vasectomy family planning

The Conveniently Ignored Gender Responsibility

జంబలకిడి పంబ’ అనే ఒక EVV mark  చవకబారు comedy movie release అయ్యే time కి నాకు పన్నెండేళ్ళు ఉంటాయేమో! సినిమా సంగతి ఎలా ఉన్నా, వారి శరీర ధర్మం వల్ల స్త్రీలు మాత్రమే ఎదుర్కోవలసిన నొప్పి, బాధ, కష్టాలు, వారు ఎదుర్కొనే సాంఘిక అసమానతలు పురుషులకు transfer అయ్యి వారికి అనుభవంలోకి వచ్చేలా చేయడం, పురుషులు అనుభవించే సుఖాలు, comforts, societal గా వాళ్ళు అనుభవించే privileges అన్నీ ఆడవారు పొందడమనే concept, ఆ వయసులోనే నాకు బాగా నచ్చేసింది. 

ప్రకృతి పరంగా కూడా స్త్రీ బలహీనమన్న భావన ఎంతగా నాటుకుపోకపోతే ఒక  పన్నెండేళ్ల అమ్మాయికి, “నిజంగా అలా ఉంటే ఎంత బాగుంటుందో కదా” అని అనిపిస్తుంది? 


అప్పుడు సరే, ఇప్పటికి కూడా అలాంటి ఒక setup ఉంటే భలే బాగుంటుంది కదా అని అనిపిస్తూనే ఉంటుంది నాకు. నెలలో ఒక్కసారైనా అనిపిస్తుంది. 

నా చుట్టూ ఉన్న స్త్రీలను చూసినప్పుడల్లా అనిపిస్తుంది.

Committed relationships లోనూ, so called పెళ్ళిళ్ళలోనూ కూడా కలయిక కోసం కూడా లెక్కలేసుకోవాల్సి వచ్చే స్త్రీలను చూసినప్పుడల్లా అనిపిస్తుంది.

ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎప్పుడో ఒకసారి period ఏ నాలుగు రోజులో late అయితే, వారు పడే కంగారుని చూసినప్పుడల్లా అనిపిస్తుంది.

pills, copper T లాంటి Contraception ఏదైనా సరే అది women responsibility  మాత్రమే and is a girl thing అని గుర్తొచ్చినపుడల్లా అనిపిస్తుంది. 

ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టేసి ఇంక పిల్లలు వద్దనుకున్నాక,  ఈ లెక్కలు తొక్కలు వేసుకోవాల్సిన జంజాటం నుంచి తప్పించుకోవాలంటే calm గా tubectomy చేయించుకోవడం తప్ప ఆమెకు వేరే option లేదన్న నిజం తెలిసినప్పుడల్లా అనిపిస్తుంది. 

Male contraception కోసం పేరుకి Condoms ఉన్నాఅవి వాళ్ళని వాళ్ళు STDs కోసం కాపాడుకోవడానికి ఉపయోగపడే సాధనంలానూ,  one night stands లాంటి చోట అనవసరమైన pregnancyల వల్ల వచ్చే తలనొప్పులని తప్పించుకొనే  weaponలా మాత్రమే condoms ని men  consider  చేస్తారనీ, పెళ్ళాల దగ్గర, partners దగ్గర మాత్రం గొణుగుతూ, అయిష్టత చూపుతూ స్త్రీలనే ఎదురు manipulate  చేస్తారన్న స్పృహ వచ్చినపుడల్లా అనిపిస్తుంది.

ఇక uncommitted temporary relations, one night stands, friends with mutual benefitsలోని స్త్రీలు, sex workers సంగతి అస్సలు మాట్లాడుకోకపోవడమే better.  

Do you know what the funniest thing about us women is? 

That, we are all tuned to believe  that Pregnancy is a girl thing. 

The maximum a man is bothered about here is, his health, unwanted havoc, and that is when he uses a condom. Men basically prefer unprotected penetration for extra dose of pleasure. 

