super woman menstrual cup

Menstrual Cup and Stress-free Periods are Synonyms

This story goes back to 2016!!


2016 దాకా padsకి ఏమైనా better alternatives ఉన్నాయేమో, try చేద్దాం అన్న ఆలోచనే రాలేదు. ఎందుకంటే, Heavy bleeding అయ్యే రోజుల్లో కూడా timeకి  pad change చేస్కునే అవకాశం ఉన్న work placesలో ఉండడం వలన basicగా ఆ అవసరమే రాలేదు.  కానీ 2016 లో నేను work చేసే చోట ఎక్కువ ఎండ, చెమట, pad changing కి అంత అనువుగా లేని పరిసరాల వల్ల ఆలోచించక తప్పలేదు. నాకు అప్పుడు కనిపించిన alternatives tampons and menstrual cup. 

safe period with menstruation cup


Tampons గురించి ఎప్పటి నుంచో తెలిసినా వాటికి ఉన్న disadvantages వల్ల, tampon కన్నా pad ఏ better అనిపించేది అన్ని రకాలుగానూ. అందుకే ఎప్పుడూ వాటి జోలికి వెళ్ళలేదు. అలా అని, cup try చేసేంత ధైర్యం చేయలేకపోయాను.  Pads to cup felt like a big leap for me. ఏదో ఒకటి లోపల insert చేయడం risky ఏమో అన్న భయం నన్ను ఆపేసింది అప్పుడు. వేరే option లేక tampon కే shift అయ్యాను. 

Tampon వాడడం మొదలెట్టాక  physicalగా ఎటువంటి discomfort లేదు. Vaginal areaలో period time లో experience చేసే wetness, కాళ్ళు freeగా stretch చేస్తే pad displace అవుద్దేమో అన్న భయం, leak అయి బట్టలు stain అవుతాయేమో అన్న stress అన్నీ పోయాయి. కానీ psychological గా మాత్రం ఒక unease ని carry చేసేదాన్ని. Tampons bloodతో పాటు, vaginal fluids and wetness కూడా absorb చేస్తాయన్న కారణం నన్ను కుదురుగా ఉండనిచ్చేది కాదు.

menstrual cup stress-free when compared to tampon

Westలో చాలా విరివిగా వాడినా మన దగ్గర వీటి గురించిన awareness, availability రెండూ తక్కువే. తప్పని సరైన రోజుల్లో తప్ప tampon వాడేదాన్ని కాదు. Late thirties లో మొదలెట్టాను, అది కూడా limited గా వాడుతున్నాను కాబట్టి ఏ complication రాదులే అని నాకు నేను సర్ది చెప్పుకునే దాన్ని.

Tampons వల్ల ఇంకొక drawback ఏంటంటే ఎప్పుడైనా on time tampon change చేయకపోతే అవి కూడా leak అవుతాయి. అలా change చేసుకోడం కుదరదు అని ముందే తెలిస్తేనో, లేక మరీ sudden heavy flow వచ్చి leak అయితోనో అన్న doubt ఉన్నప్పుడల్లా tampon ఉన్నా సరే pad పెట్టుకోవాలి. So, ఈ రకంగా నాకు cup వాడే ధైర్యం వచ్చే దాకా చాలా పొదుపుగా, జాగ్రత్తగా, selective గా tamponsని వాడేదాన్ని. రెండేళ్ళలో మొత్తమ్ మీద ఒక 30 tampons వాడి ఉంటాను. 

ఊర్లు తిరగడం, water bodiesలోనూ, వర్షంలోనూ తడవడం నాకు  చాలా ఇష్టం.  Toursకి వెళ్ళినపుడు periods వస్తే చాలా ఉక్రోషంగా ఉండేది. First thing, ఆ time లో physicalగా నా body అంత active గా ఉండకపోవడం, tiredness, ఏదో ఒక నొప్పులు ఉండడం కారణం అయితే రెండోది frequent need to change pads and the inability to get into the water. Tampon కూడా not helping me much అనిపించింది. లాభం లేదు, It’s high time I start using a cup అనిపించింది చివరికి.


