work sharing

నీ పని నువ్వు చేస్కోవడం, నాకు చేసే సాయమా?

The Great Indian Kitchen Movie చూస్తుంటే మూడేళ్ళ క్రితం నేను రాసుకున్న ఈ write up గుర్తొచ్చింది.

తాతయ్య 70s లో ఉన్నారు. రోజూ walking must అని నానమ్మ, తాతయ్యలకి doctor advice. పొద్దున్నే నానమ్మ లేచి తాతయ్య ని లేపి అవసరమైనవి అందిస్తే తాతయ్య walking కి వెళ్తారు. ఆ తర్వాత నానమ్మ bed set చేసి, తాతయ్య వచ్చాక ఆయన తాగే juice అదీ ready చేసి table పై పెట్టి, తనూ కాఫీ తాగి, చీర, కొప్పు ఒకటికి రెండు సార్లు సరి చూసుకుని walkingకి వెళ్తుంది. 
                           
నాన్న 50s లో ఉన్నారు. Physical fitness must అని నమ్మే నాన్న పొద్దున్నే ఐదింటికి లేచి brush చేసుకుని swimming కో jogging కో అయన schedule ప్రకారం వెళ్ళిపోతారు. అమ్మకి ఆయన్ని లేపి పంపాల్సిన పని లేదు. ఆయన కూడా అమ్మని లేపరు. 


తొమ్మిది కల్లా ఆఫీస్ కి వెళ్ళాలి కాబట్టి ఎనిమిది దాటాక తిరిగి వస్తారు. వచ్చే దారిలో ఎవరన్నా కనిపిస్తే పిచ్చా పాటీ మాట్లాడి, దేశ ఆర్ధిక పరిస్థితుల గురించి, అంతరించి పోతున్న ప్రాణుల గురించీ, కొత్తగా వస్తున్న సినిమాల్లో తగ్గిపోతున్న విలువలు గురించీ, పెద్దలపై పిల్లలకి పెరుగుతున్న అశ్రద్ధ గురించీ మాట్లాడి ఇంటికి వచ్చి already on చేసి ఉన్నgeyser లోంచి వేడి నీళ్లతో స్నానం చేసి, table పై అమ్మ ready గా పెట్టిన tiffin, coffee తాగి తను dress up అవుతారు. ఈ మధ్యలో అమ్మ ఏమైనా కావాల్సిన వస్తువుల గురించి చెప్తే ‘ఇపుడా చెప్పేది! ఖాళీగా ఏమైనా ఉన్నానా?’ అని ఓ dialogue వేసి office కి వెళ్ళిపోతారు. 

అమ్మ కూడా walkingకి వెళ్తుంది. Hysterectomy తర్వాత body లో hormonal  imbalance వలన వచ్చిన health issues ని deal చేయడం ఆమెకీ కష్టంగానే ఉంది.  తను లేచి పక్క సర్ది, పాలు కాచి, ఇడ్లీలోకో దోసలోకో చేయాల్సిన పచ్చడికి కావాల్సినవి రెడీ చేస్కుని, వంటకి కావాల్సిన కూరగాయలు రెడీ చేస్కుని,  వాషింగ్ మెషిన్ ఆన్ చేసి, వచ్చాక హడావిడి తగ్గించుకునే పనులన్నీ చేసేసి ఆరు దాటాక walking కి వెళ్తుంది. తిరిగి వస్తూ దారిలో ఎవరైనా ఆపి మాట్లాడితే ‘పని అవ్వలేదు, వెళ్ళాలి’ అని నిర్మొహమాటంగా చెప్పి వచ్చేస్తుంది ఆమె కి మాట్లాడాలని ఉన్నా సరే! 

Indian women walking group

                 
అక్క బావలకి పెళ్ళై పదేళ్ళయింది. Buntyగాడికి ఇపుడు ఏడేళ్లు. బావ Fitness freak. తన timings ప్రకారం తను లేచి gym కో joggingకో వెళ్ళిపోతాడు. 


Bunty గాడికి స్కూల్ బస్సు 8 కి వస్తుంది. అక్క లేచి వాడికి కావాల్సిన snacks and lunch box ready చేసి, వెళ్లే ముందు వాడు తినాల్సినవి ready చేసి, అపుడు వాడ్ని నిద్ర లేపితే నీలుగుతూ లేస్తాడు!  ఇక అక్క పాట మొదలు! 