ఏ మాత్రం తేడా వచ్చినా consequences (అవి ఏవైనా) అనుభవించాల్సింది ఆమె మాత్రమే! ఎలాగూ వచ్చింది కాబట్టి తప్పక continue చేయాల్సి వచ్చే pregnancy అయినా లేక unwanted pregnancy అయినా దాన్ని endure చేయాల్సింది ఆమె శరీరం మాత్రమే… ఉంచుకోవాలనుకున్నా వద్దనుకున్నా తట్టుకోవాల్సింది ఆమె శరీరమే కాబట్టి. Consequences bear చేయాల్సిన శరీరం నీది కాబట్టి careful గా ఉండాల్సిన బాధ్యత కూడా నీదే అన్నమాట.

ఒక్కరో, ఇద్దరో పిల్లలు చాలనుకునే so called educated couplesలో, పిల్లలని కనే responsibility ఆమె తీసుకుంది కాబట్టి vasectomy నేను చేయించుకుంటాను అని ఎంతమంది పురుషులు ముందుకొస్తున్నారు?  Vasectomyకి, మగతనానికి సంబంధం లేదని doctors ఎంతగా మొత్తుకున్నా, still, vasectomy చేయించుకున్న, చేయించుకోవాలనుకునే మగవారి సంఖ్య వేళ్ళ మీద లెక్కెట్టవచ్చు అనడం అయితే definiteగా exaggeration కాదు. 

ఎందుకంత భయం? వీళ్లెవరికీ భార్యలు pregnancy time లోనూ, delivery time లోనూ physical గా పడే బాధ, నొప్పి అసలు కనపడవా? స్త్రీలు పడే బాధ ముందు వీళ్ళు చేయించుకునే ఆపరేషన్ ఎంత?

ఇలా మాట్లాడడంతోటే, sex ఎదో మా ఒక్కరి కోసమే అన్నట్టు మాట్లాడతారేంటి అని మీదకి దూకే మగ పులులు ఇక్కడ బోలెడుమందని నాకు తెలుసు. sex, సుఖం, పిల్లలు, family అన్నీ స్త్రీ పురుషులిద్దరికీ సంబంధించిన విషయమైనప్పుడు, స్త్రీ ఒక్కటే దానికి సంబంధించిన పూర్తి బాద్యత తీసుకోవాల్సి రావడం ఎంత వరకు సమంజసం?  పిల్లలు వద్దనుకున్నపుడు కనీసం family planning కి సంబంధించిన vasectomy పురుషుడి బాధ్యత కాదా? 

vasectomy is an effective way for family planning

అంతెందుకు? ఎంత మంది మగవారికి తన partner period date తెలుసు? sex సమయంలో ‘నాకు period‘ అని ఆమె చెప్తే తెలుసుకోవడం కాదు. sexకి అడ్డం అవుతుందని కాకుండా, partner మీద, ఆమె health మీద concernతో ఎంతమంది మగవారు, మీ partner period time తెలుసుకుంటారు? ఆమె pmsని, ఆమెకి ఆ timeలో కలిగే చికాకులనీ అర్ధం చేస్కుని ఆమెతో ఎంతమంది cooperative గా ఉంటారు?

నాకు తెలిసి majority మగవారు, ఆ time లో ఆమె చూపించే విసుగు, చిరాకుల మీద sattire లు వేస్తూ, ఆమె విసుక్కుంటే, dominance చూపించడానికి ఇంకాస్త విసుక్కుని గొడవ పెట్టుకునే వారే తప్ప patienceతో ఆమెని అర్ధం చేస్కునే వారు, బహు… బహు… తక్కువ. అలాంటి పురుషులు నాకింతవరకూ ఒక్కరు కూడా తెలీదు. మీకు తెలిస్తే మీలో ఎవరైనా ఉంటే చెప్పండి. తెలుసుకుంటాను. 

మా అమ్మ వాళ్ళ తరంలో, వాళ్ళ వాళ్ళ తాహతు బట్టి, ఇద్దర్నో ముగ్గుర్నో కన్నాక, ఒక మంచి రోజు చూసుకుని పిల్లల్ని పుట్టింటి వాళ్ళకప్పచెప్పి చిన్నాపరేషను అనగా tubectomy అన్నమాట. అది చేయించుకుని వచ్చి మళ్ళీ ఒక వారం పాటు, కుట్లు కదలకుండా జాగ్రత్తగా ఉండి, వాళ్ళ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఏడో రోజో,తొమ్మిదో రోజో కుట్లు విప్పించుకుని మళ్ళీ పిల్లల పనుల్లో పడిపోవడం అనేది వాళ్ళకి చాలా natural అనిపించడం quite unnatural కాదూ?