అదే timeలో ఒక trip, tripతో పాటు periods ఉన్నాయి. ఎప్పట్నుంచో friends అందరం కలిసి plan చేసుకున్న trip. అందరికీ కుదిరి అప్పటికి fix అయింది. Periods కోసం tripని postpone చేయడం అవ్వదు. అలా అని periodsని postpone చేయడమూ ఇష్టం లేదు. ఒకవేళ tripని postpone చేసినా అంత మంది friendsలో ఎవరో ఒకరు periods లో ఉండడం తప్పదు. Let me face it అనుకున్నా. Period pains and  weaknessని ఏ రకంగానూ ఎలాగూ avoid చేయలేను. కనీసం ఈ pad and tampon changing havoc ని తగ్గించొచ్చు అనుకుని  cup order చేశాను. Trip కి వెళ్ళిన రెండో రోజే periods వచ్చాయి. 

First half day padతో నెట్టుకొచ్చా. రెండో రోజు తప్పలేదు. Heavy bleeding and day long outing. Cup insert చేసేప్పుడు చేతులు resist చేసాయి. Freeగా  చేయి లోపలికి పెట్టలేకపోయాను. Fold చేసిన cup open అయిపోవడం, ఈ process లో vagina area అంతా rub అవ్వడం, దాని వల్ల నొప్పి అనిపించడం… ఇలా చాలా సేపు కష్టపడ్డాను. మొత్తం మీద ఒక 10 నిముషాలు కష్టం తరువాత successful గా ఒక comfortable position కుదిరి cup insert చేశాను. Cup పెట్టుకున్నాక  physicalగా ఏ రకమైన inconvenience లేకపోయినా, psychologicalగా తెలియని inconvenience. 

మార్పుకి, కొత్త వాటికి శరీరం నుంచి వచ్చే resistance అతి తక్కువ. ఏ rash ఓ allergy రూపంలోనో చూపిస్తుంది. మార్పుని దూరంగా తోసేయడానికి కారణాలు వెతుక్కునేది మన బుర్రే. అది రకరకాలుగా వద్దు వద్దు అని మనని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఆ రోజు నేను అలాంటి resistance ని overcome అయ్యి cup ని ఉంచుకున్నాను. ఇదంతా చదివే మగవారికి అతి అనిపించినా reality ఇదే. Exact గా ఆడవాళ్ళు ఇలాగే feel అవుతారు. మీరు వద్దనుకున్నా, అతి అనుకున్నా సరే, ఇది ఇలానే ఉంటుంది. ఒక్కసారి open గా మీ partner నో girlfriend నో వారి experiences అడగండి.  వాళ్ళు చెప్పేది ఓపిగ్గా వినండి. మీకే తెలుస్తుంది. 

Cup పెట్టుకున్న గంటకి, రోజంతా cup తో ఉంటే overflow అయితే? అప్పుడు దాన్ని ఎక్కడ తీయాలి ఎలా తీయాలి, ఎలా వాష్ చేయాలి లాంటి ఆలోచనలు బుర్రలో తిరిగాయి. దీని కంటే పాడ్ పెట్టేసుకోడం బెటర్ ఏమో! ఇంకో సారి తీరిగ్గా ఇంట్లో ఉన్నపుడు కప్ ట్రై చేయొచ్చు అని ఒక గంట తరువాత బయటికి బయలు దేరే ముందు washroom లోకి వెళ్ళి cup తీసేసా!

గంటకే, cupలో 1/4th part bloodతో fill అయి ఉంది. ఎంత quantity blood పోతుంది అని Pads and tampons వల్ల తెలీడం లేదు కానీ cup వల్ల మాత్రం అది క్లియర్ గా తెలుస్తుంది. Generalగా, ఒక month లో compared to the previous months ఎక్కువ bleeding అయిందా తక్కువ bleeding అయిందా అనేది ఆ monthలో use చేసిన  number of pads బట్టి assess చేసుకుంటాం కదా. దాని కంటే ఇది ఇంకా apt tool కదా అనిపించింది. Anyways, washroom లోకి వెళ్ళాక నా ఆలోచన మార్చుకుని మళ్ళీ కప్ పెట్టేసుకుని బయటికొచ్చేసా!

menstrual cup

మొత్తమ్మీద, ఆ రకంగా నేను cup వాడడం మొదలెట్టాను. ఆ రోజంతా వర్షమే. Friends అందరం bikes hire చేస్కుని బీచ్లమ్మట తిరిగాము. వర్షంలో తడిసాము. Eveningకి రూమ్ కి చేరాము. Periods వల్ల ఉండే నొప్పులు, tiredness, exhaustion తప్ప bleedingకి సంబంధించిన ఏ ఇబ్బందీ లేదు. Pad changing అవసరం లేకపోవడం మాత్రమే కాదు. Pads, tampons వల్ల flow ఫీల్ అవుతాము. Blood oozing తెలుస్తూ ఉంటుంది. 

