Smart phone: A Delight or Threat?

Scene 1:

March నుంచి ఇంటికే restrict అయిపోయి, ఎక్కువ movement, outdoor play, friendsతో  పెద్దగా physical interaction లేక Dasara vacation timeకి  ఎక్కడికైనా వెళ్ళాల్సిందే అని మొండికేసి కూర్చున్నాడు మా వాడు. కనీసం వైజాగ్ అయినా వెళ్దాం అని బేలగా అడిగేసరికి వాళ్ళ నాన్న covid బిగింపులన్నిటినీ పక్కన పెట్టి వైజాగ్ trip ఏర్పాట్లు మొదలెట్టాడు.

వైజాగ్లో Singleగా ఉంటున్న ఒక close friend, తన దగ్గర stay చేయడానికి ఇబ్బందేం లేదని భరోసా ఇచ్చాక ,Vizag ప్రయాణమయ్యాం.  పంజరంలోంచి బయట పడడం అంటే అంటే ఎలా ఉంటుందో మొదటిసారి తెలిసిందప్పుడే. Hyderabad apartmentsలోని limited spaces, crowded areas, traffic అన్నిటినీ తప్పించుకుని విశాలమైన open spaceలోకి వచ్చిన feeling మాటల్లో చెప్పలేనిది. 

కొత్తగా రెక్కలొచ్చినట్టు మా వాడు తెగ తిరిగేసాడు. వాడితో పాటు నేను కూడా! Sanitiser, masks, social distance, precautions అంటూ మా అత్యుత్సాహాన్ని అదుపులోకి తీసుకురావడానికి శతవిధాలా try చేసేవాడు వాళ్ళ నాన్న. జాగ్రత్తగా ఉండడం లేదేమో భయం ఏదో ఒక మూల మాకు కూడా ఉన్నా బయటకి వచ్చిన ఆనందాన్ని మాత్రం overcome చేయడంలో మాత్రం fail అయింది. 

Vizag వెళ్ళిన మూడో రోజు, Thikkavanipalem beachకి వెళ్ళాం. అక్కడ NTPC inlet water pipes ఉండే bridge దగ్గరికి వెళ్ళాం. Place బాగుంది. ఎగిరెగిరి పడుతున్న అలలు ఒక పక్కన, రెండడుగులు ఎత్తులో పెరిగిన గడ్డి ఇంకో పక్కన చూడడానికి చాలా బాగుంది.

“అబ్బా” అనుకుంటూ ముందుకి నడుచుకుంటూ వెళ్తుంటే “అమ్మా! ఇక్కడ high tides వస్తున్నాయి. నేను వీడియో తీసుకుంటాను. నువ్వెళ్ళు” అన్నాడు.

నొసలు చిట్లించి చిరాకు నటించి  “సరే” అని ముందుకు వెళ్ళిపోతుంటే “ఆగాగు! రెండు pics తీస్కుంటా… బీచ్ బాగుంది” అన్నాడు తను. 

“నువ్ తీస్కో, నాకొద్దు”  చిరాగ్గా అనేసి ముందుకు వెళ్ళిపోతున్న నన్ను అలాగే ఫోటోలు తీసుకున్నట్టున్నాడు. నేను పట్టించుకోకుండా ముందుకి వెళ్ళిపోయా! 

ఎక్కడికైనా కొత్త placeకి వెళ్తే  photos తీయడం time waste అనిపిస్తుంది నాకు. కంటికి కనిపించే దాన్ని ఏం చేసినా ఒక చిన్న lens లోకి ఇరికించడం impossible, eye lens మించిన lens లేదని నా strong feeling. ఒకవేళ possible అయినా కూడా, ఆ placeని explore చేయడానికి spend చేయాల్సిన active time అంతా ఫోటోల మీద waste అయిపోతుంది అని నా feeling. 

“హా అంతే… నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేకుండా, photos తీసిపెట్టేవాళ్ళుంటే, ఇంక నీకు photos తీయాల్సిన అవసరం ఏముందిలే” వెటకారం దట్టించి మా వాడు నా మీద వేసే sattireలో నిజం లేకపోలేదు. వాళ్ళ నాన్న camera పట్టుకుని తిరగకపోతే  family tripsకి memories ఉండవు అనే వాడి వాదనని accept చేసి, అన్ని photosకి credits తనకి ఇచ్చేసి ‘ఫోటోలకు poseలివ్వను, వాళ్ళనీ, placeనీ  ఫోటోలు తీయను’ అన్న blameని నిర్మోహమాటంగా own చేసేసుకుంటాను తప్ప compromise మాత్రం కాను.  