ఇప్పుడు అంటే C-Sections చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఆ operationలో భాగంగా tubectomy చేయించుకోవడమనేది problem లేని విషయం. ఎలాగూ cut చేసి open చేస్తున్నారు కాబట్టి పనిలో పనిగా tubectomy అయిపోతుంది. కానీ, normal deliveryకి కూడా, family planning బాధ్యత స్త్రీదే అన్నట్టు ఏమీ పట్టనట్టు ప్రవర్తించిన, ప్రవర్తిస్తున్న మగవారిని ఏమనాలి?

C-Sections  లో కూడా doctors,  ‘baby బాగుంది’ అని confirm అయ్యే దాకా tubectomy చేయము అని చెప్పేస్తున్నారు కొంత మంది doctors.  Re-operation కి వచ్చే   డబ్బుల కోసమో, మరింక దేని కోసమో అలా కూడా స్త్రీలకి ఇబ్బందే ఎదురవుతోంది. 

men should consider vasectomy family planning
Image Credit: Getty Images

ఒక మూడేళ్ళ క్రితం friend delivery (normal delivery)కి వెళ్ళినప్పుడు, Doctor ఆమె husbandకి ఖరాఖండిగా చెప్పిందిలా.

“ఆ పిల్ల ఇద్దరు పిల్లల్ని కన్నది. Family planning operation నువ్ చేయించుకోవయ్యా! ఆ పిల్ల కి మాత్రం tubectomy చేయను.”

Ofcourse, ఆ అబ్బాయి ఇంతవరకూ చేయించుకోలేదు. ఇప్పుడప్పుడే చేయించుకుంటాడని కూడా నేను అనుకోవడం లేదు. అది వేరే విషయం. 

ఇదంతా ఒక ఎత్తైతే, అరా కొరా అక్కడక్కడా vasectomy చేయించుకున్న మగాళ్ళు  పెద్ద heroల్లా అనిపించడం, అతని భార్య ఎదో గో …. ప్ప అదృష్టవంతురాలనుకోవాల్సి రావడం స్త్రీలకి పట్టిన దౌర్భాగ్యం కాక మరేంటి? అతని బాధ్యత అతను నిర్వర్తించడంలో అతను చేసిన గొప్ప పనేంటో?  

నేను, మరీ అతి పురుష ద్వేషిలా  కనిపిస్తే నా meaness ని, అజ్ఞానాన్ని కాస్త పెద్ద మనసు చేస్కుని మన్నించండి.  ఇకపోతే, ఇలా గొప్ప పనులు చేసే మగవారిలో మళ్ళీ రెండు రకాలు. 

Casanova లాంటి మగవాళ్లు(అది కూడా వారి సౌకర్యార్థం, ఏ బాదరబందీలు లేకుండా సుఖప్రసవంలా సుఖ sex ని అనుభవించడానికి ఇదొక మార్గం) తప్ప గృహస్థు type మగవాళ్ళు, vasectomy చేయించుకున్న బాపతులు బహు తక్కువ. ఆ బహు తక్కువలో ఉన్న అతికొద్దిమంది మగవారు కూడా వారు కూడా, కంటూ పోతే పెంచాల్సిన బాధ్యత నాదే అన్న భావంతో తప్ప, స్త్రీ భారాన్ని పంచుకోవాలనో, తగ్గించాలనుకునో vasectomy చేయించుకున్న మగపురుషులు అసలు ఉండరని నాకనిపించడం నాదే తప్పేమో! 


నాకు తెలిసిన నా close circle లో vasectomy చేయించుకున్న పురుషులు నలుగురే నలుగురు. 


వారిలో ఒకరు my husband’s father! Vasectomy చేయించుకున్నారన్నఒకే ఒక్క కారణంతో ఆయన పై గౌరవం పెరిగింది అప్పట్లో ఆయన పైన. ఆయన army లో చేస్తూ, second child పుట్టిన వెంటనే vasectomy చేయించేసుకున్నారట.  


ఇకపోతే నాకు తెలిసి honest wife responsibility ని share చేసుకోడానికి చేయించుకున్నది  నలుగురిలో ఒక్కరు మాత్రమే. 