Pads వల్ల wetness, కాళ్ళ మధ్య pad అడ్డంగా ఉన్న feeling, inconvenience ఉంటాయి. అవేమీ లేకపోవడం చాలా హాయిగా అనిపించింది. దానికి తోడు, నా first cup experience ఒక trip లో అవ్వడం వల్ల నా focus మేం తిరుగుతున్న places మీద, enjoyment మీద తప్ప cup మీద లేదు. అదే ఇంట్లో ఉండి ఉంటే నా attention cup మీదే ఉండేదా అనిపించింది. అలా నా Menstrual cup  యాత్ర మొదలయ్యింది. 

ఇప్పటికి 1 and half year నుంచి వాడుతున్నాను. మహా వాడితే ఇంకో పదేళ్ళు వాడతానేమో. But, I am happy atleast i switched to the cup atleast now. ఇన్నేళ్ళ periodsలో periods కి separate panties, flow బట్టి రకరకాల pads try చేయడం, కాళ్ళ మధ్య అడ్డంగా అనుక్షణం నేనున్నానంటూ గుర్తు చేసే pads, ఎంత pads లో కొత్త కొత్త features వచ్చినా sudden heavy flow అప్పుడు experience చేసే wetness, inconvenience, Long streches pad మార్చలేకపోతే పడే టెన్షన్, వాటర్ లోనో వర్షం లోనో తడవలేకపోవడం, లాంగ్ జర్నీ hours గురించి భయపడటం, comfortable గా కూర్చోలేకపోవడం, కాళ్ళు ఎలా పడితే అలా spread చేయలేకపోవడం, happyగా వళ్ళొదిలేసి నిద్రపోలేకపోవడం, నిద్ర మధ్యలో లేచి pad మార్చుకోవాల్సిరావడం, వాటి వల్ల ఎక్కువ నిద్రపోవాల్సిన సమయంలో రోజూ కంటే తక్కువ నిద్రపోవడం లాంటి ఇబ్బందులన్నీ ఒక్క దెబ్బతో హుష్ కాకి. ఎంత హాయిగా ఉందో!

నేను వాడుతున్నది ఇదీ

menstrual cup

అసలు ఆ కాస్త నొప్పులు, tiredness కూడా లేకపోతే periods timeలో ‘నాకు periods’ అన్న విషయమే గుర్తు ఉండనంత హాయిగా ఉంది. కప్ లోపల ఉండగా urination and bowel movement అప్పుడు ఎలా అన్న సందేహం అక్కర్లేదు. దేని దారి దానిదే! ఎటువంటి ఇబ్బంది ఉండదు.Trust me, I am not exaggerating and this is exactly how I felt after I started using the menstrual cup. 

మొదట్లో first and last day pads యే వాడి, heavy bleeding అయ్యే days మాత్రం cup use చేసేదాన్ని. తరువాత్తరువాత, complete గా pads మానేసాను. ఇప్పుడు, ఇంటికి ఎవరైనా వచ్చి sudden గా pad కావాలంటే ఉండాలి కాబట్టి వాళ్ళకోసం stand byగా  ఉంచుతున్నాను. 

ఇక recommendation అంటారా? లెక్క ప్రకారం, Periods వచ్చే అన్ని వయసుల వాళ్ళు దీన్ని వాడేయొచ్చు. కానీ, personalగా  పిల్లల విషయంలో I am little skeptical. Periods వచ్చిన కొత్తలో periodsకి, pads కి అలవాటు పడడానికి time పడుతుంది పిల్లలకి. దానికి తోడు, ఇది insert చేసి తీసే processలో సరిగా  sterilize చేయకపోయినా, reinsert చేసేప్పుడు proper గా wash చేయకపోయినా, improper గా insert చేసినా, చేసేపుడు గోళ్ళు గుచ్చుకుని vaginal area rupture అయినా problem అవుతుంది. There is every chance of mishandling and they might end up with infections. The menstrual cup needs to be thoroughly sanitised and needs hygienic handling.