అక్కడంతా తిరిగేసి నేను వెనక్కి వచ్చేసరికి కూడా వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు, ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ! 
వాళ్ళని disturb చేయకుండా bridge కింద నుంచున్నాను. 

రెండు pillarsకి మధ్యలో నుంచుని వచ్చే అలలని చూస్తూ ఉన్నాను. ఒక్కో అల వచ్చి pillarకి కొట్టుకుని అంతకంటే ఎత్తు లేచి కిందపడుతోంది. చూడ్డానికి బాగుంది. అలా కొంత సేపు చూసాక , అలలు అలా ఎగిరిపడడాన్నిcapture చేయాలనిపించి, అప్పటిదాకా జాగ్రత్తగా bagలో  దాచిన phoneని బయటికి తీసా. 

ఉన్న చోట నుంచి ఒక రెండు అడుగులు ముందుకు వేసి phone పైకి లేపి  frame set చేద్దాం అని చూసాను. ఆ పక్కనే ఒక ఐదుగురు కుర్రాళ్ళు ఫోటోలు  తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు frame లోకి వస్తున్నారు. వాళ్ళు frameలో లేకుంటే బాగుంటుంది అనిపించింది. 

వాళ్ళని పక్కకి తప్పుకోమని అడగలేక ఇంకో రెండు అడుగులు ముందుకు వెళ్తే ఫ్రేమ్ లో కనపడరేమోలే  అని రెండు అడుగులు ముందుకెళ్ళాను. అయినా సరే ఫ్రేమ్ లో ఉన్నారు వాళ్ళు . ఇంకో అడుగు ముందుకి వేసి ఇలా phoneపట్టుకుని start చేసేలోపు, పెద్ద అల ఒకటి వచ్చి pillarకి కొట్టుకుని నా కంటే ఎత్తు పైకి లేచి, వచ్చి గట్టిగా కొట్టింది.

ఏం జరుగుతుందో అర్ధం అయ్యేలోపు నేను కింద పడిపోయాను. Phone  చేతిలోంచి  జారిపోయింది. అల నన్ను లోపలికి  లాగేస్తుండగా లేచి నుంచుందాం అని try చేసాను. కుదరలేదు.

దూరం నుంచి చూస్తున్న తను పరిగెత్తుకొచ్చి నా చేయి అందుకున్నాడు. కాస్త తేరుకుని లేచి నుంచున్నాను. అప్పుడు గుర్తొచ్చింది phone. Phone పడిపోయింది అని అరిచాను.  “ఇంకెందుకులే వదిలేయ్” అన్నాడు తను.

ఆ పక్కనే ఉన్న కుర్రాళ్ళు అలని  చూసి బయటికి పరిగెత్తినట్టున్నారు. తప్పించుకున్నారు. ఈ లోపల వాళ్ళలో ఒక కుర్రాడు వెళ్ళిపోతున్న అలలో కనిపించిన phoneని దొరకబుచ్చుకుని చేతికిచ్చాడు. జారిపోయిన చెప్పులు మాత్రం కొంతసేపటికి వెనక్కొచ్చేసాయి. 

“అమ్మా are you alright?” అని వీడు అడుగుతూ ఉన్నాడు. బుర్రంతా blank గా ఉంది. ఏదో లోకంలో ఉన్నట్టు “ఊ” అని మాత్రం అన్నాను. 

పూర్తిగా తడిసిపోయిన నా చేతిలో తడిసిపోయిన ఫోన్. వెనక్కి తిరిగి చూసాను. Pillars కనిపించాయి. అల వచ్చి కొట్టి, కింద పడేసి, లోపలికి లాగేస్తున్నప్పుడు వెళ్ళి ఏ pillar కో కొట్టుకుని ఉంటే “పరిస్థితి ఏంటి?”అన్న thoughtకి గుండెలో ఒకలాంటి వణుకు వచ్చింది.  

పౌర్ణమి దగ్గరలో ఉండడం వల్లనేమో, tides high and unpredictableగా ఉన్నాయి. దానికి తోడు అలలు వచ్చి pillarsకి తగిలి ఇంకా ఎత్తు లేస్తున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అక్కడ ప్రాణానికే ప్రమాదం అనిపించింది. Maybe సముద్రంలోకి ఇలా pillars ఉన్న ప్రతీ చోటా ఇదే పరిస్థితి ఉండొచ్చేమో.  