Brush చెయ్, స్నానం చెయ్, తొందరగా తిను అంటూ అక్క వెనక పడుతూ ఉండగా అక్క పాలిటి భగవంతుడిలా బావ ప్రత్యక్షమై table మీద already ready గా ఉన్న tiffin ని వాడికి తినిపించి shoe వేసి school bus ఎక్కించి వస్తాడు. 

ఈ లోపల అక్క ఓ పక్క వంట చేస్తూ అమ్మతోనో లేక ఇంకెవరితోనో phoneమాట్లాడుతూ, ఇంకో పక్క washing machine లో బట్టలువేస్తూ , ఇంకో పక్క office నుంచి వచ్చే mails checking లాంటి multitasking చేస్తూ office కి ready అవుతుంది.

the great Indian kitchen
Image Credit: Paul Meyer/Flickr


అక్క కూడా fitness విషయంలో particular. ఇంట్లో కుదరటం లేదని office నుంచి వస్తూ week లో ఓ  three days gym కి వెళ్లి ఓ one hour spend చేసి వస్తుంది. కానీ ఆ 1 hour Bunty గాడిని  daycare లో ఉంచటమో, బావని తొందరగా రమ్మనడమో చేయాలి. ప్రతీ gym session కి ముందు అక్క coordinate చేయాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. బావకి dinner కి rice కడిగి పెట్టమని చెప్పటమో, లేక Bunty గాడిని park కి తీసుకెళ్లమని పురమాయించటమో, లేక వాడి homework monitor చేయమని చెప్పటమో…  ఇలా చాలానే! 

నేనో, అమ్మో అక్క దగ్గర ఉండటానికి వెళ్తే అక్క లో కనిపించే reliefని మాటల్లో  కొలవడం కొంచెం కష్టమే!                 

నానమ్మ దగ్గర నుంచి అక్క దాకా చూస్తే మార్పు చాలానే వచ్చింది generations తో…  మారాల్సింది ఇంకా ఎంతో ఉన్నా కూడా!

నేను మా నాన్నలా కాదని తనను తాను గొప్పగా చూపించుకుని అమ్మని సంతోషించమని అన్నా, మీ నాన్నలా నేనేం నా సొంత పనులు చేయించుకోవడం లేదని బావ అక్కని దెప్పి పొడిచినా…

అలాగే తాతయ్య ని చూసిన కళ్ళతో నాన్నని చూసిన అమ్మకి నాన్న తాతలా లేకపోవడం తన అదృష్టం కింద అమ్మ భావించినా, నాన్నతో పెరిగిన అక్కకి బావ దొరకడం ఊరటనిచ్చినా…


తాతయ్య లేనపుడు నానమ్మలో, 


నాన్న లేనపుడు అమ్మలో, 


బావ, బన్నీ గాడు ఏ trek పేరుతోనో ఊరేగడానికి వెళ్ళినపుడు అక్కలో,


కనిపించే మార్పు వాళ్ళ ఉదయంలో  రోజూ ఉండాలంటే ఉండాలంటే ఏం చేయొచ్చు?


P.S: లేవడమే మొదట Washroom కి కాక వంట గదిలోకో, అదీ కాకపోతే లేచిన మరు నిమిషమే మనిషిలో ఉండే బద్ధకం తాలూకు ఛాయలు మాయమై machine లా మారిపోయే మీ wives, mothers, sisters or grand moms ని ఎపుడైనా గమనించారా?

PS 2: చాలా మంది మగవాళ్ళు ఇంటి పనిలో, వంట పనిలో help చేస్తున్నారు. నిజమే! మార్పు వచ్చింది.

కానీ help చేస్తున్నానని వాళ్ళు,  చేయించుకుంటున్నాని వీళ్ళు అనుకున్నంతకాలం ఆ పని ఎప్పటికీ వారిది అవ్వదు. Help గానే మిగిలిపోతుంది. పని ఆడవారిది గానే మిగిలిపోతుంది.

– Written on 25 Nov, 2017

The Great Indian Kitchen is a must watch movie for many reasons. It’s tight slap for every man. I don’t think there would be any man, who cannot relate to what’s happening in the movie. If he says, he doesn’t. He is lying.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top