By saying so, I am sorry, I don’t mean to underestimate children’s abilities but am just saying that this needs extra caution. And above all this, vaginal area is ultra sensitive. An area that can be sexually sensitised very easily.  పిల్లలు హడావిడిలో rough గా handle చేయడంలో ఆ area లో sensitivity lose అయ్యే chances ఉన్నాయా అనే doubt కూడా ఉంది.  

సో, overallగా  నా suggestion ఏంటంటే teenage పిల్లల mothers ముందు దీన్ని వాడడం మొదలెడితే ‘ఎలా వాడాలి, ఏంటి’ అన్న విషయం మీద వారికి మంచి అవగాహన వస్తుంది. ఆ తరువాత, ఎలా అయితే దగ్గరుండి pads పెట్టుకోవడం నేర్పిస్తారో, అలాగే cup handling కి సంబంధించి కూడా mothers పిల్లలని guide చేయవచ్చు. ఇదంతా జరగాలంటే ముందు mothers వాడాలి.  ఎవరెన్ని చెప్పినా, మనం వాడితే తప్ప కొన్ని విషయాల గురించిన అవగాహన రాదు. నేను వాడి నాకు చాలా నచ్చింది అని చెప్పినంత మాత్రాన మీకు కూడా అది అంతే beneficialగా ఉండాలని లేదు. మీరు try చేస్తే తప్ప మీకు కూడా అది అంతే ఉపయోగమా కాదా అనేది తెలీదు. 

కానీ ఒకటి మాత్రం నేను కచ్చితంగా చెప్పగలను. మీరు దీన్ని try చేయకపోతే మాత్రం మీ periodsకి, మీ womanhood కి సంబంధించిన ఒక life changing tool ని miss అయినట్టే అని మాత్రం చెప్పగలను. ముందు వాడండి. వాడాక మీకు set అవ్వలేదనిపిస్తే వదిలేయండి. కానీ cup size చూసి, లేక అది వాడే procedure కి భయపడి మాత్రం దీన్ని try చేయడం మానకండి. 6 to 8 hours based on your flow, ఏ జంజాటం లేకుండా happy గా relax అవ్వచ్చు. తీసేపుడు, పెట్టేపుడు ఉన్న కాస్త ఇబ్బందిని overcome అవ్వగలిగితే you will witness the best period of your life. You can take my word on that. Just give it a try and see!!


ఇంకొక విషయమేంటంటే, నేను cup గురించి తెలుసుకున్న కొత్తలో how ecofriendly it is అనే విషయం పై stress చేయడం చూసాను. Cup ecofriendlyగా మాత్రమే project చేయబడేది. ఎవరైతే environment conscious ఉంటారో వారికి దీన్ని recommend చేసే వారు. Please switch to menstrual cups and save mother earth లాంటి captions చాలా కనిపించేవి. ఇంత మంది menstruating women ప్రతీ month ఇన్ని Sanitary pads వాడితే how much pollution will we be adding on to the mother earth అని. Though I completely agree with it, I felt it’s not the right way to promote the menstrual cup. 

More than it’s eco-friendly benefits, menstrual cup’s female-friendly benefits need to be highlighted. It’s a boon to the female population. Once, they start using it, the eco-friendly benefits automatically start falling in place. I honestly, felt the stress was not given on the right point. 

So, My dear girls of all ages, try the menstrual cup and find your luck. There’s so much life out there that you are missing out using the sanitary napkins. All it costs you is just a few hundred rupees!

You can order it from amazon!!

Here is the link for you to order your menstrual cup: https://amzn.to/2K5XRn6

Wish you all a happy and stress free period. 

P.S: My Dear men who just flipped this post off and moved away… wait a second!!

Start getting personal about the period woes of the women in your life. Understand and own their suffering though you can’t experience it. This is for those beloved women in your life(may it be your mom, wife, friend or daughter). Take this to them. It’s your minimum responsibility to make them aware of the life that they are missing upon!! Remember There definitely is a hidden joy of yours in their stress-free periods! Own it up!