తడిసిపోయిన బట్టలు, పనిచేయని బుర్ర, ఫోన్ పట్టుకుని వెళ్ళి కారులో కూర్చున్నాను. Phone open చేయడానికి అవ్వదు. phoneని Service  centerకి ఇవ్వాలన్న ఆలోచన ఆ momentలో ఎవరికీ రాలేదు.

నేను బాగానే ఉన్నాను అని confirm చేస్కుని ముందుగానే plan చేసుకున్నట్టు ఆ తరువాత ఉండే తంతడి beachకి వెళ్ళిపోయాం phoneని carలో వదిలేసి. తంతడి చూసుకుని ఇంటికి వెళ్ళేసరికి late అయింది. Service centers close అయిపోయాయి.

Next day Sunday. మూడో రోజు service center కి ఇస్తే sorry చెప్పి phone dead body చేతిలో పెట్టాడు service center వాడు. ఆ రకంగా ఆ phone పరమపదించింది. 

Scene 2:


Sunday morning sunrise కి beachకి వెళ్ళాం.  కార్ దిగాను. రెండు చేతులు, భుజం, pant pockets అన్నీ ఖాళీ! Beach పక్కనే car park చేయడం వల్ల handbag కూడా carry చేయాల్సిన అవసరం రాలేదు. చేతిలోనో, pocketలోనో phone లేకపోవడం ఇంత relievingగా ఉందేంటి? అనిపించింది.

జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా call or message చేస్తారు అన్న గోల లేదు. అరా కొరా నేను తీసే ఫోటోలు కూడా తీసే అవకాశం కూడా లేదు. అబ్బా ఎంత హాయిగా ఉందో? 

వెలుతురైతే  వచ్చేసింది. కానీ మబ్బులని తప్పించుకుని సూర్యుడు బయటకి రావడానికి మాత్రం పాపం తెగ కష్టపడుతున్నాడు. నాతో వచ్చిన ఇద్దరు పెద్దవాళ్ళు as usual photos తీస్కోవడం లో busyగా ఉంటే పిల్లాడేమో beachలో  frisbee ఆడుకుంటున్నాడు. 


వాళ్ళు మళ్ళీ నన్ను వెతుక్కోకుండా ‘అలా నడుచుకుంటూ వెళ్తున్నాను’ అని చెప్పేసి ముందుకి వెళ్ళిపోయాను. Normal గా అయితే ఎక్కువ వెతుక్కోకుండా వెంటనే call చేస్తాం. ఇప్పుడు నాకు call చేయడానికి phone కూడా లేదుగా! అది ఇబ్బంది పెట్టే విషయంలా కాకుండా హాయిగా feel అయ్యే విషయంలా అనిపిస్తోందేంటి? 

అలా సముద్రాన్ని, మబ్బుల మధ్యనుంచి బయటికొస్తున్న సూర్యుడిని, కాళ్ళను తాకుతున్న అలలను చూసుకుంటూ నడుస్తూ ఉన్నాను. ఏ distraction లేదు. నన్నేదో తరుముతున్న ఫీలింగ్ లేదు.  కళ్ళ ముందు కనిపించే దాన్ని absorb చేసుకోడం తప్ప బుర్రలో వేరే ఏ ఆలోచనా లేదు.మధ్య మధ్యలో వచ్చే messages ఓ, calls ఓ లేవు. ఒకవేళ నేను ఎవరికైనా చేయాలనుకున్నా ఆ అవకాశం లేదు కాబట్టి  ఆ ఆలోచన కూడా రాదు.

చాలా దూరం ముందుకి వెళ్ళిపోయాక వెనక్కి తిరిగి చూసాను. వీళ్ళు ఎవరూ కనిపించడం లేదు. కొంత సేపు అలా ఇసుకలో కూర్చున్నాను. ఇద్దరు-ముగ్గురు  joggers, and ఎవరో ఒక family  తప్ప ఎవరూ లేరు. ప్రశాంతంగా ఉంది. Beach ఏ కాదు. నా బుర్ర కూడా! ఇంత relief just  చేతిలో phone లేకపోవడం వల్లనేనా? ఇదివరకు TVని idiot box అనేవారు కానీ phones వల్ల మనం idiots ఔతున్నామా?

