేయకపోవడం వెనుక కారణాలేమిటి? ఒకే ఇంట్లోని ఇద్దరు, ఒకే పరిస్థితుల్లో పెరిగినా, భిన్నాభిప్రాయాలు ఎందుకు కలిగి ఉన్నారు? వ్యక్తిగత అవగాహన, పరిశీలనలతో పాటు, వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనలు, అనుభవాల ప్రభావం కారణాలై ఉండవచ్చు.
మందు ముట్టకపోవడం, తాగకపోవడం గొప్ప విషయంగానూ, తాగడం తప్పుగానూ project చేయడం నా ఉద్దేశ్యం కాదు
వ్యక్తుల అలవాట్లు personal choices. అది personal గా ఉండి ఎవరినీ ఇబ్బంది పెట్టనంతవరకూ మందు అయినా, cigarette అయినా personalయే.
మన weakness నుంచి మనం ఏర్పరుచుకునే అలవాట్లు మొదటగా హాని చేసేది మనకీ, మన ఆరోగ్యానికే. తరువాత నష్టం మన కుటుంబానికి. అది అంతటి తో ఆగి వారి వరకే పరిమితమైనంతవరకు ఏ ప్రమాదమూ లేదు. కానీ అలా జరగడం లేదే!
Alcohol వల్లే రోజు రోజుకీ rapeలు, రకరకాల crimeలు పెరుగుతున్నాయనేది కొంతమంది వాదనైతే alcohol తాగేవాళ్ళందరూ rapistలు కాదు, జరిగే ప్రతీ rape… alcohol consumption వల్లే జరగడం లేదు అనేది ఇంకొందరి వాదన.
రెండూ కూడా అసలు కారణాల్ని ignore చేస్తూ తప్పు ఎవరో ఒకరి మీద తోసేయడానికో, లేక తప్పించుకోడానికో చేసే ఏ మాత్రం బలం లేని వాదనలే!
Accidents దగ్గర్నుంచి public nuisanceల దాకా…
Domestic violenceల దగ్గరి నుంచి rapeల దాకా…
జరిగే చాలా రకాల violence ల వెనుక ఆల్కహాల్ role ఉందనేది నిజం.
కానీ పై crimes అన్నీ చేయగలిగే చేయగలిగే tendency ఉన్న వాడికి alcohol ఒక catalyst లా పనిచేస్తుందనేది మాత్రం naked truth.
Underline చేసుకోవాల్సిన point, మందు మాత్రమే కారణం కాదు… మందు కూడా కారణమే!! One of the many main reasons.
తాగే వాళ్ళందరూ rapistలు అనో తాగాక అందరూ rape చేస్తారు అని కాదు.
Conscious లో ఉన్నపుడే వారి senses మీద వారికి control లేని వాళ్ళు Intoxication లో ఏం చేయడానికైనా వెనకాడకపోవచ్చు.
మందు అలవాటు ఉండి responsible గా చేసే చాలా మంది నాకు తెలుసు. alcohol consume చేసాక drive చేయకుండా friend ని drop చేయమనో లేక cab తీసుకునో ఇంటికి వెళ్ళేవారు తెలుసు.
Responsible గా behave చేసే, వారి actions మీద వాళ్ళు కంట్రోల్ ఉండి, any mishap కి responsibility తీసుకునే వారి గురించి అసలు మనం మాట్లాడుకోవడం లేదు. అలాంటి వారు వారి actions ని వాళ్ళు own చేసుకుంటారు. వీరి అలవాట్లు మహా అయితే వారి ఆరోగ్యాన్ని పడు చేయొచ్చు and as an extension might create unhappiness in their family.
కానీ ఇక్కడ ప్రశ్నల్లా ఈ control ఎంత మందికి ఉంది? ఎంత మంది విచక్షణతో ప్రవర్తిస్తున్నారు?
What about the people who do not have that control?
Youngsters who are still learning their responsibilities but still have access to those many things that they cannot handle? I definitely didn’t mean adults are more responsible than youngsters. Definitely not!
Alcohol Consumption & Celtic Heroism:
ఇది వరకు సినిమాల్లో cigarette, మందు తాగేవారిని morals లేని వ్యక్తులుగా, బాధ్యత లేని వారిగా, పతనానికి నిదర్శనంగా గానూ చూపించేవారు. వ్యక్తిగత అలవాట్లని, అలా చూపించడాన్ని నేను ఏ రకంగానూ సమర్ధించను. కానీ, మందుని glamorize చేయకూడదన్న సామాజిక స్పృహ, బాధ్యత మాత్రం అప్పటి సినిమాల్లో కనిపించేది.