12 thoughts on “Menstrual Cup and Stress-free Periods are Synonyms”

  1. సమస్య, ఇబ్బంది, పరిష్కార దారులు, అందులో ఒకదానికి మించి మరొకటి అన్నట్లు మెరుగయినది సౌకర్యవంతం అయినది అంటూ ప్రతి దాని పనితీరు, ఆక్షేపణలు అంటూ చివరకు అత్యంత మెరుగైనది వివరించారు.
    రుతుక్రమం అంటే భయపడే వారు మాత్రమే కాకుండా మగ వారికి కూడా అందులో ఉండే ఇబ్బందిని, కప్ వినియోగం వలన లాభాలు కూడా అర్థం అయ్యేలా చెప్పారు.
    #gift a menstrual cup challange మొదలు పెట్టాలి.
    ధన్యవాదములు చరిత గారు. నేను ఈ సమాచారాన్ని నా కుటుంబసభ్యులతో, స్నేహితులతో సన్నిహితులతో పంచుకుంటాను.
    -mohan

  2. Thank you for your deailed explanation.
    I just wanna share an incident.
    నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు, మా సీనియర్ ఒక ఆమె హెవీ బ్లీడింగ్ ఇష్యూ కి లోకల్ RMP డాక్టర్ నుంచి సరైన ట్రీట్మెంట్ అందక, మెరుగైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోయింది. గ్రామాల్లో ఇప్పటికి నెలసరి గురించి పబ్లిక్గా మాట్లాడడం అనేది లేదు, still it is a taboo.

    పాడ్స్ సంగతి పక్కన పెడితే ఇంకా పాత బట్టలనే వాడుతున్నారు. పాడ్స్ ని నల్ల కవర్ లో/న్యూస్ పేపర్లో చుట్టి అమ్ముతున్నారు, పాడ్స్ అని పేపర్ మీద రాసి షాప్ కి పంపిస్తారు. ఇంకా పూర్తిగా పాడ్స్ కి అలవాటు పడని వాళ్ళు కప్స్ కి చేంజ్ అవ్వడానికి చాలా టైం పట్టవచ్చేమో.

    1. That’s sad and I totally agree with you. ఇంకా padsకి కూడా మారడానికి అనుకూలించని పరిస్థితుల్లో ఎంతో మంది స్త్రీలు, ఆడపిల్లలు ఉన్నారు. Menstruation చుట్టూ చాలా అపోహలు, సోషల్ స్టిగ్మా ఉన్నాయన్నది నిజం.
      Cup గురించిన పూర్తి అవగాహన లేని వారిని, pads ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతూ cupకి shift అవ్వడానికి సంకోచించే వారిని, దృష్టిలో పెట్టుకుని రాసిన ఆర్టికల్ ఇది. Periods చుట్టూ ఉన్న అపోహలు, social stigma ని బ్రేక్ చేయడం కోసం పిల్లలకోసం, పెద్దవారికోసం రాసిన కథలు ఈ link లో ఉన్నాయి. https://cherwrites.com/category/period-stories/

  3. thanks a lot Charitha, for sharing such useful information on menstrual cups, i heard about it from my cousin few years back but as u have mentioned i was hesitant about it & avoided it. But , now i guess after reading your article i think i can give a try

  4. కాఫెర్ టీ లూప్ వేయించుకున్న వాళ్ళు ఈ cup use చేయొచ్చా pls ఆన్సర్ me

    1. As the concept of menstrual cup is based on vacuum creation and suction, there are chances of the IUD getting dislodged when you remove the cup. It’s always to consult your gynecologist before you start using a menstrual cup when you have an IUD inserted.

  5. This is really a wonderful write up Charitha garu. A lot needs to be done to promote the awareness on stigmas about Menstrual Hygiene among girls and women in India.

    We have a project (Swechha) that we have been trying to break the silence on Menstruation and related taboos. “Pad2Cup” is something we have been thinking for last one year to increase the awareness of. We don’t mind keeping some budget aside if someone like you is willing to lead the campaign. I request you and others also to share inputs.

    – Surya Prasad
    Founder & CEO
    Padala Charitable Trust
    http://pct-india.org/swechha/

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top