చాలా సేపు అలా ఒంటరిగా అక్కడ అలా కూర్చుండిపోయాను. కదలాలనిపించలేదు. వీళ్ళేమైనా ఇటు వస్తే ఇంకాసేపు ఇక్కడే ఉంటా అని చెప్పాలనిపించింది. మామూలుగా అయితే మెసేజ్ పెట్టేసేదాన్ని. ఆ momentలో phone లేకపోవడం కాస్త ఇబ్బంది అనిపించినా అది momentary మాత్రమే! వాళ్ళు wait చేస్తుంటారేమో అని కదిలాను కానీ వాళ్ళక్కడే దగ్గర్లో ఉండి ఉంటే కదిలేదాన్ని కాదు. అదేదో meditating phase లో ఉన్న feeling ఉంది ఆ time లో. 

ఆ రోజు రాత్రి పడుకునేపుడు “నాకు తెలిసి ఇంక ఆ phone పని చేయదు. ఒకవేళ చేసినా performance down అయిపోతుంది.  ఏం phone కావాలో చూసుకుని కొత్త phone కొనేసుకో” అన్నాడు తను. 


“2 days తరువాత చూస్తా!”

“ఫోన్ లేకుండా, ఇంకో రెండు రోజులు ఉంటావా” ఆశ్చర్యంగా అడిగాడు. 

“Hyderabad వెళ్ళే దాకా ఆగుదామా అనుకుంటున్నాను.”

“అంటే ఇంకో వారం?” పిచ్చి దాన్ని చూసినట్టు చూసాడు. 

“ఫోన్ లేకపోతే హాయిగా ఉంది!”

“…….”

“ఇంట్లో వాళ్ళు, Close friends ఏదైనా అవసరమైతే నీ phoneకి చేస్తారు.  వారం రోజులు phone లేకపోతే ప్రాణం మీదకొచ్చేదేముంటుంది?”

“నిన్నసలా…. సర్లే! నాది dual sim యే కదా? నీ sim ఇవ్వు పోనీ దీన్లో వేస్తా” అన్నాడు. Sim తీసి ఇచ్చాను. Sim వేసి incoming, outgoing access ఉన్నాక ఇంక అసలు ఇప్పుడప్పుడే నాకు phone దేనికి అనిపించింది. నా sim  తన phoneలో ఉండడం వల్ల తనకి disturbance అయితే తప్ప. ఉంటే తను చెప్తాడు కదా! Lite తీసుకున్నా!


Phone వాడొద్దు, పక్కన పెట్టేద్దాంఅనిపించడం నాకు కొత్తేమీ కాదు. Phone వాడకం వల్ల వచ్చే ఒకలాంటి lethargy, monotony and మొద్దుబారిన feelingని తప్పించుకోడానికి phone ఆపేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ మళ్ళీ తిరిగి phone on చేయడమే వెల్లువలా messages and phones వస్తాయి. ఒక Smart phone ఉండి, దాన్ని కార్లోనో, ఇంట్లోనో వదిలేయడానికీ, అసలు లేకపోవడానికి మధ్యనున్న తేడా ఆ వారం రోజుల్లో బాగా అర్ధం అయింది.

ఆరేళ్ళ క్రితం పడింది నా చేతిలో ఈ smart phone! ఈ ఆరేళ్ళలో  నాలోనూ, నా lifestyle లోనూ, నా ఆలోచనల్లోనూ, నా అభిప్రాయాల్లోనూ, ప్రపంచాన్ని చూసే నా దృష్టిలోనూ వచ్చిన positive changesకి completeగా కాకపోయినా partial గానైనా smart phone role ఉంది అనేది undeniable fact.

కానీ, At the same time, నా time మీద,  నా actions మీద, నా works మీద, నా personal space మీద, నా privacy మీద, నా daily routine మీద, నా sleep patterns మీద smart phone has a negative impact అనేది కూడా undeniable fact యే!  When I am saying this, I wonder and fear if I am all alone in feeling so!