పిల్లలు వద్దనుకున్నపుడు కూడా, pregnant అయి abortion లాంటి painful processని partner face చేసాక కూడా, vasectomy చేయించుకోవాలన్న కనీస ఇంగితం లేని ,ఆలోచన రాని, ఇకపై కలుగుతుందని ఆశ కూడా లేని నాకు తెలిసిన men బోల్డు మంది. 

అందరూ చదువుకున్న వాళ్ళే! అందరూ మంచి jobs చేస్తూ మంచి salaries తీసుకుంటూ ఉన్న వాళ్ళే. అందరికీ awareness ఉంది. కానీ లేనిది ఏంటి?

The answer is simple!!

Lack of Concern, care and empathy towards the partner! Just taking the partner for granted! Men definitely know that they can get the things done even if they are not concerned about this at all! 

And yes… This is heights of insensitivity!

I just hope and wish partners deny sex without you getting your vasectomy done. 

Sex is a mutual thing, so is the pleasure and so has to be the consequences of it. Why is this disparity in bearing the consequences? 

Can you even realise how stressful it is to miss a period without wanting a pregnancy? 

Do you know how strenuous it is both, psychologically and physically to get a foetus aborted? 

And …. And … And …

Even if you know, or already have realised by now… The very important point that you have to yet realise is ‘how much ever you are concerned about this, how much ever you want to share the burden or pain, All you men can do is to just be supportive.’ That’s it!

There is very little that you can do in sharing the physical pain and burden of your wife/partner.  


Enough of your Women’s Day, Mother’s day, Girl child’s day wishes! 

Please think!

Vasectomy just involves 10 min surgical procedure and just a day’s rest!


Guys, It is high time you start being an active and actual part of your sexual life.

4 thoughts on “The Conveniently Ignored Gender Responsibility”

  1. శ్రీనాథ్

    జీర్ణించుకోవడానికి కష్టం గా ఉన్నా చెప్పినవన్నీ నిజాలే , ఎం చేస్తాం పురుషాధిక్యత మాత్రమే జీవన విధానం గా గలిగిన నా ప్రియమైన భారతావని లో పుట్టడం కూడా ఒక కారణం కాదు అని అనలేము. మిగిలిన సో called developed and very నాగరికత కలిగిన దేశాలు ఈ విషయం లో ఏమైనా ముందుకు వెళ్ళాయో లేదో తెలిస్తే మా తర్వాతి తరాన్నైనా ముందు నుంచే నాగరీకరించేందుకు ప్రయత్న పాఠాలు చెబుదాం…. నమస్తే…

    1. Why should we actually even think of what others are doing? Why can’t we be the change that is needed? It’s completely immaterial what the developed countries are doing. 

      The change should start with self. It can inspire many more to take a few more steps towards betterment.

      If we are waiting for someone to bring a change to either our lives or to the nation as a whole, we will keep waiting for generations to come with very little or no change happening. 

  2. కష్టంగా అనిపించినా సరే నిజం ఇది. ఈ నిజాన్ని గ్రహించలేని వాళ్ళు, గ్రహించటానికి ఇష్టం లేని వాళ్ళు ఎంత మంది ఉన్నారో! ఇందులో ఆడా మగా ఇద్దరూ ఉన్నారు అనేది గమనించదగినది. అంత convenienceలో మగవారు, అంత అజ్ఞానం లో ఆడవాళ్లు ఉన్నారా అని doubt కలుగుతుంది.

    Vasectomy తప్పనీ, ప్రకృతి విరుద్దం అనీ, దేవుడు natural గా ఇచ్చిన వాటిని మన సుఖాల కోసం surgery పేరిట చేయకూడదని నమ్మే మగవాళ్ళు, దానితో ఏకీభవించే ఆడవాళ్లు నా చుట్టూనే ఉన్నారని తెలిసి ముందు shock అయ్యాను, తర్వాత జాలి పడ్డాను కానీ చాలా త్వరగానే realise అయ్యాను.

    I realised that my responsibility as a mother in bringing up my male child is bigger than what I thought. When we go through different articles, we understand and interpret in different ways. But this article’s an alarm for us to realise. Change starts with realisation.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top