రానురానూ ఆ పరిస్థితి మారింది. అలవాట్లను వ్యక్తి choices గా మాత్రమే చూపించిన period ఉన్నా అది చాలా చిన్నది.
తరువాత్తరువాత ఈ అలవాట్లను glamorize చేసి చూపించడం మొదలెట్టారు.
Cigarette and alcohol consumptionని heroic గా చూపించడం మొదలెట్టారు.
కించపరుస్తూ, body shaming చేస్తూ మాట్లాడడం నవ్వొచ్చే comedy గానూ, Careless and irresponsible attitude, rash driving, Negative attitude and Aggression, నలుగురిని వెనకేసుకుని తిరగుతూ అమ్మాయిలని ఏడిపించడం, catcall చేయడం, నలుగురిని బాదడాన్ని heroic గా చూపించడం మొదలయింది.
తప్పొప్పుల ప్రసక్తి, personal interests ప్రసక్తి లేకుండా ఎవరూ చేయని పనిని మనం చేయడం గొప్పగానూ, radical గానూ చూపించడం మొదలయ్యింది.
Ultimate గా జీవితం పట్ల అవగాహన, జాగ్రత్త ఉండడం old, boring and disgusting గా feel అవ్వాల్సిన helpless situation నేటి generation ది.
రాసుకుంటూ పోతే life spoil చేసుకోగల ఎన్నెన్నో traitsని inspirationగా తీసుకుని, ప్రస్తుతం మన society ముందుకు పోతోంది. Youth మాత్రమే ఈ పరిస్థితికి కారణం అనకండి. We are being an escapist by doing so. దీని బాధ్యత సమాజం మొత్తానిదీ.
విచ్చలవిడితనాన్ని freedom అనుకుని పొరపడి livesని నాశనం చేస్కుంటున్న మన society కి responsibility ఎవరు, ఎలా నేర్పుతారు?
మన actions మీద మనకి control లేకపోవడం heroic కాదని మన societyకి ఎలా చెప్పాలి?
Self control, Self responsibility compulsory గా ప్రతి ఒక్కరు acquire చేసుకోవాల్సిన, practice చేయాల్సిన positive traits అని ఎలా తెలుసుకుంటారు?
వ్యవస్థలో లోపాలు, పెంపకంలో లోపాలు, సమాజ తీరులో ఉన్న లోపాలని తరచి చూస్కోకుండా, మూలాల్ని వదిలేసి పైపైన కనిపించే వాటిని ఎత్తి చూపిస్తూ, మార్పు రావాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.
దాని వైపు అడుగులు వేయడం మానేసి ఒకరినొకరు point out చేస్కుంటూ ఉండడం వల్ల ఇంకా ఇంకా వెనక్కి వెళ్తున్నాం తప్ప ముందుకు వెళ్లలేకపోతున్నామన్న విషయాన్ని ఇప్పటికీ గుర్తించకపోవడం వల్ల మన కన్నా ఎక్కువ నష్టపోయేది మన future generations, మన పిల్లలు, వారి పిల్లలు.
Are we not moving towards regression instead of progressing towards a better society?
Coming generations కి safe, secure, and a responsible society ని present చేయాలో లేక మన స్వార్ధాలు, బలహీనత కోసం ఉమ్మడిగా వారి future ని నాశనం చేయాలో నిర్ణయించుకోవాల్సింది మనమే!!
చాలా బాగుంది. అలవాట్ల నుంచి బయటపడాలన్న అలవర్చుకోకూడదన్నా జీవితం పట్ల కాస్తయినా ప్రేమ, బాధ్యత వుండాలి. లేదంటే Rest of the life painful గా వుంటది. Regrets/health issues తరుముతుంటాయ్.
తాత నుంచి మొదలెట్టి నేటి యూత్ వరకూ మంచి ఉదాహరణలు, కారణాలు, సమస్యలు అన్ని టచ్ చేశావ్..నిజానికి ఇందులో మీ నాన్న హీరో. అలా లేకుండా ఊరికే అలవాట్ల మీద క్లాస్ పీకే వాల్లంటే చిన్నచూపే. ఏ అలవాటైనా మన కంట్రోల్ లో లేదంటే మనం దాని కంట్రోలోకి వెళ్ళి పోతాం అనే ఫైనల్ మెసేజ్ బావుంది. మందు పైన ప్రభుత్వాలే తగిన చర్యలు తీస్కుంటే బావుంటది. ఆంధ్ర పరిస్థితి కొంత మెరుగు పడినట్లుగా కన్పిస్తుంది. అందుకు మా పక్కింటాయనే సాక్ష్యం లేదంటే ఎవ్వరినీ ప్రశాంతంగా వుండనివ్వడు. తాగి ఒకటే వాగుతూ వుంటాడు.