అసలు ఈ mobile phone అనేది నా lifeలోకి రాకముందు  నా ప్రపంచమెలా ఉండేది? గత ఇరవై ఏళ్ళలో mobile phone నుంచి smart phone వరకు నా life గుర్తొచ్చింది. Advantages and disadvantages దేనికైనా సహజమే! Advantagesని disadvantages overcome చేసి మన timeని, మన spaceని, మన interests ని ఎంతగా impact చేస్తున్నాయో తలచుకుంటే mind అంతా చాలా restless గా అయిపోయింది. Phone లేని ప్రపంచం ప్రశాంతంగా, హాయిగా ఉంటుందేమో అనిపించడం regressive గా consider చేయాలా? 

smart phone threat


మన timeని, brainని పూర్తిగా occupy చేసి, ఏ పని చేసినా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా మన  ప్రపంచమంతా మన చేతిలో ఉన్న చిన్న smart phone చుట్టూ తిరగడాన్ని positive గా చూడాలా? అసలు memoryని, మెదడుని పదును పెట్టాల్సిన అవసరం లేకుండా fingertips లో information availableగా ఉండడంతో storage కి brain బదులు  phone ని వాడుతూ, చేతిలోని చిన్న gadget control లో మనం ఉండడాన్ని అసలు మనం గుర్తించను కూడా గుర్తించలేకపోతున్నాం.


As of now, చంటి పిల్లల నుంచి ముసలి వారి దాకా almost ప్రతి మనిషిని rule చేస్తున్న most powerful weapon ఈ smart phone!

smart phone threat


సొంత ఆలోచనను చంపడానికీ, కొత్త ఆలోచనను రేకెత్తించడానికీ… 

ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, ఏం తింటున్నాము అన్న insignificant విషయాల daily updates దూరంగా ఉన్న సొంతవారికి  ఇవ్వడానికీ,
ప్రపంచంలో ఏ మూల ఏమి, ఎందుకు జరుగుతుంది అనే పరిజ్ఞానం పెంచుకోడానికీ…

books and magazines లాంటి hard copies కి alternative గానూ, books and reading లాంటి ఆలోచనే రానీయని alternative గానూ,

మనం చేసే పనులు, visit చేసే places, social mediaలో post చేసి  నలుగురికీ చూపించి attention seek చేయడానికీ, hold  చేయడానికీ…

ఆపదలోనో, అవసరంలోనో, medical emergencyలోనో ఉన్న వారికి  help  చేయడానికీ, , దేశంలోనో, ప్రపంచంలోనో ఏ మూలో ఎవరికో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికీ, ఎదిరించడానికీ, తిరుగుబాటుకీ, awareness పెంచడానికీ, 

తిరుగుబాటుని అణగదొక్కడానికీ, , ప్రశ్నించే గొంతుల్ని మూయించడానికీ, important issue మీద నుంచి focusని divert చేసి manipulate చేయడానికీ, పనికి రాని నమ్మకాలని, భయాలని పెంచి పోషించడానికీ, 

అది మంచైనా, చెడైనా మనిషి ప్రస్తుతం వాడుతున్న వస్తువు ఒక్కటే! ఎవరు ఎంత మేరకు వాడుతున్నారనేదే ఎవరికీ వారే సమాధానం చెప్పుకోవాల్సిన  ప్రశ్న! 

“ఇప్పుడు కాకపోతే ఇంకో వారం తరువాతైనా ఫోన్ కొనుక్కోవాలి కదా? phone వాడడం అయితే మానలేవు కదా?”

ఫోన్ లేకపోవడం ప్రపంచపు ఎనిమిదో వింత అన్నట్టు అడిగాడు. 

“Phone లేకుండా ఉండాలని నేనూ అనుకోవడం లేదు. Phone  నాకూ అవసరమే! కానీ phoneతో నేను చేసే చాలా అనవసరపు పనులను మాత్రం తగ్గించుకుందాం అనుకుంటున్నాను. call timeనీ, chat timeనీ, screen timeనీ limit చేద్దాం అనుకుంటున్నాను.”

నవ్వేసాడు. కోపంగా చూసాను. 

“అది అయ్యే పనేనా?”

“చూద్దాం!”

సరిగ్గా వారం తరువాత phone కొన్నాను.  ఇప్పటికి రెండు నెలలయ్యింది కొని.

Phone లేని ఆ వారంలో వచ్చిన ప్రశాంతత మళ్ళీ దొరకలేదు.

Just wondering, Is smart phone a delight or a threat?

1 thought on “Smart phone: A Delight or Threat?”

  1. బాగుంది, రచనా శైలి. ఫోన్ జీవితంలో ఒక భాగమైంది.RGV గారి సినిమా ట్రెయిలర్ నుండి దూరంగా వుంటే క్షేమం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top